MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Bullettu Bandi : తెలంగాణ ఫోక్ కు ఆంధ్రా అమ్మాయి అందం తోడయితే.. 48 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందేగా..!

Bullettu Bandi : తెలంగాణ ఫోక్ కు ఆంధ్రా అమ్మాయి అందం తోడయితే.. 48 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందేగా..!

జానపదాలు పల్లె మనుషుల భావాలను అద్భుతమైన మాటలతో వర్ణిస్తాయి. అలాంటి ఓ పల్లెటూరి పెళ్లకూతురు తనకు కాబోయేవాడికోసం పాడుతున్నట్లుగా సాగే ఓ తెలంగాణ ఫోక్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇంతకూ ఆ పాట ఏదో తెలుసా..?

3 Min read
Author : Arun Kumar P
Published : May 07 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వైరల్ గా మారిన బుల్లెట్ బండి సాంగ్
Image Credit : Youtube/Mohana Bhogaraju

వైరల్ గా మారిన బుల్లెట్ బండి సాంగ్

Folk Song : ఒకప్పుడు జానపదాలు అంటే పల్లెటూరు మొరటు మనుషుల పాటలు... అనాగరికంగా ఉంటాయనే అపవాదు ఉండేది. కానీ ప్రస్తుతం అవే సాంగ్స్ ఈ నాగరిక సమాజాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి... నేటి జెన్ జి లను కూడా ఆకట్టుకుంటున్నాయి. అందుకే 'రాను బొంబైకి రాను' అన్నా, 'ఓ పిలగ యెంకటేశు' అన్నా యూట్యూబ్ షేక్ అవుతోంది. కోట్ల వ్యూస్ తో తెలుగు జానపదాలు దూసుకుపోతున్నాయి.

అయితే ఈ తెలంగాణ జానపదాలను ఆంధ్రా టచ్ యాడ్ అయితే... అది తెలుగు ప్రజలందరికీ దగ్గరవుతుంది. ఇదే బుల్లెట్ బండి పాట విషయంలో జరిగింది. కాబోయేవాడికి తన వ్యక్తిగత వివరాలను ఓ అమ్మాయి వర్ణిస్తూ సాగే పాట ఇది... తెలంగాణ మాండలికంలో సాగే ఈ పాటకు ఆంధ్రా అమ్మాయి అందం తోడయ్యింది. దీంతో ''బుల్లెట్ బండెక్కి వచ్చెత్తప్పా డుగ్గుడుగ్గని'' అంటూ సాగే ఈ పాట కోట్లాది మంది మనసులు తట్టింది... ఏ పెళ్లిలో చూసినా ఇదే పాట వినిపించింది. స్వయంగా పెళ్లి కూతుళ్లు ఈ పాటపై డ్యాన్స్ చేయడం ట్రెండ్ గా మారింది. ఇలా ప్రజల్లోకి దూసుకెళ్ళిన ఈ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 486 మిలియన్స్ అంటే 48 కోట్ల 65 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎవరీ మోహన భోగరాజు..?
Image Credit : Youtube/Mohana Bhogaraju

ఎవరీ మోహన భోగరాజు..?

మోహన్ భోగరాజు ప్రముఖ టాలీవుడ్ సింగర్. ఈమే బుల్లెట్ బండి సాంగ్ ను పాడటమే కాదు అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకుంది. తెలంగాణ పల్లె పడుచులా మారి హావభావాలు అద్భుతంగా పండించింది... కానీ నిజానికి ఈమె ఆంధ్రా అమ్మాయి.

మోహన భోగరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. అయితే ఈ చిన్నప్పుడే తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వలసవచ్చి స్థిరపడ్డారు... దీంతో ఆమెకు తెలంగాణ కల్చర్ అబ్బింది. అందుకే తెలంగాణ ఫోక్ సాంగ్ ను ఇంత అద్భుతంగా పాడి, ఆ పదాలకు అనువుగా పాదం కదిపి యావత్ తెలుగు ప్రజలను ఆకట్టుకుంటోంది.

36
బుల్లెట్ బండి సాంగ్ టీం ఇదే..
Image Credit : Youtube/Mohana Bhogaraju

బుల్లెట్ బండి సాంగ్ టీం ఇదే..

ఓ పెళ్ళికూతురు భావాలను బుల్లెట్ బండి సాంగ్ లో పలికించారు రచయిత లక్ష్మణ్. దీనికి అంతే అద్భుతంగా మ్యూజిక్ అందించారు ఎస్కే బాజి. ఇక తరుణ్ కుమార్ అంతే చక్కగా కొరియోగ్రఫి చేశారు. వీటన్నింటికి మోహన భోగరాజు గాత్రం, అందం, అభినయం యాడ్ అయి ఈ పాటను మరో మెట్టు ఎక్కించాయి. అందుకే ఎప్పుడో ఐదారేళ్ళ కింద 2021 యూట్యూబ్ లో విడుదలైన ఈ పాటు ఇప్పటికీ జనాల నోళ్ళలో నానుతోంది... పెళ్లి వేడుకల్లో వినిపిస్తోంది.

