MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pushpa 2: పుష్ప రాజ్ ఈజ్ బ్యాక్... లేటెస్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా? 

Pushpa 2: పుష్ప రాజ్ ఈజ్ బ్యాక్... లేటెస్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా? 

పుష్ప 2 వివాదాల్లో చిక్కుకుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే సమాచారం అందుతుంది. అల్లు అర్జున్ తిరిగి పుష్ప 2 సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 29 2024, 07:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Allu Arjun

Allu Arjun


2021లో విడుదలైన పుష్ప అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న అల్లు అర్జున్... ఏకంగా పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప నార్త్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఫస్ట్ డే పుష్ప హిందీ వసూళ్ళు కేవలం రూ. 3 కోట్లు. మౌత్ టాక్ తో పుంజుకున్న పుష్ప రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


వరల్డ్ వైడ్ పుష్ప అన్ని భాషల్లో కలిపి రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. పుష్ప 2 పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పుష్ప 2 హిందీ రైట్స్ రూ. 200 కోట్లకు అమ్ముడుపోయాయనేది ట్రేడ్ వర్గాల సమాచారం. ఇది కల్కి హిందీ థియేట్రికల్ రైట్స్ కంటే ఎక్కువ. పుష్ప 2కి నార్త్ లో ఎంత డిమాండ్ ఉందో చెప్పడానికి ఇది నిదర్శనం. 
 

36

అనూహ్యంగా పుష్ప 2 చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ మధ్య మనస్పర్థలు తలెత్తాయనే వాదన గట్టిగా వినిపించింది. అల్లు అర్జున్ తన గడ్డాన్ని ట్రిమ్ చేసి ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ కి వెళ్ళాడు. అలాగే సుకుమార్ యూఎస్ వెల్లడమైంది. గొడవ కారణంగా మూవీ షూటింగ్ మధ్యలో వదిలేసి విదేశాలకు వెళ్లిపోయారని కథనాలు వెలువడ్డాయి. అల్లు అర్జున్ టీమ్ ఈ పుకార్లను ఖండించారు. 

46
Allu Arjun

Allu Arjun

ఫైనల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్న సుకుమార్ తీరు పట్ల అల్లు అర్జున్ అసహనానికి గురయ్యాడని. చిత్రీకరణ అంతకంతకు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వివాదం తలెట్టిందనేది కథనాల సారాంశం. ఈ పుకార్లకు చెక్ పెడుతూ అల్లు అర్జున్ పుష్ప 2 లేటెస్ట్ షెడ్యూల్ లో జాయిన్ కానున్నారట. యూఎస్ నుండి వచ్చిన సుకుమార్ రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించాడట. 

56

ఇతర నటుల మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఆగస్టు మొదటివారంలో అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ సెట్స్ లో అడుగుపెడతాడట. కీలకమైన పతాక సన్నివేశాలు అల్లు అర్జున్ మీద ఈ షెడ్యూల్స్ లో చిత్రీకరించనున్నారని సమాచారం. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

66

డిసెంబర్ 24న పుష్ప 2 విడుదల అని ప్రకటించారు. అది ప్రీ ఫోన్ చేస్తూ 6న రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయట. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో పుష్ప 2 నిర్మిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్. ఫహాద్ ఫాజిల్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. సునీల్, అనసూయ, రావు రమేష్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: వీకెండ్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. ముఖేష్ త్యాగంతో మారిపోయిన సీన్...
Recommended image2
Ramayana Movie: ముల్లోకాలకు అధిపతి రావణుడు.. రామాయణ నుంచి యశ్ పోస్టర్ వైరల్
Recommended image3
Thriller Movies: ఒళ్లు గగుర్పొడిచే 5 థ్రిల్లర్ సినిమాలు.. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారెంటీ, ఎక్కడ చూడాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved