- Home
- Entertainment
- సోనాక్షి సిన్హా బాత్‌రూమ్‌లో అభిమాని.. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటూ కత్తితో బెదిరింపులు..వైరల్
సోనాక్షి సిన్హా బాత్‌రూమ్‌లో అభిమాని.. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటూ కత్తితో బెదిరింపులు..వైరల్
సల్మాన్‌తో పెళ్లి వార్తలతో ఇటీవల పాపులార్ అయ్యింది సోనాక్షి సిన్హా. ఇప్పుడు తన అభిమాని బెదిరింపులతో మరోసారి వార్తల్లో నిలుస్తుంది. సోనాక్షి బాత్‌రూమ్‌లో అభిమాని ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనాక్షి సిన్హా. సల్మాన్‌తో `దబాంగ్` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై బొద్దు అందాలతో బాలీవుడ్‌ని ఊపేసింది. ఇటీవల సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు అందాలను నమ్ముకుని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. మరోవైపు మాల్డీవుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
ఇంకోవైపు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా సోనాక్షి పేరు వినిపిస్తుండటం షాక్‌కి గురి చేస్తుంది. కారణం ఆమె బాత్ రూమ్‌లో ఓ అభిమాని చేరడం, తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోవాలని బెదిరించడం, ఏకంగా కత్తితో గొంతుకోసుకుంటానని బెదిరింపులకు దిగిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే..
పెద్దగా సినిమాలు లేని సోనాక్షి సిన్హా.. కలర్స టీవీలో `ది ఖత్రా ఖత్రా` అనే షోలో పాల్గొంది. అయితే ఆ షోలో భాగంగా ఆమె సెట్‌లో తన కారవ్యాన్‌లోకి వెళ్లింది. షూటింగ్ గ్యాప్‌లో రిలాక్స్ అవుతూ ఫోన్ చూసుకుంటుంది. ఇంతలో తన కారవ్యాన్ నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు మీ అభిమానిని అంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. 'మేడమ్ నేను మీకు పెద్ద అభిమానని. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నాన`ని తెలిపాడు.
అంతటితో ఆగలేదు తన చేతిపై సోనాక్షి సిన్హా పచ్చబొట్టు వేసుకున్నట్టు చూపించాడు. కాసేపు సోఫాలో కూర్చొని `నన్ను పెళ్లి చేసుకోండి` అంటూ రిక్వెస్ట్ చేశాడు. దీంతో షాక్ అయిన సోనాక్షి ఏం అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అతను అద్దంపై లిపిస్ట్‌క్‌తో 'ఐ లవ్ యూ సోనా' అని రాశాడు. అంతేకాకుండా 'ఇది నా రక్తంతో కూడా రాయగలను' అని చెప్పాడు. దీంతో వద్దని సోనాక్షి చెప్పడంతో ఆవేశానికి గురై కొన్ని వస్తువులను పడేశాడు. ఆ తర్వాత తన జేబులో నుంచి కత్తి తీసి నన్ను పెళ్లి చేసుకోకపోతే గొంగు కోసుకుని చచ్చిపోతానని బెదిరింపులకు దిగారు. దీంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది సోనాక్షి. దీంతో ఆ వీడియో క్లోజ్ అయ్యింది.
అయితే ఇది షో ప్రోమో కోసం, ప్రమోషన్‌లో భాగంగా చేసిన వీడియో అయి ఉంటుందని తెలుస్తుంది. కారవ్యాన్‌లో కెమెరాలు పెట్టి మరీ చేశారంటే కచ్చితంగా ఫ్రాంక్ వీడియో తరహాలోనే సోనాక్షికి తెలియకుండా చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. `ది ఖత్రా ఖత్రా` షోలో భారతీ సింగ్, హర్ష్ లింబాచియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ స్పెషల్ హోస్ట్‌గా కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా.. హ్యూమా ఖురేషీ, జహీర్ ఇక్బాల్‌తో కలిసి `డబుల్ ఎక్స్‌ఎల్` సినిమాలో నటిస్తుంది.