46
బుల్లెట్ బండి పాాటలో ఆకట్టుకునే పల్లవి..
Image Credit : Youtube/Mohana Bhogaraju

బుల్లెట్ బండి పాాటలో ఆకట్టుకునే పల్లవి..

పట్టు చీరను కట్టుకుని.. టికిలీ బొట్టు పెట్టుకుని... నడుముకు వడ్డాణం పెట్టుకుని... దిష్టి చుక్క దిద్దుకుని..పెళ్లికూతురులా ముస్తాబై ఉన్నా... నువ్వు ఎక్కడినుండి వస్తావో అని ఎదురుచూస్తున్నా...నీ చేతికి చెయ్యి ఇచ్చి అడుగులో అడుగు వేస్తాను.

నేను మెచ్చినవాడివి, నన్ను మెచ్చేవాడివి కాబట్టి నీ వెంట వస్తాను

నీ బుల్లెట్ బండి ఎక్కి డుగ్గుడుగ్గు అంటూ వచ్చేస్తా..

అందాల దునియాను చూపిస్తాను అంటూ ఓ పెళ్లికాబోయే అమ్మాయి భావాలతో పల్లవి సాగుతుంది.

56
ఆకట్టుకునే మాటలతో అద్భుత చరణాలు..
Image Credit : Youtube/Mohana Bhogaraju

ఆకట్టుకునే మాటలతో అద్భుత చరణాలు..

మొదటి చరణం..

''చేమంతి, మల్లె దండలు అల్లుకున్నాను... నువ్వు నన్ను ఏలుకున్నావు కాబట్టి నీ మెడలో ఈ దండ వేస్తాను... నీ వేలు పట్టుకుని మల్లెలు జడలో పెట్టుకుంటాను... మట్టి మనుషుల్లో పుట్టాను కాబట్టి మంచి మర్యాదలు కలిగివున్నాను'' అంటూ తనగురించి చెప్పుకుంటుంది అమ్మాయి.

రెండో చరణం...

''అవ్వ చాటు ఆడపిల్లను.. మా నాన్న గుండెల్లో ప్రేమను...

ఏడు గడపలల్ల ఒక్కదాన్ని... అన్నదమ్ములకు నేనంటే ప్రాణం...పండు వెన్నెల్లో ఎత్తుకుని, వెన్న ముద్దలు పెడుతూ... మారాలు చేస్తున్నా గారాబంగా పెంచారు.

చేత్తులో పెట్టుకుని అల్లారుముద్దుగా చూసుకున్నారు.

ఇలా పెరిగిన నేను నన్నేనేనుగా నీ చేతికి ఇచ్చేసుకుంటున్నా..'' అంటూ ఆడపిల్లను తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచుతారో... కుటుంబసభ్యులు ప్రేమను ఎలా పంచుతారో వివరించారు.

66
మూడో చరణం..
Image Credit : Youtube/Mohana Bhogaraju

మూడో చరణం..

''నా కుడికాలు నీ ఇంట్లో పెడితే సిరిసంపదలు, సంబరాలు కలుగుతాయి. నిన్ను కన్నవాళ్లను అంటే అత్తామామలను నా తల్లిదండ్రుల్లా భావిస్తా... నీ కష్టాల్లో భాగం పంచుకుంటా..

సుక్క పొద్దుకే అంటే పొద్దుపొద్దునే నిద్రలేచి, సుక్కల ముగ్గు వాకిట్లో వేసి...ఆ చుక్కలే నిన్నునన్ను చూసి మురిసిపోయేలా ఉంటా... నా ఏడు జన్మాలు నీకు ఇచ్చుకుంటా... నీ తోడులో నన్ను నేనే మెచ్చుకుంటా'' అంటూ అత్తవారింట్లో ఓ అమ్మాయి ఎలా ఉండాలో వివరించింది.

ఇలా బుల్లెట్ బండి సాంగ్ ఓ అమ్మాయి పుట్టిట్లో ఎలా ఉండాలి, అత్తవారింట్లో ఎలా ఉండాలి... తనకు కాబోయేవాడికోసం ఎంతలా తపిస్తుందో వివరిస్తూ సాగుతుంది. కాబట్టి ఈ పాట అమ్మాయిలకే ప్రతి ఒక్కరికి అంతలా నచ్చింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
srikakulam folk : మారుమూల పల్లెలో పుట్టి న్యూయార్క్ టైం స్వేర్ కు చేరిన తెలుగు జానపదం.. ఏదో తెలుసా..?
Recommended image2
Folk Song : 'బాయిలోనే బల్లి పలికే' సాంగ్ కి కోట్ల వ్యూస్.. మంగ్లీతోనే మాస్ స్టెప్పులు వేయించిన ఈ సింగర్ నాగవ్వ ఎవరు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved