Sankrathi Movies OTT : ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు.. అన్నీ ఫిబ్రవరిలోనే.. ఈ డేట్లు గుర్తుంచుకోండి!
2024 సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేశాయి. చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఆ సినిమాలన్నీ ఈ నెలలోనే ఓటీటీ Ottలోకి రాబోతున్నాయి. ఏఏ మూవీ ఏఏ డేట్లలో రాబోతుందనేది చూద్దాం..
విక్టరీ వెంకటేశ్ - శైలేష్ కొలను కాంబలో వచ్చిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘సైంధవ్’ Saindhav. ఈ చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఓటీటీలోకి రెండు రోజుల్లో ఫిబ్రవరి 3న రానుంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
మహేశ్ బాబు Mahesh Babu లేటెస్ట్ ఫిల్మ్ గుంటూరు కారం Guntur Kaaram. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లోకి ఫిబ్రవరి 9న లేదంటే 16న రాబోతోంది.
తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో చిన్న సినిమాగా వచ్చి సంక్రాంతి విన్నర్ గా నిలిచిన చిత్రం ‘హనుమాన్’ HanuMan. జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి మాత్రం మార్చిలో రాబోతోంది. మార్చి 22 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
తమిళ సైఫై చిత్రం ‘ఆయలాన్’ Ayalaan కూడా ఈనెలలోనే ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ మూవీ కూడా తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రాలేదు... డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ SunNxtలో ఫిబ్రవరి 16న విడుదల కాబోతోంది.
తమిళస్టార్ ధనుష్ Dhanush రీసెంట్ యాక్షన్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ Captain Miller. సంక్రాంతికే విడుదలైంది. కానీ తమిళంలోని వచ్చింది. తెలుగులో రాలేదు. ఇక డైరెక్ట్ గా ఓటీటీ వెర్షన్ లోనే రాబోతోంది. ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ రిలీజ్ కాబోతోంది.
కింగ్, అక్కినేని నాగార్జున Nagarjuna Akkineni సంక్రాంతి బరిలో ‘నా సామిరంగ’ Naa Saami Rangaతో నిలిచారు. ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. విజయ్ బిన్నీ దర్శకత్వ వహించారు. ఇక ఓటీటీలో ఫిబ్రవరి 15న విడుదల కాబోతోంది. హాట్ స్టార్, హులూలో స్ట్రీమింగ్ కానుంది.