MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • 'దేవర' కు దుమ్ము దులిపే ఫ్యాన్సీ ఆఫర్స్, నాగవంశీ పండగ చేసుకుంటున్నారా?

'దేవర' కు దుమ్ము దులిపే ఫ్యాన్సీ ఆఫర్స్, నాగవంశీ పండగ చేసుకుంటున్నారా?

దేవర చిత్రం తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నారని సమాచారం. 

4 Min read
Author : Surya Prakash
Published : Jun 19 2024, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Devara

Devara


ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటన్నది మూడు సినిమాల గురించే. అవి ప్రభాస్ కల్కి,అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర. ప్రభాస్ కల్కి అయితే మరో వారంలో మన ముందుకు రాబోతోంది. పుష్ప విషయానికి వస్తే  ఆగస్ట్ 15కు వస్తుందనుకుంటే రకరకాల కారణాలతో వాయిదా పడింది. దాంతో జనం దృష్టి పూర్తిగా దేవర పైకి మళ్ళింది. కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం  భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కావటం, ఇప్పటికే బయిటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ క్లిక్ అవటంతో బిజినెస్ వర్గాల్లో ‘దేవర’హాట్ కేక్ లా మారింది. దాంతో ఫ్యాన్సీ ఆఫర్స్ తో దేవర ముందు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211


దేవర చిత్రం తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నారని సమాచారం. ఆయన తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం బయిటకు రాగానే వంశీకు భారీ గా రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్ ఇచ్చి రైట్స్ పెట్టుకుని వంశీ ...డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దాంతో తన జేబులోంచి పడకుండానే వంశీకు మంచి లాభాలు రాబోతున్నట్లు చెప్తున్నారు.  అయితే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఏమీ లేదు.  దసరా సీజన్ లో టెర్రిఫిక్ బజ్ తో ఈ సినిమా రిలీజ్ కానుండటమే అందుకు కారణం. 
 

311


అలాగే  రిలీజ్ డేట్ ని ముందుకు తీసుకొచ్చి సెప్టెంబర్ 27 కి  ఫిక్స్ చేయటం  కూడా డిస్ట్రిబ్యూటర్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది. దసరా ముందు సినిమాకు ఉన్న క్రేజ్ తో కలెక్షన్స్ వస్తాయి. దసరా శెలవుల్లో ఎలాగూ ప్లస్ అవుతాయి.  వాస్తవానికి దసరా కానుకగా అక్టోబర్ 10న మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ 'దేవర' చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి.. దసరా సందర్భంగా పలు భాషల నుంచి భారీ పోటీ ఏర్పడనుంది. దసరా కానుకగా అదే తేదీని రజనీకాంత్ 'వెట్టయన్' ఫిక్స్ చేశారు. 

411


అలాగే.. చైతూ తండేల్,  నటసింహం బాలకృష్ణ 109వ సినిమా కూడా దసరాకే రాబోతోందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 'దేవర' సినిమా రెండు వారాల ముందుగా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. సెప్టెంబర్ 27 నుంచి వస్తున్న వరుస సెలవులు కూడా 'దేవర'కి ప్లస్ అవుతాయని టీమ్ భావించింది. ఈ నేపథ్యంలో.. ఆ డేట్ ఫిక్స్ అయింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ 'ఓజీ' సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది.పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆ సమయంలో 'ఓజీ' రావడం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. 'దేవర' సెప్టెంబర్ 27కి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
 

511

 ఈ సినిమా ప్లస్ ల విషయానికి వస్తే... ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న తారక్‌ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య కారణం. ఆచార్యతో వెనక బడ్డ దర్శకుడు కొరటాల శివ ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఓ అద్భుత చిత్రంగా ‘దేవర’ను తీర్చిదిద్దుతున్నారనే టాక్ రావటం మరో ప్లస్  పాయింట్. 

611


రీసెంట్ గా  గోవాలో ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌ మీద ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించారు. గోవాలో భారీ వర్షం కురుస్తున్నా వెనుకడుగు వేయకుండా, రాజీ పడకుండా ఈ ఫైట్‌ చిత్రీకరించడం గమనార్హం. త్వరలో థాయ్‌లాండ్‌లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ మీద ఓ మెలోడియస్‌ సాంగ్‌ను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.
 

711


ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దేవర టీమ్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమైన నార్త్ థియేట్రికల్ రిలీజ్‌ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌‌ను రంగంలోకి దింపింది. "ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. ఒక మాస్ తుపాను మనందరినీ ముంచేయడానికి త్వరలోనే రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో బిగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి" అంటూ కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

811


కరణ్ జోహార్‌తో పాటు AA ఫిలిమ్స్ సంయుక్తంగా నార్త్‌లో దేవర సినిమాను రిలీజ్ చేయబోతుంది. కరణ్ జోహార్‌ లాంటి నిర్మాత బాలీవుడ్‌లో దేవరను రిలీజ్ చేస్తుండటంతో దేవర మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేవర సినిమాను నార్త్‌లో వీలైనంత ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
 

911

దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.    ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  

1011


‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం    'దేవర' .  ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.   దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. 

1111


మరో ప్రక్క ఎన్టీఆర్ బాలీవుడ్ రంగప్రవేశానికి అంతా సిద్దమైంది.  'వార్ 2'తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. నందమూరి కుటుంబ వారసుడికి హిందీలో మంచి ఫాలోయింగ్ ఉందని అర్దం చేసుకున్న హిందీ నిర్మాణ సంస్దలు ఆయన్ని తమ సినిమాల్లో చేయమని అడుగుతున్నారు. ఇదంతా ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర బిజినెస్ కు కలిసి వస్తోంది. అక్కడ మీడియా ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతోంది. దాంతో ఎన్టీఆర్ దేవర కొనటానికి అక్కడ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇదేమీ ఇప్పుటికిప్పుడు వచ్చిన క్రేజ్ కాదు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved