MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Fauji-Prabhas: `ఫౌజీ` మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం, ప్రభాస్‌కి ఎలా ఉందంటే? ఇయర్‌ ఎండ్‌లో పండగే

Fauji-Prabhas: `ఫౌజీ` మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం, ప్రభాస్‌కి ఎలా ఉందంటే? ఇయర్‌ ఎండ్‌లో పండగే

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `ఫౌజీ` సెట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కొద్దిపాటి నష్టం జరిగిందని తెలుస్తోంది. మరి ప్రభాస్‌ ఎలా ఉన్నాడనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 10 2026, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఫౌజీ మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం
Image Credit : Asianet News

ఫౌజీ మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం

ప్రభాస్‌ ప్రస్తుతం `స్పిరిట్‌` మూవీతోపాటు `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. `ఫౌజీ‌` మూవీ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుందట. సినిమా కోసం వేసిన సెట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో, ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా సెట్‌లో సడెన్‌గా మంటలు అంటుకున్నాయని, టెంట్లు, ఇతర సామగ్రి పాక్షికంగా కాలిపోయిందనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఓ వ్యక్తికి స్వల్పంగా గాయాలు అయ్యాయట. ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన లేదని సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రభాస్‌ సేఫ్‌
Image Credit : our own

ప్రభాస్‌ సేఫ్‌

ఇదిలా ఉంటే ప్రభాస్‌ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం అనేసరికి డార్లింగ్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ సెట్‌లో ప్రభాస్‌ లేరని సమాచారం. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే మొదట `స్పిరిట్‌` మూవీ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుందనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని, `ఫౌజీ` మూవీ సెట్‌లో ఈ ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగిందని టాక్‌. దీంతో షూటింగ్‌ నిలిపివేశారని, మళ్లీ శుక్రవారం నుంచి స్టార్ట్ చేయబోతున్నారట. కాకపోతే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేదు. టీమ్‌ స్పందిస్తే గానీ ఏం జరిగిందనేది క్లారిటీ వస్తుంది.

Related Articles

Related image1
Dacoit Movie Review: డెకాయిట్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ మూవీ ఎలా ఉందంటే ?
Related image2
Samantha: తృటిలో తప్పించుకున్నా, లేదంటే నా లైఫ్‌ కూడా సావిత్రిలా అయిపోయేది.. ప్రేమపై సమంత కామెంట్‌
33
డిసెంబ్‌లో ప్రభాస్‌ అభిమానులకు పండగే
Image Credit : our own

డిసెంబ్‌లో ప్రభాస్‌ అభిమానులకు పండగే

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `ఫౌజీ` చిత్రంలో ఇమాని హీరోయిన్‌గా నటిస్తోంది. మిథున్‌ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ ఖేర్‌, రాహుల్‌ రవింద్రన్‌ వంటి వారు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ప్రధానంగా మూవీ రన్‌ అవుతుందట. ఇందులో సైనికుడిగా ప్రభాస్‌ కనిపిస్తారని, యాక్షన్‌, లవ్‌ స్టోరీ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. దేశం కోసం పోరాడిన ఒక వీరుడి కథని ఇందులో చూపించబోతున్నారట హను రాఘవపూడి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్‌ తప్ప మరే అప్‌ డేట్‌ రాలేదు. దీంతో అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌ డేట్‌ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కాబోతుందని సమాచారం. ఆ దిశగా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట. సినిమా ఔట్‌పుట్‌ బాగా వస్తుందని, షూటింగ్‌ అయిపోయాక ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Related Stories
Recommended image1
Dacoit Movie Review: డెకాయిట్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ మూవీ ఎలా ఉందంటే ?
Recommended image2
Samantha: తృటిలో తప్పించుకున్నా, లేదంటే నా లైఫ్‌ కూడా సావిత్రిలా అయిపోయేది.. ప్రేమపై సమంత కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved