MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: డాడ్ ఎక్కడున్నారు.. రిషీ బాధను చూసి కుమిలిపోతున్న జగతి, మహేంద్రలు!

Guppedantha Manasu: డాడ్ ఎక్కడున్నారు.. రిషీ బాధను చూసి కుమిలిపోతున్న జగతి, మహేంద్రలు!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Oct 26 2022, 08:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి గౌతమ్ తో, నేను డాడ్ ఎదురుగా వెళ్లి సారీ చెప్తా డాడ్ కూల్ అయిపోతారు. చిన్న పిల్లల మనస్తత్వం అని అనగా, ఈ మాటలు విన్నర్ జగతి మహేంద్రలు బాధపడుతూ ఉంటారు. అప్పుడు రిషి, డాడ్ నా పక్కనే ఉన్నట్టున్నది గౌతమ్ నా చుట్టూరే ఉన్నట్టున్నది. డాడ్ గురించి నిజంగా నీకు తెలిస్తే ఎక్కడున్నారో చెప్పు డాడ్ లేకుండా ఉండలేకపోతున్నాను అని రిషి అంటాడు. దానికి గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు. ఏం సార్ మీరు ఇందాకటి నుంచి ఏదో కంగారులో ఉన్నట్టున్నారు అని అడుగుతాడు. 
 

28

మరి నా ఫ్రెండ్ ఇంత బాధపడుతూ ఉంటే నన్ను ఇక్కడ జోకులేమంటావా అని గౌతమ్ అంటాడు. అప్పుడు రిషి, మేము ఇంక బయలుదేరుతాం గౌతమ్. డాడ్ ఎక్కడున్నా వెతికి కనిపెట్టు నేను కూడా వెతుకుతాను అని చెప్పి వెళ్తూ తిరిగి వెనక్కి చూసి నిజంగా డాడ్ చుట్టుపక్కల ఉన్నంతగా ఉన్నది గౌతమ్ అని బాధపడతాడు రిషి. రిషి వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు జగతి,మహీంద్ర లు గౌతమ్ దగ్గరికి వస్తారు. అప్పుడు గౌతమ్ వాళ్ళతో, చూశారా అంకుల్ రిషి ఎంత బాధ పడుతున్నాడో నేను నిజం చెప్పలేని పరిస్థితి వచ్చింది.
 

38

 రేపు అన్ని సమస్యలు సర్దుకున్న తర్వాత నేనే మిమ్మల్ని మా ఇంట్లో ఉంచాను అని రిషికి తెలిస్తే ఏమవుతుంది అంకుల్ నాకు భయంగా ఉంది అని అనగా, నువ్వు ఎంత గొప్ప వాడివి గౌతమ్ నీ స్నేహితుడు గురించి అంత బాగా ఆలోచిస్తున్నావు. నాకు కూడా రిషి వదిలి ఉండాలని లేదు తన మాటలు వింటే బాధగా ఉన్నది కానీ మేము అనుకున్న పని జరగాలంటే ఇదొకటే సరైన మార్గం అని గౌతమ్ ని గట్టిగా హద్దుకుంటూ నా తరఫున రిషి ఇవ్వు అని అంటాడు. ఆ తర్వాత సీన్లో రిషి తన గదిలో కుర్చీలో కూర్చొని ఉండగా వసూ అక్కడికి వస్తుంది. 
 

48

వసు రిషి ని చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావ్ అని అడగగా మీరు కూర్చున్న కుర్చీ సార్. మీరు ఎప్పుడు దానిమీద కూర్చుంటారు నాకు జెలసీ గా ఉన్నది దాన్ని చూస్తే అని అనగా రిషి లేచి వసూని అక్కడ కూర్చోబెడతాడు. కూర్చున్న సమయంలో వసుకి కాలు బెణికుతుంది. అప్పుడు రిషి కాళ్లకు మద్దన చేస్తే ఏమైనా తిన్నావా అని అడుగుతాడు. మీరు తినలేదు కదా సార్ అందుకే ఇంట్లో ఎవరూ తినలేదు అని నువ్వు నాకోసం ఇక్కడికి వచ్చావు. నాకోసం పస్తులు ఉండడం ఎందుకు వెళ్లి తిను అని చెప్పాడు రిషి. అప్పుడు వసు వెళ్తుంది.
 

