MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 9: లక్స్ పాపకి గట్టిగా ఇచ్చేసిన హౌస్ మేట్స్.. ఆమె ఉన్నా లేకపోయినా పెద్ద తేడా లేదు

Bigg Boss Telugu 9: లక్స్ పాపకి గట్టిగా ఇచ్చేసిన హౌస్ మేట్స్.. ఆమె ఉన్నా లేకపోయినా పెద్ద తేడా లేదు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో లక్స్ పాప ఫ్లోరా షైనీకి ఊహించని షాక్ తగిలింది. ఆమె ఇప్పటి వరకు జరిగిన నాలుగు వారాల బిగ్ బాస్ సీజన్ లో వరస్ట్ పెర్ఫార్మర్ గా నిలిచింది. దీనితో నాగార్జున ఆమెకి ఓ శిక్ష విధించారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 04 2025, 11:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 9
Image Credit : Asianet News

Bigg Boss Telugu 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో డే 27 శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో నాలుగు వారాల్లో  ఎవరెవరు ఎలా గేమ్ ఆడారు అనే విషయంలో రివ్యూ చేశారు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి గోల్డ్ స్టార్, పర్వాలేదనిపించింది వారికి సిల్వర్ స్టార్, వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి బ్లాక్ స్టార్ ఇచ్చారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
గోల్డ్ స్టార్ దక్కించుకున్న ఇమ్మాన్యుయేల్
Image Credit : Asianet News

గోల్డ్ స్టార్ దక్కించుకున్న ఇమ్మాన్యుయేల్

హౌస్ లో గోల్డ్ స్టార్ దక్కించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ మాత్రమే. దీనితో నాగార్జున ఇమ్మాన్యుయేల్ పై ప్రశంసలు కురిపించారు. ఇమ్మాన్యుయేల్ గేమ్ బాగా ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. అదే విధంగా అందరితో బాగా మాట్లాడుతున్నాడు అని నాగార్జున అన్నారు. ఇమ్మాన్యూల్ లో నాగార్జునకి నచ్చిన మరో అంశం.. అతడి ప్రేమ కథ. ఇమ్మాన్యుయేల్ లవ్ స్టోరీ నాగ్ ని బాగా కదిలించింది. 

Related Articles

Related image1
రష్మిక, రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ ఎందుకు బ్రేకప్ అయింది? 13 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్నా ఎందుకు ప్రేమించిందంటే
Related image2
గ్రాండ్‌⁠గా జాన్వీ కపూర్ స్టెప్ సిస్టర్ ఎంగేజ్మెంట్, బావగారితో మరదళ్ల ఫోజులు చూశారా.. క్రేజీ ఫోటోస్ వైరల్
35
వాళ్ళిద్దరికీ బ్లాక్ స్టార్స్
Image Credit : Asianet News

వాళ్ళిద్దరికీ బ్లాక్ స్టార్స్

ఆ తర్వాత నాగార్జున శ్రీజకి సిల్వర్ స్టార్ ఇచ్చారు. సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్ ఇలా అందరు సభ్యులు సిల్వర్ స్టార్ దక్కించుకున్నారు. కేవలం ఇద్దరికీ మాత్రమే బ్లాక్ స్టార్లు దక్కాయి. వాళ్లిద్దరూ ఎవరో కాదు హరిత హరీష్, ఫ్లోరా షైనీ. హరిత హరీష్ కి నాగార్జున బాగా క్లాస్ పీకారు. హరీష్ అగ్ని పరీక్ష నుంచి వచ్చినప్పుడు అతడిపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయని.. ఆ అంచనాలని హరీష్ ప్రస్తుతం ఏమాత్రం రీచ్ కావడం లేదని అన్నారు. హౌస్ లో ఒక మూలాన కూర్చుని అలా ఉండిపోయాడు అని నాగ్ అన్నారు. 

45
ఎవరో ఒకరికి సర్వెంట్ గా ఉంటోంది
Image Credit : Asianet News

ఎవరో ఒకరికి సర్వెంట్ గా ఉంటోంది

ఇక ఫ్లోరా విషయానికి వస్తే గేమ్ లో అసలు కనిపించడం లేదు. ఎవరో ఒకరికి సర్వెంట్ గా మాత్రమే కనిపిస్తున్నావు. నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవడం లేదు అంటూ ఆమెలో లోపాలు ఎత్తి చూపారు. ఇంతలో ఫుడ్ పంచాయతీ కూడా జరిగింది. సంజన దొంగతనంగా గుడ్లు తినడంతో ఆమె మేడలో నాగార్జున దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు తగిలించారు. 

55
తదుపరి 2 వారాలు నామినేషన్స్ లో ఫ్లోరా షైనీ
Image Credit : Asianet News

తదుపరి 2 వారాలు నామినేషన్స్ లో ఫ్లోరా షైనీ

ఇక చివర్లో మెజారిటీ ఇంటి సభ్యులు ఫ్లోరా షైనీకి షాకిచ్చారు. బ్లాక్ స్టార్స్ పొందిన హరిత హరీష్, ఫ్లోరా షైనీ లని నాగార్జున నిలుచోబెట్టారు. వీరిద్దరిలో ఎవరు హౌస్ కి అవసరం లేదు అని భావిస్తారో వాళ్ళ ఫోటో ని ఒక్కో ఇంటి సభ్యుడు క్రష్ చేయాలి అని నాగార్జున తెలిపారు. ఈ టాస్క్ ని భరణి ప్రారంభించారు. భరణి .. హరీష్ ఫోటో తీసుకుని క్రష్ చేశారు. హరీష్ ఎప్పుడూ నెగిటివ్ మెంటాలిటీతో ఉంటారని, అలాంటి వ్యక్తి హౌస్ కి అవసరం లేదని భరణి అన్నారు. కొందరు మాత్రమే భరణి ఫోటో క్రష్ చేయగా.. మెజారిటీ సభ్యులు ఫ్లోరా షైనీ ఫోటో చించి వేశారు. వారంతా చెప్పిన రీజన్ ఒక్కటే.. ఫ్లోరాకి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు. ఆమె హౌస్ లో ఉన్న లేకపోయినా పెద్ద తేడా లేదు. ఆమె గేమ్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించడం లేదు అని చెప్పారు. దీనితో హౌస్ లో ఇంపాక్ట్ లేని ప్లేయర్ గా ఫ్లోరా షైనీ నిలిచింది. దీనితో నాగార్జున ఆమెకి ఒక శిక్ష విధించారు. రానున్న 2 వారాలు ఫ్లోరా షైనీ డైరెక్ట్ గా నామినేట్ అవుతుందని తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
రష్మిక, రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ ఎందుకు బ్రేకప్ అయింది? 13 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్నా ఎందుకు ప్రేమించిందంటే
Recommended image2
గ్రాండ్‌⁠గా జాన్వీ కపూర్ స్టెప్ సిస్టర్ ఎంగేజ్మెంట్, బావగారితో మరదళ్ల ఫోజులు చూశారా.. క్రేజీ ఫోటోస్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved