- Home
- Entertainment
- సుడిగాలి సుధీర్-రష్మీ హీరో హీరోయిన్స్ గా సినిమా.. ఇక పెద్ద తెరపై రొమాన్స్ కి రంగం సిద్ధం.. క్రేజీ టైటిల్ ?
సుడిగాలి సుధీర్-రష్మీ హీరో హీరోయిన్స్ గా సినిమా.. ఇక పెద్ద తెరపై రొమాన్స్ కి రంగం సిద్ధం.. క్రేజీ టైటిల్ ?
బుల్లితెరపై సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సుధీర్ హీరోగా మారిన నేపథ్యంలో వీరిద్దరూ కలిసి మూవీ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.

Sudigali Sudheer
బుల్లితెర ప్రేక్షకుల్లో సుధీర్-రష్మీ జంటకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వారిద్దరిని స్క్రీన్ పై చూడటానికి ఉబలాట పడతారు. జబర్దస్త్ వేదికగా రష్మీ-సుధీర్ రొమాన్స్,కెమిస్ట్రీ మొదలైంది. ఢీ రియాలిటీ షోలో ఈ జంట చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. రష్మీ, సుధీర్ కలిసి స్కిట్ చేసినా, డ్యూయట్ లో కాలు కదిపినా ఫ్యాన్స్ కి పండగే.
Sudigali Sudheer
రష్మీ-సుధీర్ కాంబినేషన్ అత్యంత ప్రజాదరణ పొందిన నేపథ్యంలో వీరిపై అనేక ప్రత్యేక ఈవెంట్స్, స్కిట్స్ రూపొందించారు. రెండు సార్లు వీరికి ఉత్తుత్తి పెళ్లి కూడా చేశారు. పట్టుబట్టల్లో నిజమైన దంపతులకు ఏమాత్రం తగ్గకుండా రష్మీ-సుధీర్ మ్యారేజ్ జరిగింది. ఈ ఈవెంట్స్ ఎపిసోడ్స్ కి రికార్డు టీఆర్పీ తెచ్చిపెట్టాయి.
Sudigali Sudheer
అయితే సుధీర్-రష్మీ లను సిల్వర్ స్క్రీన్ పై చూడాలనేది వారిద్దరి ఫ్యాన్స్ ఆశ. ఇద్దరూ కలిసి కనిపిస్తే రచ్చ రచ్చే అని వారు నమ్ముతున్నారు. సుధీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చాక ఫ్యాన్స్ ఆయనకు ఈ ప్రపోజల్ పెట్టారు. రష్మీని సైతం సుధీర్ తో కలిసి మూవీ ఎప్పుడు చేస్తున్నారని అడగడం జరిగింది. చర్చల దశలో ఉంది. ఓకే అయితే ఖచ్చితంగా కలిసి మూవీ చేస్తామని ఆమె చెప్పారు.
Sudigali Sudheer
కాగా తాజా ఇంటర్వ్యూలో సుధీర్ క్లారిటీ ఇచ్చారు. `గాలోడు` మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సుధీర్ ఈ విషయంపై మాట్లాడారు. త్వరలో రష్మి తాను కలిసి సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. మహిళా ప్రధానంగా సినిమా ఉంటుందన్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని పేర్కొన్నారు. అయితే ఈ సినిమాకి `గజ్జెల గుర్రం` అనే టైటిల్ వినిపిస్తుండటం విశేషం.
Sudigali Sudheer
సుధీర్ ప్రకటన ఫ్యాన్స్ లో ఆశాభావం రేకెత్తించింది. ఇక జబర్దస్త్ కి తిరిగి వస్తున్నట్లు సుధీర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఖాళీగా ఉన్నానని మల్లెమాల వాళ్లకు సమాచారం ఇచ్చాను. వారు నాపై కొత్త షో రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అలాగే `జబర్దస్త్`లోకి వస్తున్నాను అన్నారు.
హీరోగా చేస్తున్నప్పటికీ టెలివిజన్ షోస్ ఆపను అన్నారు. మరో ఛానల్ నా పై ఒక మ్యాజిక్ షో ప్లాన్ చేస్తుంది. పలు బుల్లితెర ఆఫర్స్ వస్తున్నాయి. నటుడిగా, బుల్లితెర యాంకర్ గా నా జర్నీ కొనసాగుతుందని సుధీర్ క్లారిటీ ఇచ్చారు.
Sudigali Sudheer - Rashmi gautam
నవంబర్ 18న గాలోడు విడుదల అవుతుంది. మాస్ ఇమేజ్ కోసం గాలోడు చిత్రం చేశాను. నాతో సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రం చేసిన దర్శక నిర్మాతలే గాలోడు చిత్రం చేశారు. దర్శకుడు రాజశేఖరెడ్డి కాగా, నిర్మాత శేఖర్ బాబు అని సుధీర్ చెప్పుకొచ్చారు.`గాలోడు`, సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రాల్లో కూడా రష్మీ హీరోయిన్ గా అనుకున్నారట. కొన్ని అనివార్య కారణాలతో అది కుదర్లేదట. ఇక `గాలోడు` చిత్ర విజయంపై సుధీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పనిపాట లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే గాలోడు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కోవడం, దాన్నుంచి బయటపడేందుకు ఆయన పడే స్ట్రగుల్ ప్రధానంగా సినిమా సాగుతుందట. యాక్షన్ ప్రధానంగా సినిమా సాగుతుందని, అన్ని అంశాలున్నాయని, యాక్షన్ ఇమేజ్ కోసం ఈ సినిమా చేశానని తెలిపారు సుడిగాలి సుధీర్.