Gargi Movie Review: సాయిపల్లవి `గార్గి` మూవీ రివ్యూ..షాకింగ్ రేటింగ్..`నేషనల్ అవార్డు పక్కా`..
లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి నటించిన లేటెస్ట్ మూవీ `గార్గి`. ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. సంచలన విషయాలు వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి(Sai Pallavi) బలమైన పాత్రలకు కేరాఫ్. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఆమె నెమ్మదిగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ తనేంటో నిరూపించుకుంటుంది. నటిగా తన సత్తాని చాటుకుంటుంది. ఇటీవల `విరాటపర్వం`లో మెప్పించిన ఆమె ఇప్పుడు `గార్గి`(Gargi) చిత్రంతో వస్తుంది. పీఆర్ గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. బలమైన కంటెంట్‌తో వస్తోన్న సినిమా కావడంతో, నమ్మకంతో చిత్ర బృందం రెండు రోజుల ముందుగానే తమిళనాడులో సినీ క్రిటిక్స్ కి, ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రత్యేకంగా ప్రదర్శించారు. తాజాగా ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది. రివ్యూ రేటింగ్ షాకిస్తుండటం విశేషం. Gargi Movie Review.
`గార్గి` మూవీ తమిళంలో తెరకెక్కించారు. సాయిపల్లవి మెయిన్ లీడ్‌గా నటించడం, ఆమెకి తెలుగు, కన్నడలో మంచి మార్కెట్ ఉండటంతో తమిళంతోపాటు తెలుగు, కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టాక్‌ని ఓసారి చూస్తే. Gargi Review.
ఇది సాయిపల్లవి(గార్గి) అనే టీచర్ న్యాయపోరాటాన్ని ఆవిష్కరించే చిత్రమని తెలుస్తుంది. సాయిపల్లవి టీచర్‌గా జాబ్ చేస్తూ పూర్తి ప్రైవేట్ జీవితాన్ని గడుపుతుంటుంది. తండ్రి సెక్యూరిటీ గార్డ్ గా ఉంటారు. అనుకోకుండా ఓ రోజు ఓ కేసులో గార్గి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తండ్రి ఎక్కడున్నాడో కూడా తెలియదు. కలిసేందుకు వెళితే పోలీసులు కలవనివ్వరు. దీంతో న్యాయం కోసం, తండ్రిని నిర్దోశిగా విడిపించడం కోసం ఆమె ఎలాంటి పోరాటం చేసిందనేది సినిమా కథ అని టాక్.
ప్రస్తుతం `గార్గి` సినిమాకి సంబంధించిన రివ్యూ రిపోర్ట్ ట్విట్టర్లో వైరల్ అవుతుంది. `గార్గి` టాక్ ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ క్రిటిక్స్ ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం విశేషం. మేజర్‌గా అందరూ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వగా, కొంత మంది ఫోర్ రేటింగ్ ఇచ్చారు. అద్బుతమైన సినిమాగా దీన్ని వర్ణిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు చూసిన చిత్రాల్లో ది బెస్ట్ మూవీగా చెప్పడం మరో విశేషం. దర్శకుడు సెన్సిటివ్ సబ్జెక్ట్ ని చాలా బాగా డీల్ చేశారని, ఇదొక పవర్‌ఫుల్ మూవీ అని, సమాజంలో మహిళల పాత్రలని బలంగా ఆవిష్కరించారని, సందేశాత్మక చిత్రమవుతుందని ట్విట్టర్‌లో క్రిటిక్స్ పోస్టు లు పెడుతున్నారు.
దర్శకుడు పీఆర్ గౌతమ్ అద్భుతమైన కథని తెరపై ఆవిష్కరించారని, డ్రామా ఆద్యంతం కట్టిపడేసేలా ఉంటుందని, సినిమా ఆసాంతం చూపు తిప్పుకోనివ్వనంత బాగా సాగిందని అంటున్నారు. బెల్ట్ తమిళ మూవీ అని, హార్డ్ హిట్టింగ్‌లా ఉంటుందని, అదే సమయంలో మనసుని కదిలించేలా ఉంటుందని చెబుతున్నారు. సౌండ్ డిజైనింగ్, దర్శకుడు కలిసి మ్యాజిక్ చేశారని, క్లైమాక్స్ అద్భుతం జరుగుతుందని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఏదీ వంక పెట్టేలా లేవని, పాత్రల మూడ్‌ని క్యాప్చర్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ తన పనితీరుని ప్రదర్శించారని అంటున్నారు. క్లైమాక్స్ సినిమాకి హైలైట్గా నిలుస్తుందంటున్నారు.
మరోవైపు సాయిపల్లవి నటనపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. `టేక్ ఏ బౌ` అంటూ ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టడం విశేషం. సినిమా కోసం ఆమె పడ్డ కష్టం తెరపై కనిపిస్తుందని, అద్బుతంగా యాక్ట్ చేసిందని, గార్గి పాత్రలో ఆమెని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేమంటున్నారు. అంతేకాదు ఏకంగా సాయిపల్లవికి ఈ ఏడాది జాతీయ అవార్డు పక్కా అంటూ కామెంట్లు పెట్టడం విశేషం.
కోర్ట్ రూమ్ డ్రామా, సొసైటీకి చాలా రిలవెంట్‌గా ఉంటుందని, జాతీయ అవార్డు దక్కే చిత్రమవుతుందని పోస్ట్ లు పెడుతున్నారు. సూర్య,జ్యోతికలు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించినప్పుడే ఈ చిత్రంలో ఎంతటి స్టఫ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అని, ఈ ఏడాది బెస్ట్ మూవీలో ఇది ఒకటిగానిలుస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నారు.