- Home
- Entertainment
- Priyanka Chopra: అంబానీ ఈవెంట్లో ప్రియాంక చోప్రా బోల్డ్ షో... అందరి కళ్ళు ఆమె వైపే!
Priyanka Chopra: అంబానీ ఈవెంట్లో ప్రియాంక చోప్రా బోల్డ్ షో... అందరి కళ్ళు ఆమె వైపే!
NMACC లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యేందుకు ప్రియాంక చోప్రా ఇండియాలో అడుగుపెట్టారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఏర్పాటు చేసిన కల్చర్ సెంటర్ లాంచ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

Priyanka Chopra
నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) లాంచింగ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ తారలందరూ ఈవెంట్లో కొలువయ్యారు. వీరిలో ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త నిక్ జోనాస్ తో పాటు ఈ NMACC లాంఛింగ్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా బాలీవుడ్ కార్యక్రమానికి హాలీవుడ్ టచ్ ఇచ్చారు. గ్లోబల్ హీరోయిన్ గా ఇంటర్నేషనల్ ట్రెండ్ ఫాలో అయ్యారు.
Priyanka Chopra
అర్థనగ్న సౌందర్యంతో ఈవెంట్ కి ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చెప్పాలంటే ప్రియాంక చోప్రా అందరినీ డామినేట్ చేశారు. ప్రియాంక చోప్రాను కెమెరాల్లో బంధించేందుకు బాలీవుడ్ మీడియా పోటీ పడింది. ప్రియాంక చోప్రా ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.
Priyanka Chopra
ముంబైకి దూరమైన ప్రియాంక చోప్రా ఇండియాలో చాలా ఏళ్ల తర్వాత అడుగు పెట్టడం విశేషం. ఇటీవల బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ ఆమె సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికన్ మీడియా ఇంటరాక్షన్ లో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... బాలీవుడ్ పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసింది. ఉద్దేశపూర్వకంగా అవకాశాలు రాకుండా చేశారు. ఈ క్రమంలో కొందరితో గొడవలు అయ్యాయి. బాలీవుడ్ రాజకీయాల్లో నేను ఇమడలేక పోయాను. పాలిటిక్స్ చేయడం నాకు రాదు. అందుకే బాలీవుడ్ నుండి బ్రేక్ తీసుకున్నాను, అన్నారు.
Priyanka Chopra
టాప్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ అనుభవించిన ప్రియాంక చోప్రా సొంత పరిశ్రమ మీద చేసిన ఈ కామెంట్స్ సంచలనమయ్యాయి. ఎప్పటి నుండో తనలో ఉన్న అసహనాన్ని ప్రియాంక చోప్రా బయటపెట్టారు. ప్రియాంక చోప్రా పాల్గొన్న ఈ ఈవెంట్లో ఆమె ఆరోపణలు చేసిన వారందరూ ఉన్నారు. వారితో ప్రియాంక పలకరింపులు ఎలా ఉంటాయనేది చూడాలి.
Priyanka Chopra
ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. నిక్ వయసులో ప్రియాంక కంటే 10 ఏళ్ళు చిన్నవాడు కావడం విశేషం. ఈ విషయంలో ఆమె పలుమార్లు ట్రోల్స్ కి గురయ్యారు. లాస్ ఏంజెల్స్ లో లగ్జరీ హౌస్ కొన్న ప్రియాంక భర్తతో అక్కడే కాపురం పెట్టారు. సరోగసి ద్వారా ప్రియాంక ఓ పాపకు తల్లయ్యారు.
Priyanka Chopra
బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల ప్రస్థానం కలిగి ఉన్నారు. టాప్ స్టార్స్ తో జతకట్టిన ఈ స్టార్ లేడీ అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియాంకా చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్నారు.
Priyanka Chopra
తమిళ చిత్రం తమీజాతో ప్రియాంక చోప్రా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. విజయ్ ఆ చిత్ర హీరో. తర్వాత ఆమె సౌత్ ఇండియాలో చిత్రాలు చేయలేదు. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్న క్రమంలో అక్కడే సెటిల్ అయ్యారు. 2013లో రామ్ చరణ్ కి జంటగా జంజీర్ చిత్రం చేశారు. హిందీ, తెలుగు భాషల్లో ఈ మూవీ చిత్రీకరించారు.
Priyanka Chopra
కొన్నాళ్లుగా ప్రియాంక చోప్రా హాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు. అక్కడ టెలివిజన్ సిరీస్లు, చిత్రాలు చేస్తున్నారు. 2017లో విడుదలైన బేవాచ్ మూవీలో ప్రియాంక కీలక రోల్ చేశారు. హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం ఆమె అధికంగా ఇంగ్లీష్ చిత్రాలు చేస్తున్నారు. హాలీవుడ్ లో పర్మినెంట్ గా సెటిలయ్యారు.