- Home
- Entertainment
- మాజీ ప్రియుడి హత్యకి కుట్ర.. రెండో అంతస్తు నుంచి తోసేసిన 'గుప్పెడంత మనసు' సీరియల్ నటి, అరెస్ట్..
మాజీ ప్రియుడి హత్యకి కుట్ర.. రెండో అంతస్తు నుంచి తోసేసిన 'గుప్పెడంత మనసు' సీరియల్ నటి, అరెస్ట్..
సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో చోటు చేసుకునే సంఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరిగింది. తమ సుఖానికి అడ్డు వస్తే అది భర్త అయినా, ప్రియుడిని అయినా హతమార్చడం లాంటి సీన్స్ సినిమాల్లో, సీరియల్స్ లో చూస్తుంటాం.

సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో చోటు చేసుకునే సంఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరిగింది. తమ సుఖానికి అడ్డు వస్తే అది భర్త అయినా, ప్రియుడిని అయినా హతమార్చడం లాంటి సీన్స్ సినిమాల్లో, సీరియల్స్ లో చూస్తుంటాం. అలాంటి దారుణ సంఘటనకి 'గుప్పెడంత మనసు' టివి సీరియల్ నటి నాగ వర్దిని పాల్పడింది. ఫలితంగా బంజారా హిల్స్ పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. నాగ వర్దిని తెలుగు టివి సీరియల్ నటిగా రాణిస్తోంది. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ లాంటి సీరియల్స్ లో ఆమె నటిస్తోంది. ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాలతో చిక్కుల్లో పడింది. టివి సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్న సూర్యనారాయణతో నాగ వర్దిని నాలుగేళ్ళ పాటు సహజీవనం చేసింది. కొన్ని నెలల క్రితం వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు.
దీనితో నాగావర్ధిని తన తో పాటు సీరియల్స్ లో నటిస్తున్న దాసరి శ్రీనివాస్ రెడ్డితో సహజీవనం మొదలు పెట్టింది. సూర్య నారాయణ ఉంటున్న అపార్ట్మెంట్ లోనే మరో ఇంటిలో నాగ వర్దిని తన తాజా ప్రియుడు శ్రీనివాస్ రెడ్డితో ఉంటోంది. దీనితో వీరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఇటీవల సూర్య నారాయణ నేరుగా నాగ వర్దిని ఇంట్లోకి వెళ్లి.. శ్రీనివాస్ రెడ్డిని వదిలేయాలి అని తనతో కలసి జీవించాలి అని బలవంతం చేశాడు.
ఈ క్రమంలో వీరి మధ్య పెద్ద గొడవే జరిగింది. తమ ప్రేమకు అడ్డు తగులుతున్నాడని భావించిన నాగ వర్దిని తాజా ప్రియుడుతో కలసి సూర్యనారాయణ హత్యకి పథకం వేసింది. అదును చూసి రెండవ అంతస్తు నుంచి అతడిని తోసేశారు. దీనితో సూర్య నారాయణ తీవ్ర గాయాలతో చావు బతుకుల్లో ఉన్నాడు.
దీనితో బంజారా హిల్స్ పోలీసులు నాగ వర్దిని, శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. అయితే నాగ వర్దినికి ఆల్రెడీ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. భర్త నుంచి విడిపోయాక హైదరాబాద్ వచ్చి ఇలా టివి సీరియల్స్ లో చిన్న రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సూర్య నారాయణ, శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ స్నేహితులు అట.
నాగ వర్ధినికి శ్రీనివాస్ రెడ్డిని పరిచయం చేసింది సూర్యనారాయణే. అసలు హత్య వరకు వీరి సంఘటన ఎందుకు వెళ్ళింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.