- Home
- Entertainment
- Mahesh Babu: సర్కారు వారి పాట మాస్ సాంగ్ లీక్.. దుమ్మురేపుతున్న ట్రాక్ థియేటర్లో ఫ్యాన్స్ కి పూనకాలే!
Mahesh Babu: సర్కారు వారి పాట మాస్ సాంగ్ లీక్.. దుమ్మురేపుతున్న ట్రాక్ థియేటర్లో ఫ్యాన్స్ కి పూనకాలే!
పాటలు హిట్టైతే 50 యాభై శాతం మూవీ హిట్టైనట్లే అంటారు. సర్కారు వారి పాట టీమ్ ఈ విషయంలో ఫుల్ హ్యాపీ. థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఒకదానికి మించి మరొకటి ఉంటున్నాయి. ఇప్పటి వరకు మూడు సాంగ్స్ విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ దక్కింది.

సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) ఫస్ట్ సింగిల్ ''కళావతి'' దుమ్ము రేపింది. యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ఈ సాంగ్ ఏకంగా 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం సమకూర్చగా స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. ఇక ఈ సాంగ్ లోని మహేష్ స్టెప్స్ తెగ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో మహేష్ స్టెప్స్ ఇమిటేట్ చేస్తూ అనేక వీడియో పుట్టుకొచ్చాయి.
అనంతరం సెకండ్ సింగిల్ ''పెన్నీ'' (Penny) సైతం విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ డాటర్ సితార ఫస్ట్ టైం ఈ సాంగ్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆల్ట్రా స్టైలిష్ లో లో సితార, మహేష్ అలరించారు. పెన్నీ సాంగ్ ని వీర లెవెల్ లో ఎంజాయ్ చేశారు.
ఇక థర్డ్ సింగిల్ టైటిల్ సాంగ్. సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. అయితే ఈ మూవీ నుండి నాలుగో పాట అవుట్ అండ్ అవుట్ మాస్ సాంగ్ (Sarkaru Vaari Paata song leaked) లీకైంది. మహేషు మహేషు అంటే సాగే మాస్ మసాలా నంబర్ అదిరిపోయింది. కొన్ని గంటలుగా సోషల్ మీడియాను ఈ సాంగ్ షేక్ చేస్తుంది.
అనుకున్న సమయానికి ముందే సాంగ్ లీకైనందుకు ఫ్యాన్స్ ఒకింత నిరాశ చెందుతున్నారు. అదే సమయంలో పాట సూపర్ కిక్ ఇవ్వడంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై మహేష్ (Mahesh babu)ఈ సాంగ్ కి స్టెప్స్ వేస్తుంటే ఫ్యాన్స్ సీట్స్ లో కూర్చోవడం కూడా కష్టమే. ఆ రేంజ్ లో ఈ సాంగ్ ఉంది. ఈ సాంగ్ తో రికార్డులు గల్లంతే అంటున్నారు.
దర్శకుడు పరశురామ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఆర్ధిక నేరాల నేపథ్యంలో సర్కారు వారి పాట తెరకెక్కుతుంది. మహేష్ నెవర్ బిఫోర్ ఆటిట్యూడ్, అవతార్ లో అలరించనున్నాడని సమాచారం. మహేష్ లుక్ పట్ల ఫ్యాన్స్ పూర్తి సంతృప్తిగా ఉన్నారు.
సమ్మర్ కానుకగా మే 12న సర్కారు వారి పాట విడుదల అవుతుంది. కీర్తి సురేష్ (Keerthy Suresh)హీరోయిన్ గా నటిస్తున్నారు. మహేష్ చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలై రెండేళ్లు దాటిపోతుంది. దీనితో ఫ్యాన్స్ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లో ఈ చిత్రం విడుదల కానుంది. మొత్తంగా సర్కారు వారి పాటతో మహేష్ మరో బ్లాక్ బస్టర్ నమోదు చేయడం ఖాయమంటున్నారు.