- Home
- Entertainment
- Acharya: 'ఆచార్య'ను భయపెడుతున్న ఐదు కారణాలు... దర్శకుడు కొరటాలకు అగ్నిపరీక్ష, ట్రాక్ రికార్డు నిలిచేనా!
Acharya: 'ఆచార్య'ను భయపెడుతున్న ఐదు కారణాలు... దర్శకుడు కొరటాలకు అగ్నిపరీక్ష, ట్రాక్ రికార్డు నిలిచేనా!
మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆచార్య మెగా ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకం. చిరు డైహార్డ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఆచార్యను కొన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ వెంటాడుతున్నాయి.

ఆచార్య (Acharya) విజయంపై పరిశ్రమలో అనుమానాలున్నాయి. ప్రధానంగా ఐదు బ్యాడ్ సెంటిమెంట్స్ ఆచార్య మూవీ అభిమానులను భయపెడుతున్నాయి. ఈ బ్యాడ్ సెంటిమెంట్స్ లో ఒక్కటి రిపీట్ అయినా ఆచార్య ఇబ్బందుల పాలైనట్లే. మరి ఆ బ్యాడ్ సెంటిమెంట్స్ ఏమిటో చూసేద్దాం..
Acharya
దర్శకుడు ధీరుడు రాజమౌళి(Rajamouli)తో సినిమా అనే ఇండస్ట్రీ హిట్టే. ఆయనతో సినిమా చేసిన ప్రతి హీరో కెరీర్ బెస్ట్ నమోదు చేసుకుంటారు. అయితే ఆ తర్వాత బోల్తా కొడతారు. రాజమౌళితో సినిమా చేసి భారీ హిట్స్ కొట్టిన హీరోలు తమ నెక్స్ట్ మూవీతో అట్టర్ ప్లాప్ రుచి చూస్తారు. కమెడియన్ సునీల్ నుండి ఎన్టీఆర్ వరకు ఈ సెంటిమెంట్ వదలకుండా వెంటాడింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధే శ్యామ్ ఫలితం మనకు తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ రూపంలో చరణ్ కి పాన్ ఇండియా హిట్ ఇచ్చాడు రాజమౌళి. మరి ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)తర్వాత చరణ్ చేస్తున్న ఆచార్యను రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ వెంటాడితే దారుణమైన ఫలితం చూడాలి.
Acharya movie
ఆచార్య సినిమాకు హీరోయిన్ మార్పులు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రేక్షకుల్లోకి సినిమా పట్ల నెగిటివిటీకి కారణమయ్యాయి. దర్శకుడు కొరటాల శివ మొదటగా త్రిషను ఎంపిక చేశారు. పాత్రకు ప్రాధాన్యం లేదన్న కారణంతో ఆమె మధ్యలో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. త్రిష స్థానంలో కాజల్ ని తీసుకొచ్చారు. తీరా విడుదలకు ముందు ఆమె కూడా సినిమాలో లేదని, కొరటాల బాంబు పేల్చారు. ఆచార్య సినిమాకు మెయిన్ హీరో చిరంజీవికి హీరోయిన్ లేదని తేలిపోయింది. ఇదో పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి.
కాజల్ నిష్ర్కమణతో పూజా హెగ్డే(Pooja Hegde) మాత్రమే ఆచార్య చిత్ర హీరోయిన్. కాగా ఈ మధ్య ఆమెకు కాలం కలిసి రావడం లేదు. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్ రాధే శ్యామ్, విజయ్ బీస్ట్ ఘోరంగా దెబ్బతిన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తర్వాత ఆమెకు హిట్ లేదు. ఆచార్య అభిమానులను భయపెడుతున్న మరొక బ్యాడ్ సెంటిమెంట్ ఈ పూజా హెగ్డే.
ఇక ఆచార్య సినిమాలోని కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేశారు. సహజంగానే రీషూట్ జరిగిన చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. వంట సరిగా కుదరకపోవడం వలెనే మరలా ప్రయత్నించారనే భావన కలుగుతుంది. ఆచార్య మూవీ కొన్ని సన్నివేశాలు రీషూట్ చేసినట్లు దర్శకుడు కొరటాల స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఆచార్య తెరకెక్కించడంలో ఆయన తడబడ్డాడని స్పష్టంగా అర్థం అవుతుంది.
చివరిగా ఆచార్య చిరంజీవి(Chiranjeevi) సెంట్రిక్ మూవీగా మొదలైంది. రామ్ చరణ్ కేవలం 40 నిమిషాల నిడివి కలిగిన కీలక రోల్ చేస్తున్నారనేది టాలీవుడ్ టాక్. ట్రైలర్ విడుదల తర్వాత ఈ భావన పూర్తిగా మారిపోయింది. చిరంజీవి సెంట్రిక్ మూవీ కాస్తా... రామ్ చరణ్(Ram Charan) సెంట్రిక్ గా మారిపోయింది. దానికి తోడు చిరంజీవి పాత్రకు హీరోయిన్ లేదు, చరణ్ పాత్రకు హీరోయిన్ ఉంది. మొదటి నుండి ఆచార్య మూవీ పట్ల ప్రేక్షకుడికి ఉన్న ఆలోచనా విధానం మార్చేసింది ట్రైలర్.
ఇలా మొత్తంగా ఆచార్య మూవీ పట్ల ప్రేక్షకుల్లో గందరగోళం నెలకొంది. అదే సమయంలో ఈ ఐదు బ్యాడ్ సెంటిమెంట్స్ ఆచార్యను వెంటాడుతున్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య విడుదలవుతున్న ఆచార్య ఎంత మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.