హేబా పటేల్ అందాల దగదగలు.. రాజహంసలో మెరిసిపోతున్న కుమారి.. ఏముందిరా బాబూ..
హేబా పటేల్.. వరుసగా అందాల దాడికి దిగుతుంది. గ్యాప్ లేకుండా అందాల విందు వడ్డిస్తూ ఫ్యాన్స్ కి ఊపిరాడకుండా చేస్తుంది. చూపు తిప్పుకోని అందంతో మంత్రముగ్దుల్ని చేస్తుంది.

హేబా పటేల్.. తాజాగా దగదగ మెరుస్తుంది. అందాల రాజహంసలా, రాజకుమారిలా మెరిసిపోతుంది. భారీ డిజైనింగ్ వేర్‌లో హోయలు పోయింది. సిగ్గులొలికిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హేబా పటేల్.. బ్యాక్ టూ బ్యాక్ గ్లామర్ ఫోటోలను పంచుకుంటుంది. గ్యాప్ ఇవ్వకుండా ఆమె అందాల దాడికి దిగుతుంది. ఓ రకంగా నెటిజన్లకి ఊపిరాడకుండా చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్‌గా నిలుస్తుంది.
`కుమారి 21ఎఫ్`తో టాలీవుడ్‌లో తన స్టాంప్ వేసుకుంది హేబా పటేల్. ఇప్పటికీ ముద్ర నుంచి బయటపడలేకపోతుంది. అంతగా ఆ సినిమా ప్రభావం చూపించింది. ఇప్పటి వరకు ఆమె ఎన్ని సినిమాలు చేసినా దాన్ని కొట్టే సినిమా రాలేదని చెప్పొచ్చు. అందుకే ఇప్పటికీ హేబాని `కుమారి`గానే పిలుస్తుంటారు. అది ఆమె ఇండస్ట్రీలో వేసుకున్న మార్క్ గా చెప్పొచ్చు.
బోల్డ్ గానూ నటించి మెప్పించింది. తను లిప్ లాక్‌లు పెట్టడం, రొమాంటిక్ సీన్లలోనూ నటించడం అంటే మామూలు విషయం కాదు, ఆ సాహసం ఎప్పుడో చేసింది హేబా. అందుకే తన ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు వరుసగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ కొంత గాడి తప్పింది.
ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌ని గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. నటిగా నిరూపించుకుంటుంది. అవసరమైతే డీ గ్లామర్ రోల్స్ కూడా చేస్తుంది. ఇటీవల `ఓడేలు రైల్వే స్టేషన్`లో ఆమె అలాంటి పాత్రలోనే నటించింది. మరోవైపు ఇటీవల చేసిన `వ్యవస్థ` వెబ్ సిరీస్‌లోనూ న్యాయం కోసం పోరాడే అమ్మాయిగా కనిపించింది. ఇలా బలమైన , సంఘర్షణతో కూడిన పాత్రలు చేస్తూ అలరిస్తుందీ బ్యూటీ.