- Home
- Entertainment
- అదొక్కటి జరగకుంటే చాలు, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.. రాంచరణ్ సంచలనం, ముందే ఊహించాడా
అదొక్కటి జరగకుంటే చాలు, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.. రాంచరణ్ సంచలనం, ముందే ఊహించాడా
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్లాప్ ఖాతాలో చేరిపోయింది. చాలా ఏరియాల్లో నష్టాలు తప్పేలా లేవు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్లాప్ ఖాతాలో చేరిపోయింది. చాలా ఏరియాల్లో నష్టాలు తప్పేలా లేవు. నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 100 కోట్ల షేర్ సాధించింది. కానీ ఇది సరిపోదు. 300 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. శంకర్ మరోసారి హ్యాండిచ్చారు.
ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుంచి సరైన బజ్ లేదు. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పాన్ ఇండియా చిత్రాలు అంటే విజువల్ వండర్స్ గా ఉండాలి, లేదా వైవిధ్యమైన కథ అయినా ఉండాలి. గేమ్ చేంజర్ చిత్రంతో శంకర్ ఈ రెండూ చేయలేదు. 1990 నుంచి శంకర్ ఇదేతరహా సామజిక అంశాలు ఉన్న కథలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. అది రొటీన్ అయిపోయింది. ఇండియన్ 2 చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ చిత్ర పరిస్థితి కూడా అంతే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
శంకర్ వీలైనంత త్వరగా ఈ తరహా కథలకు ఫుల్ స్టాప్ పెట్టాలని విశ్లేషకులు భావిస్తున్నారు. రాంచరణ్ ఈ చిత్ర రిజల్ట్ ని ముందే ఊహించినట్లు ఉన్నారు. అందుకే ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొనలేదు. రీసెంట్ గా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రాంచరణ్ పాల్గొన్న రెండవ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఈ షోలో రాంచరణ్ ఫెయిల్యూర్స్ పై చేసిన వ్యాఖ్యలు గమనిస్తే గేమ్ ఛేంజర్ రిజల్ట్ ని ముందే ఊహించినట్లు అనిపిస్తోంది.
ఫెయిల్యూర్స్ ని ఎలా తీసుకుంటావు అని బాలయ్య అడిగినప్పుడు రాంచరణ్ సమాధానం ఇచ్చారు. చరణ్ వ్యాఖ్యలు సంచలనంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితంలో ప్రతి సందర్భం పాఠమే. ప్రారంభంలో నేను కూడా తప్పులు చేశాను. తప్పుల నుంచి నేర్చుకున్నాను. ఆ తప్పులని రిపీట్ చేయకూడదు. అదొక్కటి మాత్రం మనం చూసుకోవాలి. మిగిలిన అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది.
ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఈ సంవత్సరం మనది కాదు అని భావించాలి. కొన్నిసార్లు ఫ్లాప్ తప్పదు అనే విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. ప్రతి విషయానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే మన టైం కూడా వస్తుంది. అప్పటి వరకు ఎదురుచూడాలి. కుటుంబంలో సమస్యలు వచ్చినా, కెరీర్ లో ఫ్లాప్ ఎదురైనా ఆ బాధకి కూడా సమయం ఇవ్వాలి. ఎందుకంటే బాధ నుంచే పరిష్కారాలు మొదలవుతాయి అని రాంచరణ్ తెలిపారు. అలాగని ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుమిలిపోతూ కూర్చునే మనస్తత్వం నాది కాదు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చోసుకోవడమే మనం చేయాల్సిన పని అని చరణ్ తెలిపారు. అదన్నమాట రాంచరణ్ ఫిలాసఫీ.
రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నుంచి ఫ్యాన్స్ కోరుకుంటున్న పాన్ ఇండియా చిత్రం ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. అంత భారీగా గ్రాండ్ విజువల్స్ తో ఈ చిత్రం ఉంటుందట.