58

 నేను కింద భోజనం పెడుతున్నాను మీరు కూడా కిందకు వస్తున్నారు అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో కింద గౌతమ్ దేవయాని వాళ్ళ ఇంటికి వస్తాడు. కింద ఎవరూ లేరేంటి అని ధరణిని అడగగా, ఎవరు గదిలో వాళ్ళు కూర్చుని మౌనంగా ఉన్నారు గౌతమ్ అని ధరణి అంటుంది. అప్పుడు రిషి ఏమైనా తిన్నాడా అని గౌతమ్ అడగగా లేదు అని ధరణి అంటుంది. వెళ్లి దేవయాని పెద్దమ్మకి చెప్తే అప్పుడు రిషి భోజనం చేస్తాడు కదా అనే లోగా రిషి అక్కడికి వస్తాడు. రిషి అక్కడికి వచ్చి గౌతమ్ ని, గౌతమ్ ఏవైనా తెలిసిందా డాడ్ గురించి అని అనగా ఇంకా తెలియలేదు అని గౌతమ్ చెప్తాడు. 
 

68

మనసులో మాత్రం నన్ను క్షమించరా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది అని అనుకుంటాడు. అప్పుడు గౌతమ్ రిషిని గట్టిగా హద్దుకుంటూ మహేంద్ర చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి ఏంటి రిషి ఇది నువ్వు ఇలా ఉండడం ఏంటి జగతికి అయితే బుద్ధి లేదు మహేంద్ర కి ఏమైంది తనకైనా తెలియాలి కదా అని అనగా, ఇప్పుడు డాడ్ ని ఏం అనొద్దు పెద్దమ్మ అని రిషి అంటాడు. దానికి దేవయాని కావాలని పట్టు పట్టి, అయినా మహేంద్ర కి జగతి వచ్చిన తర్వాత నీ మీద దృష్టి తగ్గింది. 
 

78

జగతి మీదే పెరుగుతున్నట్టు ఉన్నది అని రిషి ని రెచ్చగొడుతుంది. దానికి రిషి, దాంట్లో తప్పేమున్నది పెద్దమ్మ. డాడ్ కి నేను కొడుకు అవ్వకముందే మేడం భార్య అయ్యారు. భార్య స్థానం భార్యదే కదా అయినా వాళ్ల గురించి మనం ఇలా మాట్లాడుకోకూడదు అని రిషి అంటాడు. ఇది విను వసుధార మనసులో ఎంతో ఆనందపడుతుంది. ఇంతలో గౌతమ్, కరెక్ట్ గా చెప్పావు రిషి చాలా బాగా చెప్పావు అని అంటాడు. అప్పుడు దేవయాని మనసులో ,మహేంద్ర వాళ్ళు ఇంటి నుంచి వదిలిపోయినా రిషి మనసు నుంచి వెళ్లట్లేదు ఏంటి అని అనుకుంటారు.
 

88

అప్పుడు దేవయాని వసుతో, నువ్వు ఇంక బయలుదేరచ్చు కదా అని అనగా, వసుధార ఇక్కడే ఉంటుంది అని రిషి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సీన్లో వసు, రిషి ఇంటి బయట సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి బాధపడుతూ ఉండగా వసు వచ్చి, మహేంద్ర సార్ మాత్రం మిమ్మల్ని వదిలి ఎన్ని రోజులు ఉంటారు సార్ తప్పకుండా వస్తారు అని అంటుంది. ఇంతలో మినిస్టర్ p.a దగ్గర్నుంచి రిషికి ఫోన్ వస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి అందరికీ మెయిల్స్ పెట్టారు కదా.సర్ జగతి మేడం, మహేంద్ర సార్ లు రాను అని చెప్పారు అని రిషికి మినిస్టర్ గారి పిఏ చెప్తాడు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Raakaasa Movie Review: రాకాస మూవీ రివ్యూ, రేటింగ్‌.. నిహారిక, సంగీత్‌ శోభన్‌ ల మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Jabardasth : కిరాక్ ఆర్పీ మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా? ఏం చేశాడంటే?
Recommended image3
N T Rama Rao: 5 సార్లు రాముడు, 5 సార్లు రావణుడు.. ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved