- Home
- Entertainment
- విదేశీ వీధుల్లో హేబా పటేల్ అందాల రచ్చ.. ట్రెండీ వేర్ లో మతిపోయేలా పోజులిస్తూ కుమారి హంగామా!
విదేశీ వీధుల్లో హేబా పటేల్ అందాల రచ్చ.. ట్రెండీ వేర్ లో మతిపోయేలా పోజులిస్తూ కుమారి హంగామా!
యంగ్ బ్యూటీ హేబా పటేల్ (Hebah Patel) బ్లాక్ డ్రెస్ లో రచ్చరచ్చ చేస్తోంది. వేకేషన్ కోసం విదేశానికి వెళ్లిన కుమారి అక్కడి వీధుల్లో హంగామా చేస్తోంది. తాజాగా ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది.

అందాల విందులో హేబా పటేల్ రోజురోజుకు హద్దులు దాటేస్తోంది. ఏకంగా బోల్డ్ గ్లామర్ షోతో ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
కొద్ది రోజులుగా ఫేడ్ అవుట్ అయిన ఈ హీరోయిన్ ప్రస్తుతం మళ్లీ జోరు పెంచుతోంది. ఇందుకోసం నెట్టింట వరుసగా తన గ్లామర్ ఫొటోలను వదులుతూ రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. గ్లామర్ షోతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.
తాజాగా హేబా ఫారేన్ నుంచి మంచి గ్లామర్ పిక్స్ ను పంచుకుంది. ఈ సారి ఏకంగా బ్లాక్ అవుట్ ఫిట్ మరింత గ్లామరస్ గా దర్శనమిచ్చింది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్ల మతిపోయేలా ఉన్నాయి. మరోవైపు వీదేశీ వీధుల్లోనూ చిందులేస్తూ అందరనీ ఆకట్టుకుంది.
గ్లామర్ పరంగా ఎప్పుడో మతిపోగొట్టిన హేబా నెట్టింట మాత్రం ప్రతిరోజూ మరింత డోస్ పెంచుతూ ప్రత్యక్షమవుతోంది. చూపుతిప్పుకోనివ్వకుండా ఫొటోలకు పోజులిస్తూ.. గ్లామర్ విందు చేస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
ప్రస్తుతం ఈ ఫొటోలను నెటిజన్లు, హేబా ఫాలోవర్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న హేబా పనిని మరింత సులువు చేస్తున్నారు. అలాగే హేబా కూడా కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేలా ఫొటోషూట్లు చేస్తూ విజువల్ ట్రీట్ అందిస్తోంది.
‘కుమారి 21 ఎఫ్’తో గుర్తింపు తెచ్చుకున్న హేబా ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. కానీ కాలం కలిసి రాకపోవడం.. సరైన హిట్లు లేకపోవడంతో కనుమరుగు అవుతూ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో మళ్లీ ఆఫర్లు అందుకుంటోంది. చివరిగా ‘ఓదెల రైల్వే స్టేషన్’తో అలరించింది. అలాగే ప్రస్తుతం మరో నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.