అన్న ఓంకార్ షోలో బోరున ఏడ్చిన హీరో అశ్విన్ బాబు, నెటిజన్లు ఏమంటున్నారంటే..?
అన్న ఓంకార్ షోలో బోరున ఏడ్చాడు... టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఎందుకు ఇలా ఏడ్చాడు.. నెటిజన్లు ఈ విషయంలో ఏమంటున్నారో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
వారసత్వంగా చాలా మంది నటులు ఇండస్ట్రీకి వస్తారు కాని.. మంచి నటులుగా గుర్తింపు మాత్రం కొంత మందికే వస్తుంది. అలా ఓంకార్ బ్యాక్ గ్రౌండ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు అశ్వీన్ బాబు. స్టార్ డమ్ లాంటి పదాలాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. హీరోగా మాత్రం టాలీవుడ్ లో ఓ మోస్తరు ఇమేజ్ సాధించగలిగాడు. చేసినవి కొద్ది సినిమాలే అయినా మంచి ఫెర్మామెన్స్‌తో ఆకట్టుకున్నాడు అశ్వీన్.
ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తమ్ముడు ఈ అశ్విన్ బాబు. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో.. సినిమాల్లోకి వచ్చిన అశ్వీన్.. తన అన్న ఓంకార్ నటించిన జీనియస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆతరువాత రాజుగారి గది సినిమాల సిరీస్ లో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హిడింబ సినిమా ద్వారా మరోసారి ఆడియన్స్ ను పలుకరించబోతున్నాడు.
అయితే అశ్వీన్ చేసిన రాజుగారి గది సిరీస్ లకు అన్న ఓంకార్ దర్శకుడు కావడం విశేషం. ప్రస్తుతం హిడింబ సినిమాతో రాబోతున్నాడు అశ్వీన్. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. అయితే ఈమూవీ టీమ్ ప్రమోషన్ లో భాగంగా.. ఓంకార్ హోస్ట్ చేసే.. సిక్త్ సెన్స్ అనే గేమ్ షోకు వెళ్లారు. అశ్విన్, హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్, ఈ షోలో సందడి చేశారు.
ఇక ఇక్కడే అసలు ఎమోషన్స్ బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా తన ఎమోషనల్ జర్నీ గురించి హీరోయిన్ నందిత తన నాన్న గురించి ఏడుస్తూ చెప్పగా.. అదే టైమ్ లో.. అశ్విన్ ను ఓంకార్ అడుగుతూ.. నీ లైఫ్ లో ఏదైనా బాధను నాకు చెప్పకుండా దాచావా అని ప్రశ్నించాడు. .. దానికి అశ్విన్ బాగా బాధపడ్డాడు. నా స్ట్రగుల్స్ నీతో చెప్పుకోలేదు అన్నయ్యా అని ఏడవడం స్టార్ట్ చేశాడు. అలా నాకు చెప్పకుండా దాచిపెట్టిన ఒక్క స్ట్రగుల్ చెప్పు అని అడిగారు ఓంకార్.
ఓంకార్ అలా అడగడంతో.. మరింత ఎమోషనల్ అయిపోయాడు అశ్విన్. దాంతో ఓంకార్ మాట్లాడుతూ. నాన్న అయినా, అన్న అయినా అన్ని నేను నీకు, నాకు చెప్పడానికేంట్రా అని అడగ్గా.. అశ్విన్ బోరున ఏడుస్తూ.. ఇలా అన్నాడు. ఇప్పటి వరకూ నన్ను చూసుకుంటూనే ఉన్నావ్.. ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాను అన్నయ్యా..ఈ విషయం తలుచుకుంటే నాకుఏడుపు ఆగడంలేదు అంటూ.. అశ్విన్ బాబు బోరున ఏడ్చాడు.
తమ్ముడ్ని చూసి అన్నఓంకార్ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. తండ్రి మరణంతో.. తమ్ముళ్ల బాధ్యత తీసుకున్నాడు ఓంకార్. తమ్ముళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ.. వారిని సెటిల్ చేసేందుకు ఎంతో కృషి చేశారు. పెద్ద తమ్ముడు అశ్విన్ ను హీరోను చేయగా.. చిన్న తమ్ముడు నిర్మాతగా రాణిస్తున్నాడు. తమ్మళ్ల కోసం ఓంకార్ పడ్డ కష్టం తెలిసి నెటిజన్లు ఆయన్ను శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.