ఛాన్స్ ఇప్పించిన నటుడికే అన్యాయం చేసిన విజయశాంతి.. స్టార్ ఇమేజ్ వచ్చాక సినిమా నుంచి తప్పించిన వైనం..
విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. విజయశాంతి స్టార్ హీరోలకు సమానంగా అప్పట్లోనే గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలు చేస్తూనే యాక్షన్ చిత్రాల్లో అదరగొట్టింది.
Vijayashanthi
విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. విజయశాంతి స్టార్ హీరోలకు సమానంగా అప్పట్లోనే గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలు చేస్తూనే యాక్షన్ చిత్రాల్లో అదరగొట్టింది. అయితే విజయశాంతి 1980లో సూపర్ స్టార్ కృష్ణ కిలాడీ కృష్ణుడు చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
సీనియర్ నటుడు గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో విజయశాంతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయశాంతికి హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పించింది తానే అని గిరిబాబు అన్నారు. విజయశాంతి అలనాటి నటి విజయలలిత అక్క కుమార్తె. దీనితో కృష్ణ నటిస్తున్న కిలాడీ కృష్ణుడు చిత్రంలో ఆమెకి తాను అవకాశం ఇప్పించినట్లు గిరిబాబు తెలిపారు.
కానీ విజయశాంతికి స్టార్ ఇమేజ్ వచ్చాక తననే సినిమా నుంచి తప్పించింది అని గిరిబాబు ఆరోపించారు. విజయశాంతి నటించే ఒక చిత్రంలో నన్ను కీలక పాత్రలో ఎంపిక చేశారు. కానీ విజయశాంతి గిరిబాబు ఈ పాత్రకి వద్దు అని సినిమా నుంచి తప్పించేలా చేసింది. విజయశాంతి కావాలనే చేసిందో లేదో తెలియదు.
ఆ పాత్రలో తాను నటిస్తే జనాల్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని విజయశాంతి దర్శక నిర్మాతలకు చెప్పింది. దీనితో వారు నన్ను తప్పించి రంగనాథ్ ని తీసుకున్నారు అని గిరిబాబు తెలిపారు. అవకాశం ఇప్పించిన తనపైనే విజయశాంతి ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదు అని గిరిబాబు తెలిపారు.