- Home
- Entertainment
- Alia Bhatt Photos : ఢిల్లీలో ‘గంగూబాయి కతియావాడి’ వైబ్స్.. నెట్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్
Alia Bhatt Photos : ఢిల్లీలో ‘గంగూబాయి కతియావాడి’ వైబ్స్.. నెట్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్
మూడు రోజుల్లో రిలీజ్ కానున్న గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi) మూవీ కోసం అలియా భట్ చాలానే కష్టపడుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా దేశమంతా చుట్టేస్తోంది. ఇందుకోసం తాజా ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఆర్ఆర్ఆర్ (RRR) హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) తాజాగా నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలాబన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహించారు.
గతేడాదే ఈ మూవీ చిత్రకరణ పనులు మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ కోవిడ్ 19 ప్రభావం.. పెరుగుతున్న కరోనా కేసులను గమనించి రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ వచ్చారు.
పరిస్థితులు అదుపులోకి రావడంతో ఎట్టకేళలకు ఫ్రిబవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లో తమ మూవీని ప్రమోట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఎంతగానో శ్రమిస్తోంది. ఇటీవల బెర్లిన్ లో నిర్వహించిన 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ గంగూబాయి కతియా వాడి ప్రీమియర్ ను పూర్తి చేసుకున్నారు.
ఇక, ఈ మూవీ రిలీజ్ కు మూడురోజులే గడువు ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా దేశమంతా కలియ తిరుగుతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ టీం నిన్న కలకత్తాలో దర్శనమివ్వగా తాజాగా ఢిల్లీలో మూవీ ప్రమోషన్ పనులు షురూ చేశారు.
అలియా భట్ మాత్రం ఒకవైపు తను నటించిన చిత్రం గంగూబాయి కతియావాడి మూవీని ప్రమోట్ చేసుకుంటూనే.. తన గ్లామర్ షోతోనూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. గంగూబాయి స్టైల్ నే ఫాలో అవుతూ మొత్తం చీరకట్టుతోనే అందరి చూపును తనవైపే ఉండేట్టు చేస్తోంది.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా అలియా అభిమానులను పలకరిస్తోంది. అదేవిధంగా వారికి తన మూవీ రిలీజ్ డేట్ ను గుర్తు చేస్తోంది. ఇక ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కానుంది అలియా. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ హీరోయిన్ గా సౌత్ లో గుర్తింపు పొందుంతోంది.