- Home
- Entertainment
- హైపర్ ఆది నోరు మూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్.. హీరో ముందు ఆయన పరువు తీయడంతో..
హైపర్ ఆది నోరు మూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్.. హీరో ముందు ఆయన పరువు తీయడంతో..
బుల్లితెరపై వచ్చే డ్యాన్స్ కార్యక్రమాల్లో ఢీ షో ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తోంది. ఢీ సెలెబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఇటీవలే ప్రారంభం అయింది. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు వినోదాన్ని కూడా అందించే విధంగా ఈ షోని ముస్తాబు చేశారు.

బుల్లితెరపై వచ్చే డ్యాన్స్ కార్యక్రమాల్లో ఢీ షో ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తోంది. ఢీ సెలెబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఇటీవలే ప్రారంభం అయింది. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు వినోదాన్ని కూడా అందించే విధంగా ఈ షోని ముస్తాబు చేశారు. ఢీ సెలెబ్రిటీ స్పెషల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలయింది.
సీజన్ 1 కి ప్రణీత సుభాష్ జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సీజన్ 2 కోసం యాపిల్ బ్యూటీ హన్సిక రంగంలోకి దిగేసింది. గత ఏడాది వివాహం చేసుకున్న హన్సిక ఇలా బుల్లితెరపై కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తాజాగా విడుదలైన ప్రోమో నవ్వులు పూయిస్తోంది. ఈ సీజన్ కి కూడా నందు యాంకర్ గా కొనసాగుతున్నాడు.
శేఖర్ మాస్టర్ జడ్జిగా కొనసాగుతున్నారు. ఇక హైపర్ ఆది నవ్వులు పూయిస్తూ తన సెటైర్లతో షోకి కొత్త జోష్ తీసుకువస్తున్నాడు. లేటెస్ట్ ఎపిసోడ్ కి హీరో సుధీర్ బాబు అతిథిగా హాజరయ్యారు. సుధీర్ బాబు ముందు హైపర్ ఆది.. శేఖర్ మాస్టర్ పరువు తీశారు.
హైపర్ ఆది మాట్లాడుతూ.. మీరు ఎస్ఎంఎస్ చిత్రం ఒక్కసారే చేశారు. కానీ శేఖర్ మాస్టర్ కొందరికి ప్రతి రోజు ఎస్ఎంఎస్ చేస్తుంటారు అని సెటైర్ వేశారు. మీ ప్రేమ కథా చిత్రంలో దెయ్యాన్ని చూసి మీరు పారిపోతారు.. కానీ శేఖర్ మాస్టర్ ని చూసి దెయ్యమే పారిపోతుంది అని హైపర్ ఆది మరో పంచ్ వేశాడు.
దీనితో కొత్తగా వచ్చిన హన్సిక శేఖర్ మాస్టర్ కి సపోర్ట్ చేస్తూ హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చింది. ఏ ఆది. శేఖర్ మాస్టర్ చాలా మంచి వారు.. నీ నోరు మూసుకో అంటూ హన్సిక ఇచ్చిన వార్నింగ్ చాలా ఫన్నీగా ఉంది. మీకు నాలుగు రోజుల తర్వాత ఆయన గురించి అర్థం అవుతుంది చూడండి అని హైపర్ ఆది అన్నారు.
నాలుగు రోజుల తర్వాత ఎందుకు ఇప్పుడే వెళ్ళిపో అని హన్సిక చెప్పడం.. దానికి హైపర్ ఆది ఇచ్చిన హావభావాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. శేఖర్ మాస్టర్, హైపర్ ఆది కాంబినేషన్ ఢీ షోలో బాగా వర్కౌట్ అవుతోంది.