MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu Season 8:  హౌస్లోకి ఆ స్టార్ హీరో, ఫ్యాన్స్ కి పండగే, కిక్ ఇచ్చే న్యూస్!

Bigg Boss Telugu Season 8:  హౌస్లోకి ఆ స్టార్ హీరో, ఫ్యాన్స్ కి పండగే, కిక్ ఇచ్చే న్యూస్!

బిగ్ బాస్ తెలుగు 8 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నెలలో రెండో ఆదివారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అంటున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి కాగా ఓ స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 26 2024, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు 8 వచ్చేస్తుంది. ఆడియన్స్ రెండు నెలల ముందు నుంచే ఈ మూడ్ లోకి జారుకున్నారు. కంటెస్టెంట్స్ ఎవరు? హోస్టింగ్ నాగార్జునే చేస్తారా? లేక మరొకరు వస్తారా? షో ఎలా ఉండబోతుంది?... ఇలా అనేక సందేహాలు బిగ్ బాస్ లవర్స్ మైండ్ లో రన్ అవుతున్నాయి. జులై 21న నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో లాంచ్ చేశారు. తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మీకు అన్ లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నామని కామెంట్ జోడించారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Bigg boss telugu 8

Bigg boss telugu 8

నాగార్జున పోస్ట్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈసారి కూడా బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతలు ఆయనే తీసుకుంటున్నారు. వరుసగా ఆరో సీజన్ ని నాగార్జున తన సారధ్యంలో నడిపించనున్నారు. కాగా బిగ్ బాస్ 8 లోగో చూసిన బిగ్ బాస్ రివ్యూవర్స్ అంచనాలు వేస్తున్నారు. సీజన్ 8 డిజైన్ ఇలా ఉంటుందని మైండ్ బ్లోయింగ్ డిటైల్స్ రివీల్ చేస్తున్నారు. 

37
Bigg Boss  Telugu

Bigg Boss Telugu

సీజన్ 6 ప్లాప్ కావడంతో సీజన్ 7 కొత్తగా డిజైన్ చేసి సక్సెస్ అయ్యారు. ఉల్టా పల్టా అంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. గతంలో చూడని పవర్ అస్త్ర, ఫినాలే అస్త్ర వంటి కాన్సెప్ట్స్ సీజన్ 7లో మనం చూశాము. లాంచింగ్ ఎపిసోడ్స్ రెండు నిర్వహించడం కూడా కొత్త టెక్నిక్. లాంచింగ్ ఎపిసోడ్ రోజు 14 మంది కంటెస్టెంట్స్ ని పరిచయం చేసిన నాగార్జున... ఐదు వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరో 5 మంది కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. ఇది టీఆర్పీ పరంగా కలిసొచ్చింది. 

47

ఈ క్రమంలో సీజన్ 7కి మించి విభిన్నంగా సీజన్ 8 రూపొందిస్తున్నారనే వాదన మొదలైంది. అనూహ్యంగా ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌసులు ఉంటాయట. ఒక మెయిన్ హౌస్, రెండోది లూప్ హౌస్. మెయిన్ హౌస్లోకి రావాలంటే... కంటెస్టెంట్స్ కష్టపడాల్సి ఉంటుంది. గేమ్స్, టాస్క్స్ లో సత్తా చాటిన వారు మెయిన్ హౌస్లోకి వచ్చి బిగ్ బాస్ షోలో తమ జర్నీ కన్ఫర్మ్ చేకుంటారట. 

 

57
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

ఇక యూట్యూబర్ బంచిక్ బబ్లు, కుమారీ ఆంటీ, బర్రెలక్క, రీతూ చౌదరి,  అమృత ప్రణయ్, యాదమ్మ రాజు, సోనియా సింగ్, మై విలేజ్ షో అనిల్, శ్వేతా నాయుడు, వినోద్ కుమార్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని సమాచారం. తాజాగా మరొక స్టార్ పేరు వినిపిస్తోంది. హీరో అబ్బాస్ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యారట. 

67

అబ్బాస్ ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో స్టార్ హీరో హోదా అనుభవించాడు. ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. వినీత్-అబ్బాస్-టబు కాంబోలో వచ్చిన ప్రేమ దేశం బ్లాక్ బస్టర్ కొట్టింది. అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ కి ఫ్యాన్స్ ఉండేవారు. అబ్బాస్ క్రాప్ అని ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ పాప్యులర్ అయ్యింది. 
 

77

అయితే అబ్బాస్ కెరీర్ గ్రాఫ్ వేగంగా పడిపోయింది. హీరో నుండి సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. యాక్టింగ్ వదిలేసి విదేశాల్లో స్థిరపడ్డాడు. ఇటీవల తిరిగి ఇండియా వచ్చినట్లు సమాచారం. బిగ్ బాస్ మేకర్స్ అబ్బాస్ ని సంప్రదించగా ఆయన పచ్చ జెండా ఊపాడట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image2
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Recommended image3
ఐటీ ఉద్యోగాలను వదిలేసి సినిమాల్లోకి వచ్చిన స్టార్స్ వీళ్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved