MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • God Father Review: చిరంజీవి `గాడ్‌ ఫాదర్‌` ట్విట్టర్‌ రివ్యూ.. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌?

God Father Review: చిరంజీవి `గాడ్‌ ఫాదర్‌` ట్విట్టర్‌ రివ్యూ.. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌?

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన  లేటెస్ట్ మూవీ  `గాడ్‌ ఫాదర్‌`. సల్మాన్‌ ఖాన్‌,  నయనతార, సత్యదేవ్‌  నటించిన ఈ  చిత్రం దసరా కానుకగా నేడు బుధవారం విడుదలైంది.  మరి సినిమా ఎలా ఉందనేది ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం. 

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 05 2022, 04:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మెగాస్టార్‌ చిరంజీవి రీఎంట్రీ తర్వాత `ఖైదీ నెంబర్‌ 150` హిట్‌తో అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా చేసిన పీరియాడికల్‌ మూవీ `సైరా` ప్రశంసలకే పరిమితమైంది. ఇటీవల `ఆచార్య`తో వచ్చారు చిరు. ఈ సినిమా డిజాస్టర్‌ అయ్యింది. రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటించి ఆ సినిమా చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌. ఈ సినిమా విషయంలో చిరు అనేక అనుమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనుకుంటున్నారు చిరు. ఇప్పుడు `గాడ్‌ ఫాదర్‌`(God Father)తో వస్తున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన మోహన్‌లాల్‌ నటించిన `లూసీఫర్‌`ని రీమేక్‌గా `గాడ్‌ ఫాదర్‌` తెరకెక్కించారు. తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసిన రూపొందించారు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనతోపాటు లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, సత్యదేవ్‌  కీలక పాత్రలు పోషించారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన చిత్రమిది. ఎన్వీ ప్రసాద్‌,  ఆర్‌బీ చౌదరి  సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5(నేడు బుధవారం) విడుదలవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. మరి సినిమా ఎలా ఉందనేది నెటిజన్లు ట్విట్టర్‌  ద్వారా పోస్టులు పెడుతున్నారు. `గాడ్‌ ఫాదర్‌`  ట్విట్టర్‌  టాక్‌(God Father Twitter Talk)ఎలా ఉందో చూద్దాం. 

38

`గాడ్‌ ఫాదర్‌` కథ అందరికి తెలిసిందే. ఎందుకంటే `లూసీఫర్‌` చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేశారు. ఆల్మోస్ట్ రెగ్యూలర్‌ సినిమాలు చూసే ప్రతి ఒక్కరు  ఈ చిత్రాన్ని ఆల్‌రెడీ చూసే ఉంటారు. సీఎం చనిపోవడంతో ఆయన అల్లుడు సీఎం పీఠం ఎక్కాలని  ప్లాన్‌ చేస్తుంటాడు. అయితే సీఎం కొడుకు అజ్ఞాతంలో ఉంటాడు. కానీ తెరవెనుక రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటాడు. మరి  అల్లుడి కుట్రలను ఎలా భగ్నం చేశాడు,  తను సీఎం అయ్యాడా లేదా? అనేది అసలు కథ. God Father Twitter Review.

48

సినిమాకి పాజిటివ్‌ రివ్యూస్‌ వస్తున్నాయి. `బాస్‌ ఈజ్‌ బ్యాక్‌` అంటున్నారు. చిరంజీవికి సరిగ్గా సరిపోయిన స్టోరీ అని, ఆయన తన విశ్వరూపం చూపించారని చెబుతున్నారు సినిమా చూసిన ఆడియెన్స్. ప్యూర్‌ మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, చిరంజీవి  స్వాగ్‌ నెక్ట్స్ లెవల్‌. సల్మాన్‌ తన పాత్రని బాగా చేశాడని అంటున్నారు. 
 

58

అదే సమయంలో కొన్ని నెగటివ్‌ పోస్ట్ లున్నాయి. ఫస్టాఫ్‌ పర్వాలేదని, సెకండాఫ్‌ బాగా డౌన్‌ ఉందని,  సినిమా అంతలేదని, సల్మాన్‌ ఖాన్‌ ఎపిపోడ్‌  చాలా నిరాశ పరిచిందని అంటున్నారు. ఆయన  యాక్షన్‌ సీన్లు సీజీ  వర్క్ చాలా  దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. క్లైమాక్స్  నిరాశ పరిచేలా ఉందని చెబుతున్నారు. చిరంజీవి లుక్‌, ఎడిటెడ్‌ ఎక్స్ ప్రెషన్స్ బాగాలేవని, సల్మాన్‌  రోల్‌ బాగా  నిరాశ పరుస్తుందని అంటున్నారు.

God Father Twitter Review.

68

ఫస్టాఫ్‌ చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, ఎక్కడా అనవసరమైన సీన్లు లేవని చెబుతున్నారు. మెగాస్టార్‌ ఫ్యాన్స్ పండగ చేసుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయట. చిరంజీవి,  సత్యదేవ్‌ల మధ్య నడిచే పొలిటికల్‌ డ్రామా ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగిందట. మాస్‌ యాక్షన్‌ సన్నివేశాలకు సంగీత దర్శకుడు థమన్‌ బీజీఎం మరో లెవల్‌కి తీసుకెళ్లిందట. ఇంటర్వెల్‌ సీన్లు  అదిరిపోయాయని అంటున్నారు. 

78

ఫస్టాఫ్‌లో 12 నిమిషాల పాటు ఉండే ఓ ఫైట్‌ సీన్‌ గతంలో ఎప్పుడూ  చూడని విధంగా ఉంటుందని,  థియేటర్లలో అది  ఫైరింగ్‌ ఎలిమెంట్‌ అంటున్నారు. క్లైమాక్స్ మాస్‌ ఎలివేషన్‌ అదిరిపోయేలా ఉందని టాక్‌. పవన్‌ కళ్యాణ్‌కి `గబ్బర్‌ సింగ్‌` ఎలాగో, చిరంజీవికి `గాడ్‌ ఫాదర్‌` అలాంటి చిత్రమవుతుందట. చిరు ఎంట్రీ సీన్‌ బాగుందని, సత్యదేవ్‌,  నయనతార  ఓకే అనిపించారని, ప్రీ ఇంటర్వెల్‌ మాస్‌  ఫైర్‌ ని, ట్విస్ట్ మైండ్‌ బ్లోయింగ్‌ అట.
 

88

ఓవరాల్‌గా యావరేజ్‌ రివ్యూస్‌ వస్తున్నాయి. ఫ్యాన్స్ ఆహా.. ఓహో అన్నట్టు ఉన్నా,  సాధారణ ఆడియెన్స్ కి మాత్రం యావరేజ్‌గానే అనిపిస్తుందట. కొంత పాజిటివ్‌తోపాటు మరికొంత నెగటివ్‌ అంశాలున్నాయని దీంతో సినిమా యావరేజ్‌ ఫలితాన్ని  చవిచూడొచ్చని అంటున్నారు. చిరంజీవికి  మాత్రం మంచి కమ్‌  బ్యాక్‌ అంటున్నారు. అయితే ఓవర్సీస్‌లో ఎక్కువగా అభిమానులే చూస్తారు.  కాబట్టి పూర్తి స్థాయి తెలుగు రివ్యూ చూసేంత వరకు ఫలితాన్ని  జడ్జ్  చేయలేం. అసలైన `ఏషియానెట్‌` రివ్యూ కోసం వేచి ఉండండి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Recommended image2
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
Recommended image3
Ashu Reddy: హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషు రెడ్డి.. హృదయం కదిలించేలా ఎమోషనల్‌ పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved