- Home
- Entertainment
- Ibomma : ఐబొమ్మలో రచ్చ రచ్చ చేస్తున్న హెబ్బా పటేల్.. పుష్ప 2 కూడా వెనక్కి వెళ్ళిపోయింది
Ibomma : ఐబొమ్మలో రచ్చ రచ్చ చేస్తున్న హెబ్బా పటేల్.. పుష్ప 2 కూడా వెనక్కి వెళ్ళిపోయింది
Hebah Patel Dhoom Dhaam movie in Ibomma: కుమారి 21 ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ లో హెబ్బా పటేల్ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన గ్లామర్ తో హెబ్బా పటేల్ యువతకి క్రష్ గా మారింది.హెబ్బా పటేల్ చివరగా నటించిన చిత్రం ధూమ్ ధామ్.

Hebah Patel
Hebah Patel Dhoom Dhaam movie in Ibomma: కుమారి 21 ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ లో హెబ్బా పటేల్ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన గ్లామర్ తో హెబ్బా పటేల్ యువతకి క్రష్ గా మారింది. అయితే కుమారి 21 ఎఫ్ సక్సెస్ ని హెబ్బా పటేల్ సరిగ్గా వినియోగించుకోలేదు. కొన్ని చెత్త సినిమాలు చేయడం వల్ల హీరోయిన్ గా హెబ్బా పటేల్ వెనుకబడింది. అయితే చిన్న చిత్రాల్లో మాత్రం హెబ్బా పటేల్ కి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
Dhoom Dhaam Movie
హెబ్బా పటేల్ చివరగా నటించిన చిత్రం ధూమ్ ధామ్. గత ఏడాది నవంబర్ లో ఈ చిత్రం విడుదలయింది. చేతన్ మద్దినేని, హెబ్బా పటేల్ జంటగా నటించారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, నటి సత్యకృష్ణ పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. రీసెంట్ గా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ అయింది. హెబ్బా పటేల్ క్రేజ్ తో ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతోంది.
Hebah Patel
ఓటీటీ కంటే టొరెంట్ వెబ్ సైట్ ఐబొమ్మలో ధూమ్ ధామ్ చిత్రం ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఎలాంటి చిత్రం విడుదలైన ఐబొమ్మలో లీక్ అవుతుంటాయి. ధూమ్ ధామ్ కూడా లీక్ అయింది. వందల కోట్ల బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న చిత్రాల వరకు ప్రతి ఒక్కటీ ఐబొమ్మలో లీక్ కావడం చూస్తూనే ఉన్నాం.
హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ చిత్రం ఐబొమ్మలో అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాన్ని వెనక్కి నెట్టి మరీ ట్రెండింగ్ గా మారింది. ఇదంతా హెబ్బా పటేల్ క్రేజ్ వల్లే అని నెటిజన్లు అంటున్నారు. ధూమ్ ధామ్, పుష్ప 2 తో పాటు కాస్ట్లీ కోరికలు, ఐడెంటిటీ, డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ చిత్రాలు ట్రెండింగ్ లో ఉన్నాయి.