- Home
- Entertainment
- దీపికా పదుకొణెపై నాగ్ అశ్విన్ కౌంటర్ ? మొన్న స్పిరిట్, నేడు కల్కి.. ఆమె డిమాండ్ల చిట్టా ఇదేనా
దీపికా పదుకొణెపై నాగ్ అశ్విన్ కౌంటర్ ? మొన్న స్పిరిట్, నేడు కల్కి.. ఆమె డిమాండ్ల చిట్టా ఇదేనా
దీపికా పదుకొణేని వైజయంతి మూవీస్ సంస్థ కల్కి సీక్వెల్ నుంచి తప్పించారు. ఆమె డిమాండ్లు భరించలేకే ఇలా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ దీపికాకి కౌంటర్ గా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో బాలీవుడ్ నటీమణుల హవా
ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో పాగా వేస్తున్నారు. శ్రద్ధా కపూర్ సాహో చిత్రంలో నటించింది. అలియా భట్ ఆర్ఆర్ఆర్ లో మెరిసింది. జాన్వీ కపూర్ అయితే దేవర, పెద్ది ఇలా వరుస ఆఫర్స్ అందుకుంటోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె అయితే ప్రభాస్ కల్కి 2898 ఎడి చిత్రంలో నటించింది. ఆ మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా 1100 కోట్లు కొల్లగొట్టింది.
కల్కి సీక్వెల్ నుంచి దీపికా అవుట్
కల్కి చిత్రానికి సీక్వెల్ కూడా ప్రకటించారు. కథ కొనసాగింపు కాబట్టి మొదటి భాగంలో నటించిన ప్రధాన నటీనటులు రెండవ భాగంలో కూడా తప్పనిసరిగా ఉండాలి. కానీ దీపికా పదుకొణె కల్కి సీక్వెల్ లో నటించడం లేదని కొన్ని విషయాల్లో విభేదాల కారణంగా ఆమెని తప్పిస్తున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓపెన్ గా ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలా తెలుగు సినిమా నుంచి దీపికా మధ్యలోనే వైదొలగడం కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆమెని తప్పించారు.
మొన్న స్పిరిట్, నేడు కల్కి
ఆ టైంలో బాలీవుడ్ మీడియా ఒక రేంజ్ లో సందీప్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఇప్పుడు కల్కి మూవీ విషయంలో కూడా అదే రిపీట్ అయింది. దీపికా విషయంలో పదే పదే సేమ్ సీన్ రిపీట్ అవుతుండడంతో తప్పు ఎవరిది అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. దీపికాని ఇలా తప్పించడం వెనుక కారణం ఏంటని ఆరా తీస్తే ఆమె నిర్మాతలకు పెట్టిన కొన్ని షాకింగ్ డిమాండ్ వెలుగులోకి వస్తున్నాయి.
దీపికా డిమాండ్ల చిట్టా ఇదే
అందుతున్న సమాచారం మేరకు.. దీపికా పదుకొణె కల్కి 2898 ఎడి చిత్రానికి 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో సీక్వెల్ కి తన రెమ్యునరేషన్ భారీగా పెంచాలని డిమాండ్ చేసిందట. 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వాలని రోజుకు 7 నుంచి 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తానని కండిషన్ పెట్టిందట. దీనికి తోడు తన టీం 25 మంది సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలని డిమాండ్ చేసిందట. రెమ్యునరేషన్, ఖర్చులు కాస్త తగ్గించేందుకు వైజయంతి నిర్మాతలు ఆమెతో పలుమార్లు సమావేశమై చర్చలు జరిపారు. దీపికా ఏమాత్రం తన డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. దీనితో ఆమెకి దూరం జరగాలని వైజయంతి సంస్థ నిర్మయించుకున్నట్లు తెలుస్తోంది.
కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు
అధికారికంగా పోస్ట్ పెట్టి మరీ దీపికా కల్కి 2లో నటించడం లేదని అనౌన్స్ చేశారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా దీపికా పై ఓ సెటైరికల్ పోస్ట్ చేశారు. కల్కి మూవీలో శ్రీకృష్ణుడు, అశ్వథామ మధ్య వచ్చే సన్నివేశాన్ని నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. గతంలో జరిగినదానిని నువ్వు మార్చలేవు, భవిష్యత్తులో ఏం జరగాలో నిర్ణయించుకోగలవు అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో కర్మ నుంచి ఎవరూ తపించుకోలేరు అంటూ శ్రీ కృష్ణుడు చెబుతున్న డైలాగ్ ఉంది. ఇదంతా దీపికాకు కౌంటర్ గా పోస్ట్ చేసినదే అని నెటిజన్లు భావిస్తున్నారు. నెటిజన్లు కూడా దీపికా డిమాండ్ల చిట్టా గురించి తెలుసుకుని దుమ్మెత్తి పోస్తున్నారు.