- Home
- Entertainment
- Guppedantha Manasu: గౌతమ్‌ను ఓ రేంజ్‌లో పొగుడుతున్న వసు.. కోపంతో రగిలిపోతున్న రిషి!
Guppedantha Manasu: గౌతమ్‌ను ఓ రేంజ్‌లో పొగుడుతున్న వసు.. కోపంతో రగిలిపోతున్న రిషి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యం లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

గౌతమ్ (Gautham) మహేంద్రవర్మ తో పదే పదే వసు ఫోన్ నెంబర్ ఇవ్వమంటాడు. అంతలోనే వసు తనకే ఫోన్ చేసి షాక్ ఇస్తుంది. గౌతమ్ వసుధార (Vasudhara) ఫోన్ చేయడంతో తెగ సంతోషంగా మురిసిపోతాడు. రిషి ఆశ్చర్యపోతాడు. వసు ఎందుకు ఫోన్ చేసింది అని దిగులు పడుతూ ఉంటాడు.
గౌతమ్ మాత్రం సరదాగా మాట్లాడుతూ సాయంత్రం రెస్టారెంట్ లో కలుద్దాం అని అంటాడు. ఇక వసు (Vasu) కూడా ఓకే చెప్పేస్తుంది. గౌతమ్ మురిసిపోతూ మహేంద్రవర్మను సాయంత్రం కాఫీ కి రమ్మన్నటంతో కుదరదు అని అంటాడు. ఇక రిషికి (Rishi) రెడీ గా ఉండమని చెబుతాడు.
మరోవైపు జగతి (Jagathi) మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుకు చెప్పటంతో వసు తాను రిషి తో మాట్లాడనని చెబుతుంది. జగతి అర్థం చేసుకొని మహేంద్ర వర్మ కు (Mahendra) ఫోన్ చేస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి రిషికి చెప్పమంటుంది. మహేంద్రవర్మ ఓకే అంటాడు. ఇక వసు మాటలకు జగతి ఏం చేస్తుందో అని బాధపడుతుంది.
ఇక రిషి (Rishi) క్లాస్ కి రావడంతో అందరిని లెక్కలు చేశారా అని అడుగుతాడు. దాంతో వసు చేయి లేపుతుంది. వసు కాకుండా ఎవరైనా చేశారా అనేసరికి వసు తన బుక్ పుష్పకు (Pushpa) ఇచ్చి తను చేసింది అన్నట్లు చూపిస్తుంది. దాంతో రిషి ఆ బుక్కు తీసుకొని రమ్మనడంతో అందులో ఉన్న గౌతమ్ విస్టింగ్ కార్డు చూసి వసు దగ్గర ఇది ఎలా ఉంది అని అనుకుంటాడు.
వసు బుక్ అని తెలియడంతో పుష్పను (Pushpa) లెక్క చేయమంటాడు. మహేంద్ర, జగతి ఫనింద్ర వర్మ దగ్గర దేవయాని గురించి మాట్లాడతారు. దేవయాని (Devayani) గురించి అందరికీ తెలిసిందే అంటూ ఆయన సర్ది చెబుతుంటాడు. ఎందుకంటే రిషి ఈ విషయాన్ని నమ్మడు అని అంటాడు.
ఇక మహేంద్రవర్మ, జగతి (Jagathi) మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే గౌతమ్ వస్తాడు. ఇక జగతికి గౌతమ్ ను పరిచయం చేస్తాడు మహేంద్రవర్మ. ఇక జగతి మేడం గురించి తన ప్రాజెక్టుల గురించి మహేంద్రవర్మ గొప్పగా చెబుతాడు. అప్పుడే వసుధార (Vasudhara) రావటంతో వసు ని చూసి మురిసిపోతాడు గౌతమ్.
ఇక ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడటంతో అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తాడు. తరువాయి భాగం లో వసు పుష్ప తో గౌతమ్ (Gautham) గురించి పొగుడుతూ రిషిని తిడుతూ ఉంటుంది. ఆ మాటలను పక్కనే ఉన్న రిషి వింటాడు. ఇక వసు రిషి (Rishi) చూసి షాక్ అవుతుంది. తన పెద్దమ్మకు సారీ చెప్పమని చెప్పను అని ధైర్యం గా మాట్లాడుతుంది.