- Home
- Entertainment
- Prema Entha Madhuram: వేలం పాటలో రెచ్చిపోతున్న మదన్.. నీరజ్, అంజలిల పెళ్లిని చూసి షాకైనా కుటుంబం?
Prema Entha Madhuram: వేలం పాటలో రెచ్చిపోతున్న మదన్.. నీరజ్, అంజలిల పెళ్లిని చూసి షాకైనా కుటుంబం?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భార్య శాడిజం తో పిచ్చివాడైపోతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం

ఎపిసోడ్ ప్రారంభంలో ఇన్ని రోజులూ నువ్వు ఎన్ని తప్పులు చేసినా భరించాం కానీ ఇప్పుడు నువ్వు క్రైమ్ చేసావు. అయినా కూడా నీరజ్ మోహం చూసి నిన్ను క్షమించేస్తున్నాము. నీరజ్ ప్రేమని చంపేసావు నా కుటుంబ పరువు ని తీసేశావు నీవల్ల చాలామంది సఫర్ అవుతున్నారు కానీ ఈరోజు ప్రేమ నిన్ను కాపాడుతుంది అంటాడు ఆర్య. అంటే ఏంటి నన్ను నీరజ్ కాపాడుతున్నాడా అంటుంది మాన్సీ. అవును నీరజ్ లేకపోతే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకో అంటూ కోపంతో మాట్లాడుతుంది శారదమ్మ.
అయితే నీరజ్ ని అడ్డం పెట్టుకొని నేను ఎన్ని తప్పుడు పనులైనా చెయ్యొచ్చన్నమాట అంటుంది మాన్సీ. తప్పుని సరిదిద్దుకోమని అవకాశం ఇస్తున్నారు అంటుంది అను. నీరజ్ సార్ మళ్లీ మళ్లీ తలదించుకునేలాగా ప్రవర్తించకండి అంటాడు జెండే. ఇక్కడ మన కంపెనీ వేలం పాట జరుగుతుంది మనం గొడవపడితే అందరి ముందు చులకన అయిపోతాము మన ఇంటి పరువు తీసేస్తారా అంటుంది అను. ఆర్య సార్ కి చెప్పకుండా ఏమి చేయకండి అంటాడు జెండే. పద్ధతి మార్చుకో అంటూ గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య.
అతని వెనకే అందరూ వెళ్ళిపోతారు. అంజలి, నీరజ్, మాన్సీ మాత్రం ఉండిపోతారు. ఇంతమంది చేత నన్ను తిట్టించావు కదా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నేను లేకపోతే నువ్వు బ్రతకలేవో చూపిస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాన్సీ. అప్పటికే బాగా మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్న నీరజ్ ఇదంతా నా వల్లే అంటూ కోపంగా కార్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. నీరజ్ అబ్నార్మల్ గా ఉన్నాడని గ్రహించిన అంజలి తన కారులో నీరజ్ ని ఫాలో అవుతుంది. మరోవైపు వేలంపాట స్టార్ట్ అవుతుంది. కంపెనీ 1300 కోట్లు చెప్పింది అంటారు వేలంపాట నిర్వాహకులు.
బట్టలు కొట్టుకి 1300 కోట్లు ఎందుకు అందులో ఏమైనా బంగారం తయారు చేస్తారా అంటూ 500 కోట్లకు పాట ప్రారంభిస్తాడు మదన్. అలా అలా 1250 కోట్ల వరకు వెళుతుంది వేలంపాట. మరోవైపు కంట్రోల్ లేకుండా స్పీడ్ గా వెళ్తున్న నీరజ్ ని ఫాలో అవుతూ అతన్ని కారు ఆపమని అరుస్తూ ఉంటుంది అంజలి. అయినా ఆపకుండా వెళ్లి కారుని ఒక చెరువు దగ్గర ఆపి అందులో దూకపోతాడు నీరజ్. అంజలి పరుగు పరుగున వచ్చి అతన్ని చెంప మీద కొట్టి ముందుకి తీసుకొస్తుంది. ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా అంటూ కేకలు వేస్తుంది.
నావల్ల కావడం లేదు నేను దాదాని బాధపెడుతున్నాను నా వల్లే ఇన్ని నష్టాలు అంటాడు నీరజ్. నష్టాలు నీవల్ల వచ్చాయా అయినా నువ్వు చనిపోతే ఆర్య సార్ సంతోషిస్తారా? ఏం మాట్లాడుతున్నావు బుర్ర పని చేస్తుందా అంటూ చివాట్లు పెడుతుంది అంజలి. ఆర్య సార్ ఏం చేసినా నీకోసమే నువ్వే లేకపోతే ఎలా అంటుంది. మరోవైపు వేలంపాట 1290 కోట్లకు పాడుతాడు ఒక వ్యక్తి. ఇప్పటికే ఎక్కువ పాడేసాను.. వాళ్ళు అడిగిన డబ్బు 1300 కోట్లు ఇస్తాను. నందిని టెక్స్టైల్స్ నాదే ఇక పాట ఆపేయండి అంటాడు మదన్. పాట ఇంకా అవలేదు కూర్చోండి వెటకారంగా అంటాడు జెండే.
కానీ ఆ వేలం పాట పంతం కొద్దీ 1500 కి పాడతాడు మదన్. మరోవైపు మొదటి నుంచి దాదాకి నా వల్ల ప్రాబ్లమ్సే నా వల్లే వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఇప్పుడు మాన్సీ నన్ను మించి తప్పులు చేస్తుంది. నన్ను అడ్డం పెట్టుకొని ఇంకెన్ని తప్పులు చేస్తుందో అంటూ ఏడుస్తాడు నీరజ్. నేనే చచ్చిపోతే అసలు ప్రాబ్లమే ఉండదు అంటాడు నీరజ్. అయితే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అంటుంది అంజలి. మరోవైపు వేలంపాటలో తనే గెలిచాను అనుకుంటాడు మదన్. కానీ పాటని పెంచుకుంటూ పోతారు కాంపిటేటర్స్. ఎవడు నాకంటే ఎక్కువ కి పాడుతాడు చూస్తాను అంటూ 2000 కోట్లకి పాట పాడుతాడు మదన్. అతనికి పోటీగా మరెవరు రారు. పాటలో గెలిచినట్లుగా డిక్లేర్ చేయబోతారు వేలం నిర్వాహకులు.
అంతలోనే అంజలి, నీరజ్ పెళ్లి చేసుకొని అక్కడికి వచ్చి అందరికీ షాక్ ఇస్తారు. మీ ఇద్దరూ ఏం చేశారో తెలుసా అంటూ ఆవేశంగా అరుస్తుంది మాన్సీ. కాన్షియస్ లో ఉండే చేసేవా అంటాడు మదన్. మీ ఇద్దరూ కాసేపు ఆగండి అని ఆర్య దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి. మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలని కాదు అనుకొని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అంటుంది అంజలి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.