'గేమ్ ఛేంజర్' టాక్...బాలయ్య సినిమాకు ప్లస్ కానుందా?
గేమ్ ఛేంజర్ చిత్రానికి వచ్చిన నెగిటివ్ టాక్ డాకు మహారాజ్ కు కలిసి వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలయ్య యాక్షన్, బాబీ దర్శకత్వం, తమన్ సంగీతం సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయని అంటున్నారు.
ఎంతో ఎక్సపెక్టేషన్స్ తో ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ చిత్రం మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకోవటం ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. యావరేజ్ లో పడటం కూడా కష్టమే అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ టాక్ ...బాలయ్య తాజా చిత్రం డాకు మహారాజ్ కు ప్లస్ అవుతుందని ఓ వర్గం అంచనా వేస్తోంది. డాకూ మహారాజ్ చిత్రానికి ఇప్పటిదాకా బజ్ క్రియేట్ కాలేదు.
కానీ సినిమా ఏ మాత్రం బాగున్నా కలెక్షన్స్ కుమ్మి పారేస్తుందని అంటున్నారు. అందుకు కారణం గేమ్ ఛేంజర్ కు దారుణమైన టాక్ రావటమే. సంక్రాంతికి యాక్షన్ సినిమా చూడాలనుకునేవాళ్లకు డాకు మహారాజ్ ఆప్షన్ అవుతుందని చెప్తున్నారు. అయితే అదే సమయంలో మరికొందరు సీన్ రివర్స్ అయ్యి..డాకు మహారాజ్ అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోతే గేమ్ ఛేంజర్ పుంజుకునే అవకాసం ఉందంటున్నారు. ఇలా ఎవరి లెక్కలు వాళ్లు వేస్తున్నారు.
ఏదైమైనా డాకూ మహారాజ్ తో బాలయ్య ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. బాలయ్య విధ్వంసానికి ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బద్దలు అయితే తిరుగే ఉండదు. బాబీ విజన్, బాలయ్య యాక్షన్, తమన్ సంగీతం డాకు మహారాజ్‌ను నిలబెట్టేలా కనిపిస్తోందని ట్రేడ్ అంటోంది.
ఈ ట్రైలర్ చూస్తుంటే అన్ని అంశాలు జొప్పించే తీసినట్టుగా ఉంది. యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని సమ పాళ్లలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ట్రైలర్‌లో కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి.
అలాగే 'దబిడి దిబిడి' అంటూ సాంగే సాంగ్లో బాలయ్య, ఊర్వశి రౌతెల్లా మధ్య స్టెప్పులపై విమర్శలు వచ్చినా జనాల్లోకి వెళ్ళింది. అయితే ఈ సాంగ్ కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్, 'డాకు మహారాజ్' సినిమాకి దూరమయ్యే అవకాశం ఉండొచ్చని అంచనా. ఊహించని విధంగా ఈ సాంగ్, యూట్యూబ్లో సూపర్ హిట్ వ్యూస్ తెచ్చుకుంది.
బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. డాకు మహారాజ్ 147.16 నిమిషాల రన్‌టైమ్‌తో U/A సర్టిఫికేట్‌తో సెన్సార్ చేయబడింది, అంటే 2 గంటలు, 27 నిమిషాలు మరియు 16 సెకన్లు. ఇలాంటి యాక్షన్ జానర్‌కి ఇది ఫెరఫెక్ట్ రన్‌టైమ్. బాలకృష్ణ తన సంక్రాంతి విజయ పరంపరను రిపీట్ చేయాలనే ఆశతో ఉన్నా పెద్దగా బజ్ లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
pongal sankranti releases of 2025
సంక్రాంతి పండగ సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు పాజిటివ్ టాక్‌తో మంచి ఓపెనింగ్స్ వస్తాయని డాకు మహారాజ్ టీమ్ అంచనా వేస్తోంది. అన్నీ కుదిరితే ఈ సినిమా బాలకృష్ణ అత్యధిక వసూళ్లు రాబట్టవచ్చు. సెకండాఫ్‌లో ఓ నలభై నిమిషాల పాటు కనిపించే ఈ డాకు ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ అని అర్థం అవుతోంది. మరోసారి సౌండ్ బాక్సుల్ని తమన్ బద్దలు కొట్టేలానే ఉన్నాడు. మొత్తానికి డాకు తో సంక్రాంతి పోటీ మరింత టైట్‌గా మారింది.