Bigg Boss Telugu 7: నువ్వెంత.. శివాజీపై సహనం కోల్పోయిన గౌతం..సెగలుగా నవ్వకంటూ ప్రశాంత్‌కి అమర్‌దీప్ వార్నింగ్
నామినేషన్ల ప్రక్రియ సోమవారంతోపాటు ఇంకా కొనసాగుతుంది. ఈ వారం నామినేషన్లని కోర్ట్ రూమ్ తరహాలో ప్లాన్ చేశారు. ఒకరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.
బిగ్ బాస్ తెలుగు 7 వ సీజన్ నాల్గో వారం నామినేషన్ల ప్రక్రియ యమ రంజుగా సాగుతుంది. ఒకరిపై ఒకరు చేసుకునే వాదనలు పీక్‌లోకి వెళ్తున్నాయి. కంటెస్టెంట్ల అసలు రూపాలు బయటకు వస్తున్నాయి. ఎవరు ఫేక్, ఎవరు జెన్యూన్, ఎవరిది డబుల్ గేమ్, ఎవరిది సేఫ్ గేమ్ అనే విషయాలు స్పష్టమవుతున్నాయి. అదే సమయంలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. హౌజ్‌లో ఇప్పటి వరకు కూల్‌గా, సైలెంట్‌గా ఉన్న వాళ్లు కూడా కోపంతో రెచ్చిపోతున్నారు. ఆవేశంతో ఊగిపోతున్నారు.
నామినేషన్ల ప్రక్రియ సోమవారంతోపాటు ఇంకా కొనసాగుతుంది. ఈ వారం నామినేషన్లని కోర్ట్ రూమ్ తరహాలో ప్లాన్ చేశారు. ఒకరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో జ్యూరీగా ఉన్న సభ్యులు శివాజీ, శోభా శెట్టి, సందీప్ వారి వాదన, చెప్పే కారణాలు ఎంత బలంగా, సరైన విధంగా ఉన్నాయనేది చూడాల్సి ఉంటుంది. దాని ప్రకారం నామినేషన్లని అంగీకరిస్తారు. సోమవారం ఎపిసోడ్‌లో ప్రియాంక, రతికలను నామినేట్ అయ్యారు. యావర్ నామినేట్ చేసి, బిగ్ బాస్ ఆదేశాలతో తీసేశారు.
గౌతంకృష్ణ.. యావర్, తేజలను నామినేట్ చేశారు. ఈ క్రమంలో యావర్, గౌతమ్ మధ్య వాదనలు పీక్‌లోకి వెళ్లాయి. ఇద్దరు కొట్టుకుంటారా? అనే పరిస్థితి తలెత్తించింది. యావర్ కంట్రోల్ తప్పిపోయారు. ఆ తర్వాత గౌతం కృష్ణ.. జ్యూరీలో ఉన్న శివాజీని టార్గెట్ చేశారు. నువ్వు లాయర్‌గా ఒకరి వైపు మాత్రమే ఉంటున్నావని ఆరోపించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. దీంతో గొడుకు నేలకేసి కొట్టిన గౌతం.. శివాజీపైకి వెళ్లాడు. నువ్వెంత.. నువ్వెంత అంటూ ఫైర్ అయ్యాడు. హౌజ్‌ని హీటెక్కించాడు. దీంతో అంతా షాక్ అయ్యారు.
ఆ తర్వాత గౌతంకి.. అమర్ దీప్ క్లాస్ పీకాడు. అక్కడి నుంచి రియాక్షన్ వచ్చింది ఓకే, కానీ నువ్వు రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నావని, నీ కింద నువ్వే బాంబ్ పెట్టుకుంటున్నావని హెచ్చరించాడు. ఆ తర్వాత సందీప్ సైతం నీ రీజన్లని ఒప్పుకోము, సరైన విధంగా, బలంగా లేవని గౌతంకి తేల్చి చెప్పాడు. అమర్ దీప్ వంతు వచ్చింది. ఆయన శుభ శ్రీ, పల్లవి ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. ఇందులో మాస్క్ అనేది ఎవరూ ఉంచుకోవద్దని, ఫెయిర్‌గా ఉండాలని అంతా భావిస్తారు. అలా అందరివి బయటపడుతుంటాయి. కానీ నువ్వు బాగా మెయింటేన్ చేస్తున్నావని అమర్ దీప్.. పల్లవి ప్రశాంత్‌పై ఆరోపణలు చేశాడు.
కంటెండర్‌గా అనౌన్స్ చేసినప్పుడు నువ్వు లోపలికి వెళ్లి ఏడ్చావు చూడు అది రెండో ముఖం అని అమర్ దీప్ చెప్పగా, పల్లవి ప్రశాంత్ సెటైరికల్‌గా నవ్వాడు. దీంతో మండిపోయిన అమర్ దీప్.. అరేయ్.. నువ్వు సెగలుగా నవ్వద్దు చెప్తున్నాను అంటూ హెచ్చరించాడు. నేను ఇలానే ఉంటా, నాలో రెండు ముఖాలున్నాయా? నాలుగు ముఖాలున్నాయా? అనేది తన గేమ్ స్ట్రాటజీ.. ప్రపంచంలో పల్లవి ప్రశాంత్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. నేను ఇలానే ఉంటాను, బరాబర్ ఉంటానని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గట్టి వాదనలు జరిగాయి. ఫైర్ పీక్‌లోకి వెళ్లింది. హౌజ్‌ని రసవత్తరంగా మార్చేసింది.