MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiru Vs Suman: కృష్ణ వర్సెస్ ఎన్టీఆర్ ముగిసింది, చిరంజీవితో పోటీ మొదలైంది.. నోరు జారడం వల్లే దెబ్బతిన్నా

Chiru Vs Suman: కృష్ణ వర్సెస్ ఎన్టీఆర్ ముగిసింది, చిరంజీవితో పోటీ మొదలైంది.. నోరు జారడం వల్లే దెబ్బతిన్నా

సుమన్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో పోటీలో వెనుకబడి పోవడానికి కారణాలు బయటపెట్టారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 24 2026, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటుడు సుమన్
Image Credit : Asianet News

నటుడు సుమన్

నటుడు సుమన్ పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో కాదు. చెన్నైలో జన్మించారు. వాళ్ళ ఫ్యామిలీ కర్నాటకి చెందిన వాళ్ళు. అయినప్పటికీ సుమన్ తెలుగులో పాపులర్ నటుడిగా ఎదిగారు. 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. అనేక సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. సుమన్ గురించిన విషయాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుమన్, చిరంజీవి పోటీ
Image Credit : Asianet News

సుమన్, చిరంజీవి పోటీ

సుమన్ తాను ఎదుర్కొన్న ఓ వివాదం వల్ల కెరీర్ లో వెనుకబడిపోయారు. సుమన్ జైలు జీవితం అనుభవించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలు సుమన్ జైల్లో ఉండడం వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అప్పట్లో సుమన్, చిరంజీవి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. కానీ చిరంజీవి అగ్ర హీరోగా ఎదిగారు. సుమన్ మాత్రం వెనుకబడ్డారు. దీని గురించి సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Related Articles

Related image1
Ravi Teja: నన్ను తీసేసి కొందరు వేస్ట్ గాళ్ళని తీసుకున్నారు, అదే నా బాధ.. రవితేజ కామెంట్స్
Related image2
Nagarjuna: లెనిన్ తో పాటు అవి కూడా ఫ్లాప్ అవుతాయేమో అని చైతూకి డౌట్..ఛాలెంజ్ చేసి మరీ హిట్ కొట్టిన నాగార్జున
35
అదే నా సక్సెస్
Image Credit : Google

అదే నా సక్సెస్

చాలా మంది నా స్నేహితులు ఉన్నావు ఉండాల్సిన స్థానం ఇది కాదు.. ఎక్కడో ఉండి ఉండాలి అని అంటుంటారు. నేను అది ఒప్పుకోను. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి అసలు సంబంధం లేని ఫ్యామిలీ నుంచి వచ్చాను. మొదట తమిళవాళ్లు నన్ను నటుడిని చేశారు. తెలుగు రాకపోయినా ఆ తర్వాత ఇక్కడ కూడానా నాకు ఛాన్సులు వచ్చాయి. 100 సినిమాల్లో హీరోగా నటించాను. ఇంతకు మించిన సక్సెస్ ఏముంటుంది ?

45
మాది ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ కాదు
Image Credit : our own

మాది ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ కాదు

కొందరు చిరంజీవితో పోల్చుతుంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఎన్టీఆర్, కృష్ణ పోటీ ముగిసిపోతున్న రోజులో చిరంజీవి గారు వచ్చారు. అప్పుడే నేను కూడా ఎంటర్ అయ్యాను. అందరూ చిరంజీవి, సుమన్ మధ్య పోటీ అన్నారు. నేను జీవితంలో దెబ్బలు తిన్న మాట వాస్తవమే. ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ కాకపోవడంతో ఇక్కడ ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి అనేది నాకు తెలియదు. తెలియకుండా నోరు జారడం వల్ల ఎదురు దెబ్బలు తగిలాయి.

55
ఇండియాలోనే చిరంజీవి బెస్ట్ డ్యాన్సర్
Image Credit : Asianet News

ఇండియాలోనే చిరంజీవి బెస్ట్ డ్యాన్సర్

కానీ చిరంజీవి గారి విషయంలో ఒక వాస్తవం అందరం అంగీకరించాలి. ఏదైనా సినిమాలో ఫైట్స్ తో పాటు డ్యాన్స్ కూడా బాగా చేయాలి అంటే అందరికీ కనపడే ఆప్షన్ చిరంజీవి. కాబట్టి ఆయనకు ఛాన్సులు పెరిగాయి. చిరంజీవి గారు బెస్ట్ డ్యాన్సర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇండియాలోనే డ్యాన్స్ లో బెస్ట్ ఫుట్ వర్క్ ఉన్న డ్యాన్సర్ చిరంజీవి గారు. అందుకే ఆయన నంబర్ 1 అయ్యారు అని సుమన్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Recommended image2
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Recommended image3
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Related Stories
Recommended image1
Ravi Teja: నన్ను తీసేసి కొందరు వేస్ట్ గాళ్ళని తీసుకున్నారు, అదే నా బాధ.. రవితేజ కామెంట్స్
Recommended image2
Nagarjuna: లెనిన్ తో పాటు అవి కూడా ఫ్లాప్ అవుతాయేమో అని చైతూకి డౌట్..ఛాలెంజ్ చేసి మరీ హిట్ కొట్టిన నాగార్జున
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved