MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Gangavva: గృహ ప్రవేశం చేసిన `బిగ్‌బాస్‌` ఫేమ్‌ గంగవ్వ.. అఖిల్‌, సావిత్రి సందడి.. ఇళ్లు అదిరిపోయిందంతే!

Gangavva: గృహ ప్రవేశం చేసిన `బిగ్‌బాస్‌` ఫేమ్‌ గంగవ్వ.. అఖిల్‌, సావిత్రి సందడి.. ఇళ్లు అదిరిపోయిందంతే!

బిగ్‌బాస్‌ 4లో సందడి చేసి పాపులర్‌ అయిన గంగవ్వ గృహ ప్రవేశం చేసింది. బిగ్‌బాస్‌, నాగార్జున కలిసి కట్టించిన ఇంట్లోకి నేడు(మంగళవారం) వెళ్లింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గృవ ప్రవేశ ఫంక్షన్‌లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 09 2021, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

`మై విలేజ్‌` అనే షోతో పాపులర్‌ అయ్యింది గంగవ్వ. యూట్యూబ్‌లో విలేజ్‌ వంటలు చేస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది. తెలంగాణ యాసలో స్వచ్ఛమైన తెలంగాణ వంటకాలను తన వీడియోల్లో చూపించింది గంగవ్వ. దీంతో ఆమెకి మంచి పేరు వచ్చింది. తెలుగు జనాలకు దగ్గరయ్యింది. ఆమెకి ఉన్న క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని చూసిన బిగ్‌బాస్‌ నిర్వహకులు గత నాల్గో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంపిక చేశారు. ఓ వృద్దురాలిని కంటెస్టెంట్‌గా ఎంపిక చేసి సంచలనం సృష్టించారు. గంగవ్వ బిగ్‌బాస్‌లో పాల్గొనడమే అప్పట్లో ఓ సెన్సేషన్‌గా మారింది. అందుకు తగ్గట్టే ఆమె హౌజ్‌లోనూ సందడి చేస్తుంది. తనదైన స్టయిల్‌లో ఎంటర్‌టైన్‌ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌ అంటూ పూర్తి ఏసీతో నిండి ఉంటుంది. ఫ్రీగా ఎయిర్‌ ఉండదు. అలాంటి వాతావరణంలో ఎప్పుడూ లేని గంగవ్వ, దానికి అలవాటు పడలేదు. అనారోగ్య సమస్యలు తలెత్తాయి. హౌజ్‌లో ఉండలేని పరిస్థితి ఎదురైంది. దీంతో మధ్యలోనే ఆమె హౌజ్‌ నుంచి వెళ్లిపోయింది. గంగవ్వ అనారోగ్యం పరిస్థితి రీత్యా బిగ్‌బాస్‌ నిర్వహకులు, హోస్ట్ నాగార్జున సైతం ఆమెని ఇంటికి పంపించారు. కానీ అప్పటికే గంగవ్వకి రావాల్సినంత క్రేజ్‌, పాపులారిటీ వచ్చేసింది. ఊహించిన విధంగా ఆమెకి బయట ఫాలోయింగ్‌ ఏర్పడింది. 
 

39

అయితే మధ్యలో తాను హౌజ్‌ నుంచి వెళ్లిపోవడంతో నిరాశ చెందిన గంగవ్వ నాగార్జునని, బిగ్‌బాస్‌ని ఓ కోరిక కోరింది. తనకు ఓ ఇళ్లు కట్టించమని వేడుకుంది. తాను ఉండేది చిన్న గుడిసే అని, పక్కా ఇళ్లు లేదని తెలిపింది. గంగవ్వ కోరిక మేరకు నాగార్జున, బిగ్‌బాస్‌ నిర్వహకులు ఆమెకి ఇళ్లు కట్టించేందుకు ఒప్పుకున్నారు. తన సొంత గ్రామమైన జగిత్యాల జిల్లాలోని లంబాడిపల్లిలో ఇంటిని నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 

49

బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి గంగవ్వ ఇంటికి వెళ్లిన కొద్ది రోజులకే ఇంటి నిర్మాణ పనులను స్టార్ట్ చేశారు. దాదాపు ఏడాది పాటు ఇంటి నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఇంటి నిర్మాణం పూర్తి కావడమే కాదు, ఏకంగా గృహ ప్రవేశం కూడాచేసింది గంగవ్వ. మంగళవారం(నవంబర్‌9)న తన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పలువురు సెలబ్రిటీలు పాల్గొనడం విశేషం. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

59

ఇందులో బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ అఖిల్‌ సార్థక్‌ పాల్గొన్నారు. మరోవైపు బిగ్‌బాస్‌ మరో కంటెస్టెంట్‌, యాంకర్‌ సావిత్రి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం గంగవ్వ, సావిత్రి కలిసి పలు కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరితోపాటు చాలా మంది యూట్యూబ్‌ స్టార్స్ గంగవ్వ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. గంగవ్వంతో ఫోటోలు దిగి సందడి చేశారు. లంబాడిపల్లికి పాపులారిటీని తీసుకొచ్చారు. 

69

ఇక గంగవ్వ ఇంటిని చూస్తే చాలా మోడ్రన్‌గా కనిపిస్తుంది. విశాలమైన ఇంటిని ఆధునిక సౌకర్యాలతో నిర్మించడం విశేషం. విశాలమైన హాట్‌, పెద్దవైన రెండు బెడ్‌ రూమ్‌లు, కంఫర్ట్ గా ఉండే కిచెన్, పూజాగదితో గంగవ్వ ఇంటిని నిర్మించారు. 

79

ఎట్టకేలకు గంగవ్వ ఇంటి కలని సాకారం చేసింది బిగ్‌బాస్‌ టీమ్‌. ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది గంగవ్వ. `నా కొత్త ఇళ్లు పూర్తయ్యింది.దీనికి సహకరించిన మా చిన్నన్న నాగార్జున సర్‌కి, బిగ్‌బాస్‌ టీమ్‌కి ధన్యవాదాలు` అని తెలిపింది.

89

గంగవ్వ గృహ ప్రవేశం సందర్భంగా సెలబ్రిటీలు రావడంతో లంబాడిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల్ కుటుంబ సభ్యులు, సావిత్రి దంపతులకు నూతన వస్త్రాలతో ఆశీర్వదించారు. 

99

bigg boss telugu 4 fame gangavva house. బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ గంగవ్వ ఇళ్లు. తన ఇంటి ఫోటోకి పోజులిస్తూ తన సంతోషాన్నిపంచుకుంటోన్న గంగవ్వ. 

also read: Bigg boss telugu 5: ఆ కారణంగా హౌస్ నుండి జస్వంత్ అవుట్... కుప్పకూలిపోయిన సిరి, షన్ను!

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved