Liger: అసలు 'లైగర్' అంటే ఏంటి.. పూరి జగన్నాధ్ ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా ?
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న లైగర్ ట్రైలర్ నేడు విడుదలయింది. ట్రైలర్ కి మాస్ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ట్రైలర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ట్విట్టర్ లో అయితే ఈ చిత్రం గురించి పోస్ట్ లు , మీమ్స్ మోతెక్కిపోతున్నాయి. అంతలా లైగర్ మ్యానియా వ్యాపించింది. ట్రైలర్ లోని ప్రతి షాట్ లో పూరి జగన్నాధ్ మేకింగ్ స్టైల్, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. విజువల్స్, యాక్షన్ బ్లాక్స్ థ్రిల్ కలిగిస్తున్నాయి. నెవర్ బిఫోర్ అనిపించే బాడీ ట్రాన్స్ఫర్ మేషన్ తో విజయ్ దేవరకొండ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు.
పూరి స్టైల్, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, అనన్య అందాలతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. లైగర్.. లైగర్ అంటూ లైగర్ ఫీవర్ కనిపిస్తోంది. అసలు ఇంతకీ లైగర్ అంటే ఏంటి ? బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరి ఈ టైటిల్ ఎందుకు ఎంచుకున్నారు ? ఇప్పుడు తెలుసుకుందాం.
Image: Stills from the trailer
ఆడ పులి, మగ సింహాన్నీ క్రాస్ చేస్తే వచ్చిన బ్రీడ్, కొత్త జాతే ఈ 'లైగర్'. లైగర్ మూవీ ట్రైలర్ లో రమ్యకృష్ణ 'ఒక లయన్ కి, టైగర్ కి పుట్టిండు ఆడు.. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ' అనే డైలాగ్ చెబుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ విజయ్ కి తల్లిగా నటించింది. ఆ ఆమె చెప్పే మాటలకు అర్థం అదే. లైగర్ అంటే క్రాస్ బ్రీడ్ జాతి. 1800 సంవత్సరం నుంచే వీటిని ప్రయోగాత్మకంగా క్రాస్ బ్రీడ్ చేయడం ప్రారంభించారు.
లైగర్స్ ప్రకృతి సిద్ధంగా వచ్చిన జాతి కాదు. మనుషులు సృష్టించిన జాతి అనే చెప్పాలి. లైగర్స్ దాదాపు 20 ఏళ్ల వరకు జీవించగలవు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌత్ కోరిలీనా, అమెరికాలో తెల్ల సింహం, తెల్ల పులికి కూడా క్రాస్ బ్రీడ్ లైగర్ సృష్టించారు.
మగ సింహం, ఆడ పులికి జన్మిస్తే దానిని లైగర్ అంటారు. అదే ఆడ సింహం, మగ పులికి క్రాస్ బ్రీడ్ చేస్తే దానిని 'టైగన్ ' అని అంటారు. యానిమల్స్ లో సింహం, పులి చాలా శక్తివంతమైనవి. దెబ్బ తగిలినప్పటికీ బలంగా వేటాడి తీరుతాయి. బలమైన దెబ్బ కొట్టడంలో సింహం, వేగంగా వేయడంలో పులి వాటికవే సాటి. ఈ లక్షణాలని పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో తన హీరోకి రాసుకున్నారు.
అందుకే లైగర్ అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. లైగర్ పదం క్యాచీగా ఉండడంతో మాసెస్ లోకి బాగా వెళ్ళింది. బాక్సర్ గా విజయ్ ప్రత్యర్థులకు తన పంజా పవర్ ఎలా చూపించాడు.. శత్రువులని ఎలా వెంటాడాడు అనేది సినిమాలో కీలకం కాబోతోంది. ఇక పూరి జగన్నాధ్ సినిమాలని గమనిస్తే పోకిరి, లోఫర్, దేశముదురు ఇలా హీరో క్యారెక్టరైజేషన్ కాస్త నెగిటివ్ గా ఉంటుంది. అలా కూడా లైగర్ టైటిల్ విజయ్ కి యాప్ట్ గా మారింది. ఇది లైగర్ టైటిల్ వెనుక ఉన్న కథ.