MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • దేవుడు చేసిన స్పెషల్‌ అనసూయ.. డాన్స్ మాస్టర్‌ క్రేజీ కామెంట్‌.. కొత్త టాలెంట్‌ చూపించిన మాజీ జబర్దస్త్ యాంకర్‌

దేవుడు చేసిన స్పెషల్‌ అనసూయ.. డాన్స్ మాస్టర్‌ క్రేజీ కామెంట్‌.. కొత్త టాలెంట్‌ చూపించిన మాజీ జబర్దస్త్ యాంకర్‌

హాట్‌ యాంకర్‌ అనసూయ `జబర్దస్త్` మానేసి సినిమాల్లోకి వెళ్లింది. కానీ ఇప్పుడు మళ్లీ బుల్లితెర బాట పట్టింది. తాజాగా మరో షోలో ఆమె సందడి చేయడం విశేషం.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 25 2024, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`జబర్దస్త్` మాజీ యాంకర్‌ అనసూయ ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తుంది. అయితే ఈ సారి యాంకర్‌గా కాదు, కంటెస్టెంట్‌గా, టీమ్‌ లీడర్‌గా చేస్తుంది. `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోలో ఆమె లేడీ టీమ్‌కి లీడర్‌గా ఉన్నారు. ఇందులో ఆమె చేసిన రచ్చ వైరల్‌గా మారింది. శేఖర్‌ మాస్టర్‌తో పోటీ పడి జాకెట్‌ విప్పడం దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది బాగా ట్రోల్‌ కావడంతో అనసూయ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యింది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక దీంతోపాటు మరో షోలో మెరిసింది అనసూయ. ప్లేబాయ్‌ ఇమేజ్‌తో రాణిస్తున్న సుడిగాలి సుధీర్‌ యాంకర్‌గా చేస్తున్న `సర్కార్‌ 4`లో ఆమె లేటెస్ట్ గా పాల్గొన్నారు. ఇందులో అనసూయతోపాటు బాబా భాస్కర్‌, సింగర్‌ మనో, మరో సింగర్‌ గీతా మాధురీ పాల్గొని సందడి చేశారు. కానీ అనసూయ పాల్గొనడం హైలైట్‌గా నిలిచింది.
 

37

ఆమె చాలా అందంగా తయారై రావడంతో సుడిగాలి సుధీర్‌ కన్ను పడింది. ఓ ప్రశంసల వదిలాడు. ఏంటీ అనసూయ ఇంత అందంగా రెడీ అయి వచ్చావ్‌ అనగా, నువ్వు యాంకర్‌ అని తెలియక అంటూ అనసూయ వేసిన పంచ్‌ అదిరిపోయింది. 

47

అనంతరం బాబా భాస్కర్‌ మాస్టర్‌ వచ్చి సుడిగాలి సుధీర్‌ని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. ఆయన ప్లేబాయ్‌ చేష్టలను బయటపెట్టాడు. ఇక అనసూయ వద్దకు వెళ్లి బాంబ్‌ పేల్చాడు. ఆమెతో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ఈ సృష్టిలో దేవుడు చేసిన స్పెషల్‌ రెండే రెండు. ఒకటి  నువ్వు(అనసూయ), రెండు నేను అంటూ ఆయన చేసిన కామెంట్‌ హైలైట్‌గా నిలిచింది. దెబ్బకి అనసూయ ఆనందంతో ఒప్పొంగిపోయింది. 
 

57

ఇందులో అనసూయ అందంతోనే కాదు, గేమ్‌తోనూ అందరిని ఆకర్షించింది. అయితే చివర్లో ఆమె ఓ సర్‌ప్రైజ్‌ చేసింది. తనలోని కొత్త టాలెంట్‌ని భయటపెట్టింది. ఇప్పటి వరకు అనసూయని నటిగా అద్భుతమైన నటనని మాత్రమే చూశాం. అలాగే యాంకర్‌గా ఆమె స్పాంటినిటీ, అందంతో కూడా ఆకర్షణ చూశాం. కానీ మరో టాలెంట్‌ ఉందని చాటి చెప్పింది. 

67

అనసూయలో సింగర్‌ ఉన్నారు. ఆ టాలెంట్‌ని సుధీర్‌ షోలో బయటపెట్టింది అనసూయ. అద్భుతమైన రొమాంటిక్‌ మెలోడీ పాటని ఆలపించింది. `నువ్వేనా  నా నువ్వే నా` అంటూ ఆమె వినసొంపుగా పాట పాడుతుంటే బాబా భాస్కర్‌ మాస్టర్‌, సుధీర్‌ నోరెళ్లబెట్టి చూడగా, గీతా మాధురి, మనో ఎంజాయ్‌ చేడం విశేషం. `సర్కార్‌ 4 `లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.
 

77

ఇక అనసూయ ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీగా ఉంది. ఆమె చేతిలో `పుష్ప2`, `సింబా` చిత్రాలున్నాయి. ఓ తమిళ సినిమా ఉంది. ఇవన్నీ పాత కమిట్‌మెంట్లు. కొత్తగా మరే సినిమా ప్రకటించలేదు. అయితే ఆమెకి అవకాశాలు తగ్గాయనే ప్రచారం జరుగుతుంది. అందుకే బుల్లితెర రీఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు. నిజమేంతో తెలియాల్సి ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved