MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శిరీష్ తో డేటింగ్ అల్లు అరవింద్ నేరుగా అడిగారు... ఫైనల్ గా నోరు విప్పిన అను ఇమ్మానియేల్ 

శిరీష్ తో డేటింగ్ అల్లు అరవింద్ నేరుగా అడిగారు... ఫైనల్ గా నోరు విప్పిన అను ఇమ్మానియేల్ 

అల్లు శిరీష్-అను ఇమ్మానియేల్ మధ్య ఘాడమైన ప్రేమ కథ నడుస్తుందనేది. టాక్ వీరిద్దరూ పలుమార్లు విహరిస్తూ కనిపించారని, అల్లు శిరీష్ తో అను ఇమ్మానియేల్ డేటింగ్ చేస్తున్నారని వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై అను ఇమ్మానియేల్ స్పందించారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 04 2022, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anu Emmanuel

Anu Emmanuel

అల్లు శిరీష్ తో డేటింగ్ రూమర్స్ పై అను ఇమ్మానియేల్ మాట్లాడుతూ... ఆ వార్తలు నా వరకు వచ్చాయి. మా అమ్మ గారు నాతో చెప్పారు. ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతారు. ఇలా వార్తలు వస్తున్నాయని అమ్మ చెప్పి బాధపడింది. నిజానికి ఊర్వశివో రాక్షసివో చిత్రానికి ముందు శిరీష్ ని కలిసిందే లేదు. ఆ చిత్ర పూజా సెరిమోని రోజు పరిచయమైంది.

26

డైరెక్టర్ స్టోరీ నేరేట్ చేశాక... క్యారెక్టర్ డిస్కషన్ కోసం కాఫీ షాప్ లో కలిశాము. శ్రీ, సింధు పాత్రలను గురించి, వాటిని ఎలా చేయాలి వంటి విషయాలు మాట్లాడుకున్నాము. ఒకరి తత్వం గురించి మరొకరం మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం చేశాము. ఈ రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయి కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటే ప్రేమ కథలు అల్లేస్తారు. 
 

36


అల్లు శిరీష్ తో నాకు స్నేహం ఉంది. ప్రేమించే చనువు కానీ, ఆకర్షణ కానీ లేదు. శ్రీ,సింధు పాత్రల్లో రియలిస్టిక్ గా కనిపించడానికి కష్టపడ్డాము. ఒక లవ్ మూవీలో నటించినా కూడా ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు. నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా నటించాను. అప్పటి నుండి అల్లు అరవింద్ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉంది. 

46

అల్లు అరవింద్ గారు నేరుగా శిరీష్ తో ఎఫైర్ రూమర్స్ గురించి అడిగారు. ఈ గాసిప్స్ గురించి మాట్లాడుకుంటూ మేము బాగా నవ్వుకున్నాము, అని అను ఇమ్మానియేల్ చెప్పుకొచ్చింది. శిరీష్ తో స్నేహం మాత్రమే ఉందన్న అను, ప్రేమకు తావులేదన్నారు. 
 

56
Anu Emmanuel

Anu Emmanuel

ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ.. అమెరికా నుండి నేరుగా పరిశ్రమకు వచ్చాను. యాక్టింగ్ రాదు. భాష రాక ఇబ్బంది పడ్డాను. ఎంతో కొంత టాలెంట్ ఉంది కాబట్టే పరిశ్రమలో ఉన్నానని నమ్ముతున్నాను. ఆరేళ్ళలో 13 సినిమాలు చేయడం చిన్న విషయం కాదని అను ఇమ్మానియేల్ చెప్పుకొచ్చారు. 
 

66
Anu Emmanuel

Anu Emmanuel

ఆమె హీరోయిన్ గా నటించిన ఊర్వశివో రాక్షసివో నేడు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. శిరీష్ తో పాటు ఆమెకు మంచి హిట్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. హిట్ టాక్ సొంతం చేసుకున్న ఊర్వశివో రాక్షసివో కమర్షియల్ గా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక మందన్న పెళ్లి వార్తల వేళ.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్, ఇంతకీ అందులో ఏముంది?
Recommended image2
మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
Recommended image3
రామ్ చరణ్ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ, మెగాస్టార్ ఏమన్నారు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved