MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గణనాథుడికి పూజలు.. స్కంద, సైంధవ్, ఆదికేశవ చిత్రాల నుంచి అదిరిపోయే పోస్టర్లు..

గణనాథుడికి పూజలు.. స్కంద, సైంధవ్, ఆదికేశవ చిత్రాల నుంచి అదిరిపోయే పోస్టర్లు..

వినాయక చవితి సందర్భంగా టాలీవుడ్ సినిమాల నుంచి కొత్త పోస్టర్లు విడులయ్యాయి. రోజుల వ్యవధిలో రిలీజ్ కానున్న తెలుగు చిత్రాల కొత్త పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 18 2023, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘స్కంద’(Skanda).  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)  హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరో పది రోజుల్లో సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా రామ్ పోతినేని ఊర మాస్ పోస్టర్ ను వదిలారు. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

26

`హిట్‌` చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సైంధవ్‘ (Saindhav). విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గణేశ్ చతుర్థి సందర్భంగా బ్యూటీఫుల్ పోస్టర్ ను వదిలారు. సముద్రపు ఒడ్డున ఫ్యామిలీతో వెంకటేశ్ కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ ఇందులో నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రుహానీ శర్మ, ఆండ్రియా, సారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

36

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) - అమృత అయ్యర్ జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘హనుమాన్’ (Hanu-Man). శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆడియెన్స్ కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సూపర్ పోస్టర్ విడుదల చేశారు. బొజ్జ గణపతిని ఎత్తుకొని నడుస్తూ వస్తున్న తేజా సజ్జ పోస్టర్ ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో 11 భాషల్లో విడుదల కానుందీ చిత్రం. 

46

నితిన్ - వక్కంతం వంశీ కాంబోలో వస్తున్న  యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary man).  ఇటీవలె ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇవ్వాళ గణేశ్ చతుర్థి సందర్భంగా నితిన్ ఎనర్జిటిక్ లుక్ లో పోస్టర్ ను విడుదల చేశారు. ఆడియెన్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. 
 

56

‘వార్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గణపత్’ (Ganapath). వికాస్ బహ్లు దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్ కథనాయిక. గణేశ్ చతుర్థి సందర్భంగా ఈ చిత్రం నుంచి టైగర్ ష్రాఫ్ పవర్ ఫుల్ లుక్ లోని పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం హిందీతో పాటు సౌత్ లాంగ్వేజేస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల కానుంది. 

66

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రమే Aadhikeshava. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela) జంటగా నటిస్తోంది. ఎన్ శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.  చిత్రం నుంచి బ్యూటీఫుల్ పోస్టర్ ను  రిలీజ్ చేశారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ 'స్పిరిట్'పై కొత్త రచ్చ.. దీపిక తర్వాత ఇప్పుడు ప్రకాశ్ రాజ్.. అసలేం జరుగుతోంది?
Recommended image2
Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి
Recommended image3
Sangeetha Vijay: విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా? ఆమె వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved