- Home
- Entertainment
- Hansika Upcoming film: ‘మై నేమ్ ఈజ్ శృతి’లో హన్సిక ఇలా కనిపించనుంది.. ఏకకాలంలో మూడు భాషల్లో మూవీ రిలీజ్..
Hansika Upcoming film: ‘మై నేమ్ ఈజ్ శృతి’లో హన్సిక ఇలా కనిపించనుంది.. ఏకకాలంలో మూడు భాషల్లో మూవీ రిలీజ్..
టాలీవుడ్ హీరోయిన్ హన్సిక మోత్వాని (Hansika Motwani) తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘మై నేమ్ ఈజ్ శృతి’ మూవీలో స్ట్రాంగ్ రోల్ లో కనిపించనుంది. గతంలో తను చేసిన సినిమాలకంటే ఈ మూవీలో హన్సిక రోల్ ఆసక్తిగా ఉండనుంది.

గ్లామర్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని ఈ ఏడాది అరడజన్ సినిమాల్లో నటిస్తోంది. కొన్నాళ్ల పాటు కేరీర్ లో కాస్తా నెమ్మదిగా కదిలిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో పరుగులు పెడుతోంది. ఈ ఏడాది వెనువెంటనే తన సినిమాలను రిలీజ్ చేసుకొని ప్రేక్షకులను అలరించనుంది.
హన్సిక హీరోయిన్ గా తన డెబ్యూ ఫిల్మ్ తెలుగులో చేసింది. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలుత వెండితెరకు పరిచయం అయ్యింది. 2001 నుంచి 2004 వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగింది. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagganadh) హన్సికను సౌత్ ఆడియెన్స్ కు పరిచయం చేశారు. ఇక అప్పటి నుంచి హన్సిక తన పాపులారిటీని పెంచుకుంటూనే వస్తోంది.
అయితే కొద్దికాలంగా హన్సికకు సరైన సినిమాల్లో అవకాశాలు దక్కడం లేదు. దీంతో ఇన్నాళ్లు చిన్న సినిమాలతోనే సరిపెట్టుకుంటోంది. తెలుగులో చివరిగా హీరో సందీప్ కిషన్ నటించిన ‘తెనాల రామక్రిష్ణ బీఏ, బీఎల్’ చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం అవరేజ్ అనిపించుకోవడంతో హన్సికకు పెద్దగా కలిసి వచ్చిందేమీ లేదు.
మాస్ మహారాజ రవితేజ నటించిన ‘పవర్’ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో హన్సిక హవా మళ్లీ మొదలైంది అనిపించినా.. అగైన్ రొటీన్ స్టోరీస్ కే ఓకే చెప్పడంతో మంచి హిట్ ను సొంతం చేసుకోలేకపోతోంది. కానీ ఈ ఏడాది రాబోతున్న తన అప్ కమింగ్ ఫిల్మ్ హన్సికను మరోమెట్టు ఎక్కించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలుగులో హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’ మూవీలో లీడ్ రోల్‌లో నటిస్తోంది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని బురుగు రమ్యాప్రభాకర్ నిర్మించారు. త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో హన్సిక స్ట్రాంగ్ లేడీగా కనిపించనుంది. తన జీవింతంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటుందని తెలుస్తోంది. మహిళలను రక్షించే పాత్రలో కనిపించనున్నది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంపైనే ప్రస్తుతం హన్సిక ఆశలు పెట్టుకుంది.
మూవీలో హన్సిక అన్ని అసమానతలతో పోరాడుతూ, తన జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొంటోంది. అవయవాల మాఫియా నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ప్రతి సన్నివేశాన్ని ఆసక్తిని కలిగించేలా ఉంటుందని నిర్మాత తెలిపారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాని రిలీజ్ చేయనుండటం విశేషం. త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.