- Home
- Entertainment
- నాగ్ అశ్విన్ కే ఝలక్ ఇచ్చిన `జాతిరత్నాలు` బ్యూటీ.. పొగరుతో ఆ సమాధానం.. చివరికి ఏం చేసిందంటే?
నాగ్ అశ్విన్ కే ఝలక్ ఇచ్చిన `జాతిరత్నాలు` బ్యూటీ.. పొగరుతో ఆ సమాధానం.. చివరికి ఏం చేసిందంటే?
`జాతిరత్నాలు` చిత్రంతో తెలుగులో పాపులర్ అయిన ఫరియా అబ్దుల్లా ఏకంగా `కల్కి 2898 ఏడీ` డైరెక్టర్ ఆఫర్‌ని తిరస్కరించిందట. చాలా పొగరుగా నో చెప్పిందట.

నాగ్ అశ్విన్ మూడో సినిమాతోనే పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. మూడో సినిమాతోనే వెయ్యి కోట్ల మూవీ చేసి రికార్డు సృష్టించారు. అలాంటి నాగ్ అశ్విన్ ఆఫర్ చేస్తే ఎవరైనా వదులుకుంటారా? అప్ కమింగ్ నటీనటులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ నో చెప్పరు. కానీ ఓ హీరోయిన్ మాత్రం నో చెప్పింది.
నాగ్ అశ్విన్ కి `జాతిరత్నాలు` బ్యూటీ నో చెప్పడం విశేషం. `జాతిరత్నాలు` సినిమాతో తెలుగుకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఫరియా అబ్దుల్లా. థియేటర్ నుంచి వచ్చిందీ బ్యూటీ. `జాతిరత్నాలు` సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పలు ఆఫర్లు అందుకుని రాణిస్తుంది. అదే సమయంలో సెలక్టీవ్‌గా వెళ్తూ అలరిస్తుంది. మరి ఫరియా.. నాగ్ అశ్విన్‌కి ఎందుకు నో చెప్పింది? ఆ సినిమా ఏంటి? చివరికి ఏం జరిగిందనేది చూస్తే..
JathiRatnalu
`ఎవడే సుబ్రమ్మణ్యం`, `మహానటి` చిత్రాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత ఆయన `జాతిరత్నాలు` అనే కామెడీ ఫిల్మ్ ని నిర్మించారు. వైజయంతి, స్వప్న బ్యానర్స్ లో ఈ మూవీని నిర్మించారు. నాగ్ అశ్వినే దీనికి సంబంధించి అన్నీ చూసుకున్నాడు. ఆయన స్నేహితుడు అనుదీప్ దీనికి దర్శకుడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. నవీన్‌కి జోడీగా ఫరియా అబ్దుల్లా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇందులో హీరోయిన్ పాత్ర కోసం ఫరియా అబ్దుల్లాని అడిగాడట నాగ్ అశ్విన్. ఓ సారి ఫరియా కాలేజ్‌కి గెస్ట్ గా నాగ్ అశ్విన్ వెళ్లాడట. అందులో చాలా మంది నాగ్‌ని విష్ చేశారు. వారిలో ఫరియా కూడా ఉంది. ఆమె దర్శకుడితో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆయన్ని ఫాలో అయ్యింది. నాగ్ అశ్విన్ కూడా ఫరియాని ఫాలో అయ్యాడు. ఆ సమయంలో `జాతిరత్నాలు` ఆడిషన్ జరుగుతుంది. హీరోయిన్ పాత్ర చేస్తావా అని ఫరియాని అడిగాడట నాగ్ అశ్విన్. కానీ అప్పటికే ఫరియా పూనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కి అప్లై చేసింది. అందులో తనకు సీటు వస్తుందని చెప్పి ఆ సమయంలో నాగ్ అశ్విన్‌కి నో చెప్పిందట. చాలా పొగరుగా ఆయన ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట.
ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఫరియా అలా చేసింది. తీరా తనకు సీట్ రాలేదు. దీంతో ఆ తర్వాత నెమ్మదిగా కూల్ అయ్యింది. తప్పు తెలుసుకున్న ఫరియా మళ్లీ నాగ్ అశ్విన్‌కి ఫోన్ చేసి నేను ఆడిషన్ ఇవ్వచ్చా అని అడిగిందట. లక్కీగా అప్పటికీ ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. నాగ్ అశ్విన్ కూడా పెద్ద మనసు చేసుకుని ఫరియాని ఆడిషన్ చేసి, ఆఫర్ ఇచ్చాడు. దీంతో `జాతిరత్నాలు`లో ఆమె ఇన్నోసెంట్‌గా చేసిన యాక్టింగ్ అదిరిపోయింది. చాలా మంది కుర్రాళ్లు ఆమెకి ఫ్యాన్స్ అయిపోయారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టింది ఫరియా.
Faria Abdullah
`జాతిరత్నాలు` తర్వాత `బంగార్రాజు`లో స్పెషల్ సాంగ్ చేసి రచ్చ చేసింది. `లైక్ షేక్ అండ్ సబ్ స్క్రైబ్` చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. రవితేజ హీరోగా వచ్చిన `రావణాసుర`లోని ఓ హీరోయిన్‌గా మెరిసింది. ఇటీవల అల్లరి నరేష్‌తో ` ఆ ఒక్కటి అడక్కు` లో హీరోయిన్ గా ఆకట్టుకుంది. అంతేకాదు నాగ్ అశ్విన్ రూపొందించిన `కల్కి 2898 ఏడీ`లోనూ గెస్ట్ గా మెరిసింది ఫరియా అబ్దుల్లా. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తుంది.