- Home
- Entertainment
- అల్లు అర్జున్ రికార్డులు బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్, `హరి హర వీరమల్లు` ట్రైలర్ సంచలనం
అల్లు అర్జున్ రికార్డులు బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్, `హరి హర వీరమల్లు` ట్రైలర్ సంచలనం
పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ రికార్డులను బద్దలు కొట్టారు. `హరి హర వీరమల్లు` ట్రైలర్ అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా నిలిచింది. టాప్ 5లో నెంబర్ వన్‌గా నిలిచింది.

అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమా ట్రైలర్లు
పవన్ కళ్యాణ్ సరికొత్త సంచలనం సృష్టించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డులను బ్రేక్ చేశారు. `పుష్ప 2` పేరుతో ఉన్న రికార్డులను బ్రేక్ చేశారు పవన్. ఆయన హీరోగా నటించిన `హరి హర వీరమల్లు` మూవీ ట్రైలర్ గురువారం విడుదలైన విషయం తెలిసిందే.
ఇది రికార్డు వ్యూస్ సాధించింది. తెలుగులో ఇది అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా నిలిచింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` మూవీ పేరుతో ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది.
మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ `హరి హర వీరమల్లు` ట్రైలర్
అయితే ఇప్పటి వరకు ఈ చిత్రంపై పెద్దగా బజ్ లేదు, కానీ ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న నెగటివిటీ అంతటినీ బ్రేక్ చేసింది. ట్రైలర్ సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. సినిమాపై హైప్ పెంచింది.
బిజినెస్ పరంగానూ ఈ హైప్ క్రియేట్ కావడం విశేషం. ఇందులో పవన్ కళ్యాణ్ మాస్ డైలాగ్‌లు, ఆయన ఎలివేషన్లు, విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి. అందుకే తెలుగులో ఇది 24 గంటల్లోనే 44.7 మిలియన్ వ్యూస్‌తో టాప్ వ్యూస్ సాధించిన తెలుగు మూవీగా నిలవడం విశేషం.
టీమ్ ప్రకటించిన అధికారిక లెక్క ప్రకారం ఈ చిత్ర ట్రైలర్ 48 మిలియన్స్ వ్యూస్ సాధించినట్టు వెల్లడించింది. ఇది ఇంకా ఆల్ టైమ్ రికార్డు కావడం విశేషం. అంతేకాదు అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లో ఇది 61.7 మిలియన్స్ వ్యూస్ రాబట్టడం విశేషం. ఇలా తెలుగులో నెంబర్ వన్ స్థానంలో ఈ మూవీ ట్రైలర్ నిలిచింది.
టాప్ 2 లో అల్లు అర్జున్ `పుష్ప 2` ట్రైలర్
అంతకు ముందు ఈ రికార్డు అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` సినిమా పేరుతో ఉంది. `పుష్ప 2` ట్రైలర్ 44.6 మిలియన్స్ వ్యూస్ సాధించింది. నిన్నటి వరకు ఈ మూవీ హైయ్యెస్ట్ వ్యూస్ సాధించిన మూవీగా `పుష్ప 2` ట్రైలర్ నిలిచింది.
కానీ దాన్ని ఇప్పుడు `హరి హర వీరమల్లు` బ్రేక్ చేయడ విశేషం. ఇక సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్లు వసూలు చేసింది.
టాప్ 3లో మహేష్ బాబు `గుంటూరు కారం` ట్రైలర్
ఇక తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 ట్రైలర్స్ చూస్తే, మొదటి రెండు స్థానాల్లో `హరిహర వీరమల్లు`, `పుష్ప2` నిలవగా, మూడో స్థానంలో మహేష్ బాబు `గుంటూరుకారం` ఉంది. దీనికి 37.6మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ప్రకాష్‌రాజ్ విలన్‌గా నటించారు. రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషించారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
టాప్ 4లో రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` ట్రైలర్
నాల్గో స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. ఆయన హీరోగా నటించిన `గేమ్ ఛేంజర్` ట్రైలర్ ఏకంగా 36.2 మిలియన్ వ్యూస్ సాధించింది. శంకర్ దర్శకత్వంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఎస్ జే సూర్య, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది.
టాప్ 5లో ప్రభాస్ `సలార్`
ఐదో స్థానంలో ప్రభాస్ నటించిన `సలార్` నిలిచింది. దీనికి 32.5 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన `సలార్`లో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ రావాల్సి ఉంది.