అల్లు అర్జున్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన 'AAA సినిమాస్'.. లోపల అబ్బురపరిచే దృశ్యాలు
నేడు గ్రాండ్ గా అల్లు అర్జున్ చేతుల మీదుగా AAA సినిమాస్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ తో పాటు ప్రత్యేక అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి అంశంలో తన ప్రత్యేకత చూపిస్తుంటారు. తాను చేసే చిత్రాల్లో వైవిధ్యం కోరుకుంటారు. సినిమాల్లో అయినా బిజినెస్ లో అయినా అంతే. అల్లు అర్జున్ ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో చేతులు కలిపి ఓ భారీ మల్టిఫ్లెక్స్ ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లో గతంలో సత్యం థియేటర్ ఉన్న చోట ఈ మల్టిఫ్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. మహేష్ బాబు ఏఎంబి సినిమా తరహాలో ఈ మల్టిఫ్లెక్స్ కి ఏషియన్ అల్లు అర్జున్ (AAA) సినిమాస్ అని నామకరణం చేశారు. ప్రేక్షకులని అబ్బుర పరిచే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో AAA సినిమాస్ రూపుదిద్దుకుంది. ఇటీవల AAA సినిమాస్ నిర్మాణం పూర్తయింది. దీనితో ప్రారంభోత్సవానికి సరైన టైం కోసం ఎదురుచూశారు.
ఆ సమయం రానే వచ్చింది. నేడు గ్రాండ్ గా అల్లు అర్జున్ చేతుల మీదుగా AAA సినిమాస్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ తో పాటు ప్రత్యేక అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.
ప్రస్తుతం AAA సినిమాస్ లో ఇటీవల వచ్చిన భారీ చిత్రాల ట్రైలర్స్ ప్రదర్శిస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ని కళ్లారా చూసేందుకు పలువురు తారలు AAA సినిమాస్ ని సందర్శిస్తున్నారు. తన మల్టిప్లెక్స్ లాంచింగ్ కి బన్నీ హాజరు కావడంతో ఆ ప్రాంతం మొత్తం అభిమానులతో రద్దీగా మారింది.
AAA సినిమాస్ లోపల దృశ్యాలు అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. ఇందులో మొత్తం 5 స్క్రీన్స్ ఉంటాయి. అందులో ఒకటి అల్ట్రా హెచ్ డి సిస్టం కలిగిన ఎల్ ఈడీ స్క్రీన్. మిగిలినవి నార్మల్ ప్రొజెక్టర్ స్క్రీన్స్. అయితే లోపల సీటింగ్, ఇంటీరియర్ అబ్బురపరిచే విధంగా ఉంది. అలాగే భారీ ఫుడ్ కోర్టుని కూడా ఏర్పాటు చేశారు.
వీటిలో స్రీన్ 1 అతి పెద్దగా ఏర్పాటు చేశారు. ఇందులో ఆదిపురుష్, హరిహర వీరమల్లు, ఆర్ఆర్ఆర్, భగవంత్ కేసరి లాంటి చిత్రాల టీజర్స్, ట్రైలర్స్ ప్రదర్శించారు. AAA సినిమాస్ ని వీక్షించేందుకు అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ, ఇతర సెలెబ్రిటీలు వెళ్లారు. రేపు విడుదలయ్యే ఆదిపురుష్ చిత్రం AAA సినిమాస్ లో ప్రదర్శించబోయే తొలి మూవీ. ఈ మల్టిఫ్లెక్స్ లో టికెట్ ధర రూ.295గా నిర్ణయించారు.