MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Pakka Commercial Review:పక్కా కమర్షియల్ ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్ స్క్రీన్ ప్రజెన్స్ కేక.. మైనస్ ఏంటంటే

Pakka Commercial Review:పక్కా కమర్షియల్ ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్ స్క్రీన్ ప్రజెన్స్ కేక.. మైనస్ ఏంటంటే

వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. లాయర్ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నాడు. 

Sreeharsha Gopagani | Updated : Jul 01 2022, 08:56 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. లాయర్ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే మారుతి స్టైల్ లో కామెడీ పంచ్ లతో ఆకట్టుకుంటోంది. మారుతి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఉంటుంది. 

27
Asianet Image

మరి నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రం ఎలా ఉందో, ట్విట్టర్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్విటర్ లో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ ఉందనేది ఉత్కంఠగా మారింది. అసలే జనాలు థియేటర్స్ కి రావడం లేదు. దీనితో పక్కా కమర్షియల్ టీం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. 

37
Asianet Image

సినిమా ప్రారంభంలోనే గోపీచంద్ పక్కా కమర్షియల్ లాయర్ అవాతారం ఎత్తుతాడు. అతడు అంతటి కమర్షియల్ లాయర్ ఎందుకు అయ్యాడనే బ్యాక్ స్టోరీ ఉంటుంది. లాయర్ గెటప్ లో గోపీచంద్ అదరగొడుతున్నాడు. సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కథ గురించి మాత్రం ట్విట్టర్ లో మిశ్రమ స్పందన వస్తోంది. 

47
Asianet Image

ఫస్ట్ హాఫ్ మరీ ఓవర్ గా ఉన్నప్పటికీ సింగిల్ లైన్ పంచ్ లతో డీసెంట్ గా ఉంది. గోపీచంద్ స్టైలిష్ గా, రాశి ఖన్నా అందంగా కనిపిస్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ ట్వీట్ చేస్తున్నారు. కానీ కథ బలంగా లేదు అంటున్నారు. 

57
Asianet Image

మరికొందరు నెటిజన్లు ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉందని అంటున్నారు. మారుతి కామెడీ సన్నివేశాలతో బాగా ప్రయత్నించాడు. కానీ వాటిలో కొన్ని మాత్రమే వర్కౌట్ అయ్యాయి. సంగీతం సినిమాకి పెద్ద మైనస్. యాక్షన్ ఎపిసోడ్స్ బావున్నాయి అని చెబుతున్నారు. 

67
Asianet Image

మరి కొంతమంది నెటిజన్లు సినిమా ఆశించిన స్థాయిలో లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు, గోపీచంద్ ఫ్యాన్స్ యుఎస్ నుంచి పక్కా కమర్షియల్ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి అంటున్నారు. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

77
Asianet Image

గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బావుంది. కానీ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కావడం లేదు అంటూ ప్రీమియర్స్ చూస్తున్న నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. మొత్తంగా పక్కా కమర్షియల్ చిత్రానికి కొంత పాజిటివ్, కొంత యావరేజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి అనే చెప్పాలి. అన్ని షోలు పూర్తయ్యాక ఈ చిత్రానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ రానుంది. మారుతి మూవీ కాబట్టి కామెడీ ప్రియులు, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఉంది.   

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories