పంతం నెగ్గించుకున్న పవన్, తగ్గిన క్రిష్... ఎట్టకేలకు హరిహర వీరమల్లుకు మోక్షం!
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు... హీరో అనుకుంటే జరిగిపోవాల్సిందే. లేదంటే దర్శకుడు, నిర్మాత రోడ్డునపడతారు. కమర్షియల్ సినిమా జెనరేషన్ లో హీరోలదే హవా. దర్శక నిర్మాతలు హీరోలను శాసించే రోజులు కెవి రెడ్డి, చక్రపాణి రోజుల్లోనే పోయాయి. ఇష్టం ఉన్నా లేకున్నా స్టార్ హీరో చెప్పింది చేయాల్సిందే.

కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆగిపోయిన విషయం తెలిసిందే. హరి హర వీరమల్లు రషెస్ చూసిన పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందలేదు. అలాగే సెకండ్ హాఫ్ లో స్క్రిప్ట్ కి పవన్ మార్పులు, చేర్పులు సూచించారు. దానికి డైరెక్టర్ క్రిష్ ఒప్పుకున్నట్లు లేడు. దీంతో షూటింగ్ ఆగిపోయింది.
సినిమాలు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మధ్యలో ఉన్న హరి హర వీరమల్లు పక్కన పెట్టి వినోదయ సిత్తం రీమేక్ సైలెంట్ గా స్టార్ట్ చేశారు. మరోవైపు అక్టోబర్ నుండి ఆయన బస్ యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో హరి హర వీరమల్లు భవిష్యత్ సందిగ్ధంలో పడింది.
Hari Hara Veera Mallu
హరి హర వీరమల్లు నిర్మాత ఏ ఎం రత్నం ని ఈ ప్రాజెక్ట్ ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే హరి హర వీరమల్లు బడ్జెట్ అనుకున్నదాని కంటే భారీగా పెరిగిపోయింది. రెండేళ్లుగా షూటింగ్ జరుగుతున్నా కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే పూర్తి చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ని ఒప్పించి హరి హర వీరమల్లు పూర్తి చేయాలని ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
సినిమా ఫలితం ఏదైనా కానీ పూర్తి చేసి విడుదల చేయడం ద్వారా కొంతలో కొంత బయటపడవచ్చు అనేది ఆయన ఆలోచన. ఎట్టకేలకు దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ మధ్య నిర్మాత ఏ ఎం రత్నం సంధి కుదిర్చాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన మార్పులు చేసేలా క్రిష్ కి నచ్చజెప్పాడు. తాజా సమాచారం ప్రకారం హరి హర వీరమల్లు షూట్ పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు.
ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ అక్టోబర్ లోపు పూర్తి చేయాలి. ఇది పవన్ విధించిన నిబంధలలో ఒకటిగా ఉంది. మరి ఇంత పెద్ద పీరియాడిక్ ప్రాజెక్ట్ హరి హర వీరమల్లు తక్కువ సమయంలో ఎలా పూర్తి చేస్తాడనేది చూడాలి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆక్వామాన్, స్టార్ వార్స్ వంటి చిత్రాలకు పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్ బెన్ లాక్ హరి హర వీరమల్లు చిత్రానికి విఎఫెక్స్ వర్క్ చేయనున్నారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్ర చేస్తున్నారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.