బాబోయ్ `జిన్నా` కలెక్షన్లు.. చూస్తే మైండ్ బ్లాక్.. మంచు విష్ణునా మజాకా!
మంచు విష్ణు నటించిన `జిన్నా` చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది. `మోసగాళ్లు` వంటి పరాజయం అనంతరం మంచు విష్ణు చేసిన చిత్రమిది. దీనిపై ఆయన ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.

మంచు విష్ణు హీరోగా, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `జిన్నా`. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. `సర్దార్`, `ఓరి దేవుడా`, `ప్రిన్స్` చిత్రాలతోపాటు విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కానీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేస్తుంది.
శుక్రవారం విడుదలైన `జిన్నా` చిత్రం సంచలనంగా మారింది. ఈ సినిమా కలెక్షన్లు సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. మొదటి రోజు ఓ రికార్డుని క్రియేట్ చేస్తే, రెండో రోజు మరో రికార్డు క్రియేట్ చేస్తుంది. అత్యల్ప కలెక్షన్లు సాధిస్తున్న చిత్రంగా నిలుస్తుండటం గమనార్హం. రెండు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 22 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.
యూఎస్‌లో రెండు రోజుల్లో వంద టికెట్లు తెగాయని, 1210 డాలర్లు(97000) వసూలు చేసింది. మొదటి రోజు 791 డాలర్లు రాగా, రెండో రోజు దారుణంగా పడిపోయింది. ఈ రోజునుంచి దాదాపు అన్ని థియేటర్ల నుంచి `జిన్నా` సినిమాని తొలగించినట్టు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఈ సినిమాకి కొంత కలిసొచ్చేలా ఉంది. ఏదేమైనా ఈ రోజు వరకే ఈ సినిమా కలెక్షన్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అతి తక్కువ కలెక్షన్ల విషయంలో తండ్రి మోహన్‌బాబు రికార్డులను బ్రేక్ చేశారు మంచు విష్ణు. ఆయన సినిమాకి హైదరాబాద్‌లో యాభై టికెట్లు తెగితే, మంచు విష్ణు నటించిన `జిన్నా`కి 340 టికెట్లు తెగడం విశేషం. అదే సమయంలో ఓ మోస్తారు ఇమేజ్ ఉన్న హీరోలతో పోల్చినా, విష్ణు సినిమాకి తక్కువగా కలెక్షన్లు వచ్చాయని తెలుస్తుంది. ఇది సరికొత్త రికార్డుగా సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే సినిమా స్టోరీ బాగుందని తెలుస్తుంది. పాయింట్ బాగుందని, కానీ కాస్టింగే రాంగ్ అని అంటున్నారు. సన్నీలియో చాలా బాగా చేసిందనే టాక్ వినిపిస్తుంది. మంచు విష్ణుపై జనాల్లో ఉన్న నెగటివ్ ఇమేజ్ సినిమాని కిల్ చేసిందని, వేరే హీరోతో చేసి ఉంటే యావరేజ్ మూవీగా, బాగా ఆడే సినిమాగా నిలిచేదనే గుసగుసలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తుండటం గమనార్హం.