- Home
- Entertainment
- రజనీ కాంత్ నుంచి అల్లు అర్జున్ వరకు, డై హార్డ్ ఫ్యాన్స్ ని పెళ్ళి చేసుకున్న సినీ తారలు ఎవరంటే..?
రజనీ కాంత్ నుంచి అల్లు అర్జున్ వరకు, డై హార్డ్ ఫ్యాన్స్ ని పెళ్ళి చేసుకున్న సినీ తారలు ఎవరంటే..?
తమ అభిమాన నటీనటుల పెళ్లిళ్ల గురించి ఎదురుచూసే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. తమ అభిమాన నటులను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించే వారు ఉన్నారు. అయితే తమను అమితంగా ప్రేమించే అభిమానులనే పెళ్లాడిన స్టార్స్ ఉన్నారని మీకు తెలుసా..?

రజనీ కాంత్ నుంచి అల్లు అర్జున్ వరకూ.. ఇండియాలో ఉన్న అన్ని భాషల ఫిల్మ్ ఇండస్ట్రీలలో.. చాలా మంది స్టార్స్ తమను ప్రాణంగా ప్రేమించే అభిమానులను... ప్రెళ్లి చేసుకున్నారు. ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్ మహా అయితే తిరిగిప్రేమిస్తారు అన్న ప్రభాస్ డైలాగ్ ను నిజం చేశారు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్... ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా తన అభిమానినే పెళ్లాడాడు. స్నేహారెడ్డి బన్నీకి వీరాభిమానట. ఆమెను ఓ పార్టీలో చూసి ఇష్టపడి, ఆతరువాత ప్రేమించుకుని పెళ్ళాడారు ఈ ఇద్దరు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఏ చీకు చింతా లేకుండా ఎంజాయ్ చేస్తున్న ఫిల్మ్ కపుల్స్ లో వీరుకూడా ఉన్నారు.
నేచురల్ స్టార్ నానీ కూడా అంతే తనను ప్రాణంగా ప్రేమించే అభిమాని అంజనను పెళ్లాడి.. తను కూడా ప్రాణంగా చూసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ గా మారిన ఈ ఇద్దరి స్నేహం ప్రేమగా మారి.. పెళ్లి బంధంతో ఒక్కటైయ్యింది.
ఆమిర్ ఖాన్ ను పెళ్లాడిన కిరణ్ రావు కూడా...ఆయనకు అభిమానే. ఆమిర్ ఖాన్ నటన అంతే ఆమెకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన నటించిన లగాన్ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసింది.. ఆతరువాత ఆమిర్ నే ఇంప్రెస్ చేసి పెళ్లాడింది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఆయన భార్య సంగీత వీరాభిమాని. ఆమె ఓ సారి ఓ సినిమా షూటింగ్ లో విజయ్ ను కలిసి.. తాను విజయ్ ను ఎంత అభిమానిస్తుందో వెంటనే చెప్పేసింది. అయితే వారి స్నేహం పెరుగుతూ.. ప్రేమగా మారి ఇద్దరు ఒకటయ్యారు.
వీరేకాదు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా ఒకరు. ఆయన కూడా తన అభిమానినే పెళ్ళాడారు. రజనీకాంత్ శ్రీమతి లతా తన కాలేజ్ మ్యాగజైన్ కోసం రజనీ కాంత్ ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. అలావారి స్నేహం ప్రేమగా చిగురించి.. పెళ్లి వరకూ వచ్చింది.
మరో కోలీవుడ్ కపుల్ మాధవన్, సరితలది కూడా ఇలాంటి వివాహమే. మాధవన్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్ షాప్ ను నిర్వహించే టైమ్ లో.. సరిత ఆయనకు స్టూడెంట్ గా వచ్చింది. అంతమందిలో సరిత ఒక్కతే మాధవన్ ను ఇంప్రెస్ చేసి.. ఆయన లైఫ్ పార్ట్ నర్ గా మారింది. అంతే కాదు... మాధవన్ కు ఆమె వీరాభిమాని కూడా.
అటు ముంబయ్ లో పెద్ద ప్యాపార వేత్త అయిన రాజ్ కుంద్రా.. శిల్ప శెట్టి నటనకు అభిమాని. నిర్మాతగా కూడా సుపరిచితుడైన రాజ్ కుంద్రా.. తన అభిమాన తార శిల్పాశెట్టిని ప్రేమించి, ఒప్పించి పెళ్ళాడాడు. ఇలా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ తమ అభిమానులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.