పెళ్ళైన హీరోయిన్స్ వాళ్లకు నచ్చరు... కాజల్ ఘాటు వ్యాఖ్యలు!
హీరోయిన్ కాజల్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ పై ఘాటైన కామెంట్స్ చేసింది. పెళ్ళైన హీరోయిన్స్ వాళ్లకు నచ్చరంటూ ఎద్దేవా చేసింది. కాజల్ సంచలన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సౌత్ లో స్టార్స్ గా ఎదిగిన నార్త్ భామలు పరిశ్రమపై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. తాప్సి పలుమార్లు విమర్శలు చేసింది. తాజాగా ఈ లిస్ట్ లో కాజల్ అగర్వాల్ చేరింది. కాజల్ ని టాలీవుడ్ ఆదరించింది. ఆమె తెలుగు చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. అనంతరం తమిళ్ లో కూడా చిత్రాలు చేసింది. స్టార్ హీరోల సరసన నటించింది.
తెలుగు, తమిళ చిత్రాలతో ఆమె కెరీర్లో ఎదిగారు. సుదీర్ఘ కాలంగా సౌత్ లో రాణిస్తుంది. అయితే పెళ్ళైన హీరోయిన్స్ ని సౌత్ లో పట్టించుకోరు, పక్కన పెట్టేస్తారని కాజల్ ఎద్దేవా చేసింది. సత్యభామ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కాజల్ అగర్వాల్ ఈ మేరకు సంచలన కామెంట్స్ చేసింది.
Kajal Aggarwal
సౌత్-నార్త్ పరిశ్రమలకు తేడా ఉంది. సౌత్ లో పెళ్ళైన హీరోయిన్స్ బాగా లేరని పక్కన పెట్టేస్తారు. నార్త్ లో అలా కాదు. షర్మిల ఠాకూర్, హేమ మాలిని నుండి ఎప్పటి దీపికా పదుకొనె, అలియా భట్ పెళ్ళయ్యాక కూడా రాణించారు. సౌత్ లో ఆ పరిస్థితి లేదు. నయనతార మాత్రం ఇందుకు మినహాయింపు. ఆమె మంచి చిత్రాలు చేస్తుంది. సౌత్ లో మార్పు తీసుకురావాల్సి ఉంది... అని కాజల్ అన్నారు
కాజల్ 2020 లో వివాహం చేసుకుంది. చాలా కాలంగా తెలిసిన వ్యక్తి గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి సంతానం. పేరు నీల్ కిచ్లు. పెళ్లి తర్వాత కాజల్ కి ఆఫర్స్ తగ్గాయి. ఆ అసహనాన్ని ఈ రూపంలో ప్రదర్శిస్తుంది.
ఇక కాజల్ నటించిన సత్యభామ జూన్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రోల్ చేస్తుంది ఆమె. సత్యభామలో కాజల్ పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. సత్యభామ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా కాజల్ ప్రధాన పాత్ర చేస్తుంది.