30 కోట్ల బడ్జెట్, 300 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన 3 చిన్నసినిమాలు
భారీ బడ్జెట్ లేదు, స్టార్ హీరోలు లేరు, ప్రమోషన్స్ చేయలేదు, స్టార్స్ కూడా నటించలేదు. కంటెంట్ ఉంటే చాలు, కటౌట్ అవసరం లేదు అని నిరూపించాయి చిన్న సినిమాలు. ఈమధ్య కాలంలో రిలీజ్ అయిన మూడు సినిమాలు 30 కోట్లు పెడితే 3000 కోట్లు వసూలు చేసి షాక్ ఇచ్చాయి.

కంటెంట్ ఉంటే చాలు
కంటెంట్ ఉంటే చాలు భారీ బడ్జెట్ అవసరంలేదు, స్టార్ హీరోలు అసవరంలేదు, గ్రాండ్ గాప్రమోషన్లు కూడా అవసరం లేదు అని నిరూపిస్తున్నాయి చిన్న సినిమాలు. కథాబలంతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇదే కాన్సెప్ట్ తో మూడు సినిమాలు వచ్చాయి. మూడు డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి రిలీజ్ అయిన ఆ మూడు సినిమాలు 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కాయి, 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించాయి. మలయాళ,కన్నడ,హిందీ పరిశ్రమల నుంచి వచ్చిన ఆ మూడు సినిమాలు, వాటి కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం.
మహావతార్ నరసింహ
ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇలాంటి వింత జరిగి ఉండదు. ఎన్నడూ చూడని రీతిలో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో, క్వాలిటీ గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ లో తెరకెక్కిన సినిమా మహావతార్ నరసింహ. ఈ సినిమా కేవలం ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు, అంతకు మించిన అసాధారణమైన గ్రాఫిక్స్ మాయాజాలం. మహావతార్ నరసింహ అద్భుతమైన స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇంత గ్రాండియర్ లుక్ తో కనిపించిన ఈమూవీ సుమారుగా 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైనట్లు సమాచారం. అయితే, ఈ తక్కువ బడ్జెట్‌తోనే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అసాధారణం. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 300 కోట్ల మార్కును దాటి, కలెక్షన్లలో సరికొత్త రికార్డులను సృష్టించింది.
లోక: చాప్టర్ 1
ఇప్పటి వరకూ స్టార్ హీరోలు నటించిన సినిమాలు మాత్రమే వందల కోట్ల కలెక్షన్స్ సాధించడం చూస్తూ ఉన్నాం. కాని ఫస్ట్ టైమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ, అది కూడా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 300 కోట్లు కొల్లగొట్టింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోక: చాప్టర్ 1' సినిమా ఈ ఘనత సాధించింది. తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ అయిన ఈమూవీలో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. ఈమూవీ తెలుగు ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. యూత్ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నెస్లెన్ కూడా ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించాడు. సూపర్ హీరో తరహా కాన్సెప్ట్ తో .. ఫాంటసీని టచ్ చేస్తూ సాగే ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఆగస్టు 28వ తేదీన విడుదలైన ఈ సినిమా, 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను సౌత్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించగా, ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించినందకు హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కెమెరా మెన్ కు దాదాపు 10 లక్షల ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.
సైయారా
ప్రేమ కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ, అన్నింటికంటే డిఫరెంట్ గా నిలిచింది సైయారా మూవీ. అహాన్ పాండే, అనీత్ పడ్డా, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 18న విడుదలై సంచలనంగా మారింది. ఈసినిమా ప్రత్యేకత దాని ప్రజెంటేషన్. ప్రతి షాట్ కొత్తగా ఉండటం, ఫీల్ గుడ్ మూడ్ కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. మ్యూజిక్, విజువల్స్, ఎమోషన్స్ అన్నీ కలిసి సినిమా విజయం దిశగా నడిపించాయి. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 300 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇలా చిన్న సినిమాలు మూడు బాక్సాఫస్ ను వరుసగా 300 కోట్ల కలెక్షన్స్ తో షేక్ చేశాయి.