‘రామయ్యా వస్తావయ్యా’ ఎందుకు ప్లాఫ్ అయ్యిందో చెప్పిన హరీష్ శంకర్
హరీష్ దర్శకత్వం వహించిన సినిమాల్లో భారీ డిజాస్టర్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’.
పవన్ తో ‘గబ్బర్ సింగ్’వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు నెక్ట్స్ సినిమా అనగానే అప్పట్లో ఓ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అందులోనూ ఎన్టీఆర్ హీరో అంటే మరీనూ.... దాంతో ఈ చిత్రం ఆకాశాన్ని అంటిన ఆ అంచనాలు ను అందుకుందాలేదా అందరూ ఎదురుచూసారు. అయితే హరీష్ శంకర్ తన మ్యాజిక్ ఈ చిత్రంలో చూపించలేకపోయారు. సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే అంత మంచి రైటర్ కమ్ డైరక్టర్, పెద్ద ప్రొడక్షన్ కంపెనీ, స్టార్డమ్ ఉన్న హీరో ఇన్ని కలిసినా సినిమా ఎందుకు పోయిందో చాలా మందికి అర్దం కాలేదు. ఇన్నాళ్లకు హరీష్ శంకర్ స్వయంగా చెప్పుకొచ్చారు.
హరీష్ దర్శకత్వం వహించిన సినిమాల్లో భారీ డిజాస్టర్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. హరీష్ శంకర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మొట్టమొదటిసారిగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. 2013లో విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే డిజాస్టర్ అయిన సినిమాలో ఒకటిగా నిలిచింది. అయితే హరీష్ శంకర్ ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా ఇప్పటికి అది సెట్ కాలేదు.
“రామయ్య వస్తావయ్య సినిమాతో ఎన్టీఆర్ నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అందుకే మళ్లీ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. ఈసారి ఎన్టీఆర్ కి ఎలాగైనా ఒక మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని ఇచ్చి తీరుతాను” అని మీడియా ముఖంగా చెప్పారు గతంలో హరీష్ శంకర్. ఇప్పుడు ఈ సినిమా పోవటానికి తనదైన విశ్లేషణ లాంటీ కామెంట్స్ రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చేసారు.
‘రామయ్యా వస్తావయ్యా’కు సెకండాఫే సమస్య అని హరీష్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఇంటర్వల్లోనే మెయిన్ విలన్ చనిపోతాడని.. అక్కడే సినిమా అయిపోయిందని.. ముందే ప్రధాన విలన్ చనిపోవడంతో ఇంక చూడ్డానికి ఏముందని ప్రేక్షకులు ఫీలయ్యారని హరీష్ అన్నాడు. సెకండాఫ్ కథ, స్క్రీన్ ప్లే సరిగా చేసుకోలేదని ఆయన చెప్పాడు. అయితే తన కెరీర్లో అత్యంత కష్టపడ్డ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’నే అని హరీష్ చెప్పారు.
‘మిరపకాయ్’; ‘గబ్బర్ సింగ్’ తర్వాత తన మీద అంచనాలు పెరిగాయని.. తాను కూడా హ్యాట్రిక్ కొట్టాలన్న ఉద్దేశంతో ఆ సినిమాకు ఎంతో కష్టపడి పని చేశానని.. కానీ కష్టానికి ఫలితం దక్కలేదని.. ఈ సినిమా ఫెయిల్యూర్ విషయంలో తాను ఎవ్వరినీ నిందించని.. అందుకు పూర్తి బాధ్యత తనదే అని హరీష్ స్పష్టం చేశాడు. తాను సక్సెస్‌ను వేరే వాళ్లకు ఆపాదిస్తాను తప్ప, ఫెయిల్యూర్‌ను మాత్రం తనే తీసుకుంటానని అన్నాడు.
‘రామయ్యా వస్తావయ్యా’ లో ఫస్టాఫ్ ఫన్ తో,ఇంటర్వెల్ ట్విస్ట్ తో సేఫ్ గా నడిచిపోయనా సినిమాకు కీలకమైన సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సోసోగా ఉండి నిరాశకలిగించింది. ముఖ్యంగా హరీష్ శంకర్ ..పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరించటానికి ఎంచుకునే ఎలిమెంట్స్ మీదే దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ గత చిత్రాల కన్నా గ్లామర్ గా కనిపించారు... డైలాగ్ డెలవరీలోనూ ఒక రకమైన ఈజ్ చూపిస్తూ వేరియేషన్ చూపించారు. అలాగే సినిమా మొత్తం ఎన్టీఆర్ భుజాలపైనే నడిచింది.
"ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడతీసి కొడతా." అంటూ రాసిన డైలాగు కి థియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ..ఆ డైలాగు సినిమాలో సింక్ కాలేదు. డైలాగు కోసం సీన్ రాసినట్లైంది. నిజానికి హరీష్ శంకర్ బలం డైలాగులు అని మిరపకాయ, గబ్బర్ సింగ్ నిరూపించాయి. దాన్ని కొనసాగిస్తూ ఈ చిత్రంలోనూ వన్ లైనర్స్ ని బాగా పేల్చాడు. ఎమోషన్ డైలాగ్స్ సైతం బాగున్నాయి. హీరో చేత..రికార్డుల గురించి డైలాగ్ చెప్పించి ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించాడు.
హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రమోషన్ల జోరు పెరిగింది. ఇందులో భాగంగా డైరెక్టర్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. . ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ కూడా రిలీజ్ కానుండటంతో ఈ రెండు సినిమాల మధ్య ఏది పైచేయి సాధిస్తుందన్న ఆసక్తి నెలకొంది. టైగర్ నాగేశ్వర రావు, ఈగల్ డిజాస్టర్ల తర్వాత రవితేజ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.