- Home
- Entertainment
- శుక్రవారం సినిమాల కలెక్షన్లు.. సుధీర్‌బాబు, కిరణ్ అబ్బవరం, సన్నీ, రెజీనాలో ఎవరు మునిగారు, ఎవరు తేలారంటే?
శుక్రవారం సినిమాల కలెక్షన్లు.. సుధీర్‌బాబు, కిరణ్ అబ్బవరం, సన్నీ, రెజీనాలో ఎవరు మునిగారు, ఎవరు తేలారంటే?
పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలకు ఛాన్స్ దొరికింది. దీంతో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. గత శుక్రవారం కూడా నాలుగైదు సినిమాలు విడుదలయ్యాయి. మరి మూడు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయి, వాటిని ఆడియెన్స్ ఆదరించారా? అనేది చూస్తే.

శుక్రవారం విడుదలైన చిత్రాల్లో ప్రధానంగా కిరణ్ అబ్బవరం `నేను మీకు బాగా కావాల్సిన వాడిని`, సుధీర్‌బాబు-కృతిశెట్టిల `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రెజీనా, నివేథా థామస్ జంటగా నటించిన `శాకిని డాకిని`, బిగ్ బాస్ ఫేమ్ సన్నీ నటించిన `సకల గుణాభిరామ` వంటి చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. వీటితోపాటు మరో చిన్న సినిమా రిలీజ్ అయ్యింది.
వీటిలో కిరణ్ అబ్బవరం నటించిన `నేను మీకు బాగా కావాల్సిన వాడిని` ప్రారంభంలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల పరంగా ఇది సత్తా చాటుతుంది. ఈ సినిమా మూడు రోజుల్లో మంచి కలెక్షన్లు సాధించింది. అతి తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం మూడు రోజుల్లో ఏకంగా 4.5కోట్లు గ్రాస్ కలెక్షన్లని రాబట్టడం విశేషం. దీంతో ఈ సినిమా ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది.
వరుస పరాజయాలతో ఉన్న సుధీర్‌బాబు, కృతి శెట్టి జంటగా నటించిన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రం మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, ఆ తర్వాత మరింతగా పడిపోయింది. ఇప్పుడు ఫ్లాప్ ఖాతాలోకి చేరింది.ఈ చిత్రం మూడు కోట్లు కూడా వసూళ్లు చేయలేదని టాక్. మొత్తంగా ఇది డిజాస్టర్ జాబితాలో చేరిపోతుంది.
రెజీనా, నివేథా థామస్ నటించిన సినిమా `శాకిని దాకిని` చిత్రం మొదట్లో మంచి బజ్‌తో రిలీజ్ అయ్యింది. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్‌ని తెచ్చుకుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ప్రమోషన్‌కి కనీసం దర్శకుడు కూడా రాకపోవడంతోనే ఈ సినిమా ఫలితాన్ని జడ్జ్ చేయోచ్చు. అన్నట్టుగానే ఇది థియేటర్లో పూర్తిగా నిరాశ పరిచింది.
మరోవైపు గత సీజన్ `బిగ్ బాస్` షోతో పాపులర్ అయ్యారు వీజే సన్నీ. బిగ్ బా్ 5 విన్నర్‌గా నిలిచిన సన్నీకి హీరోగా వరుస ఆఫర్లు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో `సకళ గుణాభిరామ` ఒకటి. ఈ చిత్రం కూడా శుక్రవారం విడుదలైంది. సినిమా ఒకటి విడుదలైందా? అనేదే తెలియకపోవడం గమనార్హం. వీక్ ప్రమోషన్, సడెన్‌గా రిలీజ్ డేట్ ఇవ్వడం ఈసినిమా రిలీజ్ అయిన విషయమే తెలియకుండా వచ్చిపోయింది.
మొత్తంగా గత శుక్రవారం విడుదలైన సినిమాల్లో కిరణ్ అబ్బవరం నటించిన `నేను మీకు కావాల్సిన వాడిని` సినిమానే కలెక్షన్ల పరంగా సేఫ్‌గా ఉందని తెలుస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న కిరణ్‌కిది బూస్ట్ నిచ్చే విషయమనే చెప్పాలి.