- Home
- Entertainment
- 50 ఏళ్ళ వయసు, బద్రి హీరోయిన్ ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా.. అతడి వల్లే అంటూ బోల్డ్ గా..
50 ఏళ్ళ వయసు, బద్రి హీరోయిన్ ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా.. అతడి వల్లే అంటూ బోల్డ్ గా..
అమీషా పటేల్ 50 ఏళ్ళ వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. దానికి గల కారణాన్ని అమీషా పటేల్ వివరించింది. ఓ వ్యక్తి వల్లే పెళ్ళికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది అంటూ అమీషా బోల్డ్ కామెంట్స్ చేసింది.

బద్రి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ
పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందిన బద్రి చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. 25 ఏళ్ళ క్రితం విడుదలైన బద్రి చిత్రంతో అమీషా పటేల్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బద్రి తర్వాత అమీషా పటేల్ కి తెలుగులో నాని, నరసింహుడు బాలకృష్ణ పరమవీర చక్ర చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత అమీషా పటేల్ కి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.
50 ఏళ్ళ వయసు, ఇంకా సింగిల్ గానే
హిందీలో మాత్రం అమీషా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం అమీషా పటేల్ వయసు 50 ఏళ్ళు. అయినప్పటికీ ఆమె ఇంకా వివాహం చేసుకోలేదు. హీరోయిన్లు ఇటీవల లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు. కానీ 50 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వారు చాలా తక్కువమందే కనిపిస్తారు. ఇంతకీ అమీషా పటేల్ పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండిపోయింది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
అందుకే పెళ్ళికి దూరంగా ఉంటున్నా
తాజా ఇంటర్వ్యూలో అమీషా పటేల్ ఈ ప్రశ్నకి బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చేసింది. తనకు నచ్చిన భాగస్వామి ఇంకా దొరకలేదని అమీషా పటేల్ తెలిపింది. పెళ్లి ప్రపోజల్ తో వచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ వారంతా పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని కండిషన్ పడుతున్నారు. అలా కండిషన్స్ తో వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అమీషా పటేల్ పేర్కొంది.
అతడిని సిన్సియర్ గా ప్రేమించా
గతంలో ఓ నటుడుని చాలా సిన్సియర్ గా ప్రేమించాను. పెళ్లి సమయం వచ్చేసరికి అతడు కూడా సినిమాలు మానేయమని కండిషన్ పెట్టారు. దీనితో అతడి నుంచి విడిపోయా. నా వయసులో సగం కూడా లేని నటులు కొంతమంది నన్ను ప్రేమించారు. కానీ నేనే ఇంట్రెస్ట్ చూపించలేదు. కండిషన్లతో ప్రేమ పెళ్లి లాంటివి వద్దని అనుకున్నాను.
పెళ్ళికి రెడీ, కానీ
హీరోలకు ఎంత వయసొచ్చినప్పటికీ వాళ్ళు నటులుగా చలామణీ అవుతారు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం పెళ్లి తర్వాత అన్నింటికీ దూరమైపోవాలి. ఈ వైఖరి తనకు నచ్చడం లేదని అమీషా పేర్కొంది. అమీషా పటేల్ గతంలోలాగా వరుసపెట్టి సినిమాలు చేయడం లేదు.అరకొరగా అవకాశాలు వస్తున్నాయి. వాటి కోసమే పెళ్లిని ఆమె పణంగా పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికీ సరైన భాగస్వామి దొరికితే తాను పెళ్ళికి సిద్దమే అని అమీషా అంటోంది.