MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ కోసం 250 కి.మీ పాదయాత్ర, అభిమానులతో ఐకాన్ స్టార్ గడిపిన బెస్ట్ ఎమోషనల్ మూమెంట్స్

అల్లు అర్జున్ కోసం 250 కి.మీ పాదయాత్ర, అభిమానులతో ఐకాన్ స్టార్ గడిపిన బెస్ట్ ఎమోషనల్ మూమెంట్స్

అల్లు అర్జున్ అంటే ప్రాణంగా ప్రేమించే అభిమానులు ఉన్నారు. బన్నీపై అభిమానాన్ని రకరకాల రూపాల్లో వెల్లడించిన వారు ఉన్నారు. అల్లు అర్జున్ పై అభిమానులు ప్రేమను చూపించిన  ఐకానిక్ క్షణాల గురించి ఇప్పుడు చూద్దాం. 

3 Min read
Mahesh Jujjuri
Published : Oct 05 2025, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తిరుగులేని స్టార్ గా అల్లు అర్జున్
Image Credit : Asianet News

తిరుగులేని స్టార్ గా అల్లు అర్జున్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేశంలోని పెద్ద పెద్ద పాన్-ఇండియన్ హీరోల సరసన తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. హీరోగా రెండు దశాబ్దాల కెరీర్‌లో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇన్నేళ్లుగా అల్లు అర్జున్ సాధించింది ఒక ఎత్తు అయితే.. పుష్ప, పుష్ప2 సినిమాలతో బన్నీ సాధించింది మరో ఎత్తు. అల్లు అర్జున్ కు నిజమైన గుర్తింపు ఈ రెండు సినిమాల ద్వారా వచ్చింది. ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది. బన్నీ స్వాగ్, స్టైల్, యాక్టింగ్ అభిమానుల హృదయాలను దోచుకున్నాయి. అందుకే యూత్ లోనే కాదు ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలలో కూడా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నారు.

25
అల్లు అర్జున్ ని కలవడానికి 175 కి.మీ సైకిల్ తొక్కిన అభిమాని
Image Credit : Asianet News

అల్లు అర్జున్ ని కలవడానికి 175 కి.మీ సైకిల్ తొక్కిన అభిమాని

ఇక చాలామంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ప్రేమను రకరకాల మార్గాల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు. అందులో కొన్ని క్షణాలు ఎంతో ఎమోషనల్ సిచ్చ్యూవేషన్స్ ను క్రియేట్ చేశాయి. జీవితంలో గుర్తుండిపోయే క్షణాలు బన్నీ కెరీర్ లో ఉన్నాయి. ఓక అభిమాని అయితే అలీఘర్ నుండి హైదరాబాద్ వరకూ అల్లు అర్జున్ ని కలవడానికి 175 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ కు వచ్చాడు. అతన్ని కలిసిన వెంటనే అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అభిమాని ఇచ్చిన మొక్కను సంతోషంగా స్వీకరించాడు బన్నీ. ఒక ఫోటోదిగి, అతనికి కావల్సిన ఏర్పాట్లు చేసి, ఇలా రిస్క్ చేయవద్దని బుజ్జగించాడు అల్లు అర్జున్.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🅗🅐🅡 🅗🅐🅡 🅜🅐🅗🅐🅓🅔🅥 (@mohit_yadav_aligarh)

Related Articles

Related image1
దేవత మూవీ రివ్యూ , 19 ఏళ్ల శ్రీదేవి తో 45 ఏళ్ల వయసులో శోభన్ బాబు రొమాన్స్, ఎమోషన్స్ తో ఏడిపించిన సినిమా
Related image2
30 కోట్ల బడ్జెట్, 300 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన 3 చిన్నసినిమాలు
35
అల్లు అర్జున్ కోసం 250 కి.మీ నడిచిన వ్యక్తి
Image Credit : Asianet News

అల్లు అర్జున్ కోసం 250 కి.మీ నడిచిన వ్యక్తి

అల్లు అర్జున్ అభిమాని ఒకరు మాచర్ల నుండి హైదరాబాద్ కు దాదాపు 250 కి.మీ పాదయాత్రగా నడిచి వెళ్ళాడు. అతను ఆరు రోజుల్లో ఐకాన్ స్టార్ ను చేరుకున్నాడు. అల్లు అర్జున్ ను కలవడమే అతని ఏకైక కోరిక. ప్రయాణం అంతా అల్లు అర్జున్ బిల్ బోర్డును తన వెంట తీసుకెళ్లాడు. సుదీర్ఘమైన ప్రయాణం చేసినప్పటికీ అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడంతో అతన్ని కలవలేకపోయాడు. కానీ ఫోన్ ద్వారా ఆ అభిమానితో మాట్లాడాడు అల్లు అర్జున్.

This Man P.Nageshwar Rao was walking from Macherla to Hyderabad for meet his favourite actor @alluarjun. He started on 17th & reached Banjara hills on 22nd. Despite of many trails he never meet his favourite star..So he just did a padyayathra of 250 KM #incrediblefans@SKNonlinepic.twitter.com/gYQt70483L

— Agasthya Kantu (@agasthyakantu) September 22, 2020

45
అభిమానికి అల్లు అర్జున్ ఓదార్పు
Image Credit : Asianet News

అభిమానికి అల్లు అర్జున్ ఓదార్పు

ఒక సందర్భంలో ఒక అభిమాని అల్లు అర్జున్ ని కలిసిన ఆనందం తట్టుకోలేకపోయాడు. వెంటనే చాలా భావోద్వేగానికి గురై ఆనందాన్ని ఆపుకోలేక ఏడ్చాడు. అల్లు అర్జున్ అతన్ని కౌగిలించుకుని, ఓదార్చాడు, ప్రేమగా మాట్లాడాడు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు బన్నీ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యాడు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది కూడా అల్లు అర్జున్ జీవితంలో మర్చిపోలేని క్షణంగా మిగిలిపోయింది. అంతే కాదు ఒక అవార్డు కార్యక్రమంలో అల్లు అర్జున్ దగ్గరికి ఒక చిన్నారి అభిమాని వచ్చి సెల్ఫీ అడిగింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ పాప ఫోన్ తీసుకుని తనకు నచ్చినట్టుగా ఫోటోలు తీసి ప్రేమగా పలకరించి పంపించాడు బన్నీ.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namaste Bollywood (@namastebollywood.in)

A heartfelt moment captured! ❤️

Witness the touching moment as a diehard fan meets his idol @alluarjun for the first time. Emotions overflow as comforting words and a handshake create memories to last a lifetime.#AlluArjunpic.twitter.com/RS4NalS3kq

— Allu Arjun Fans Association (@AAFAOnline) March 15, 2024

55
అల్లు అర్జున్ కోసం సాహసం చేసిన అభిమాని
Image Credit : ANI

అల్లు అర్జున్ కోసం సాహసం చేసిన అభిమాని

ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్న సమయంలో, ఒక అభిమాని అకస్మాత్తుగా వేదికపైకి పరిగెత్తాడు. భద్రతా సిబ్బంది, బౌన్సర్స్ అతన్ని ఆపడానికి ప్రయత్నించగా, అల్లు జోక్యం చేసుకుని అభిమానిని దగ్గరకు తీసుకున్నాడు. అతనితో ఫోటోదిగి, హగ్ చేసుకుని ఆ అభిమానికి జీవితానికి సరిపడా సంతోషాన్ని అందించాడు బన్నీ. దాంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

"I Love My Fans" - #AlluArjun about His Fans. pic.twitter.com/XhM7QKLw5r

— Rajesh Manne (@rajeshmanne1) December 2, 2024

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved