విడాకుల విషయంలో స్పందించిన కలర్స్ స్వాతి, అఫిషియల్ గా చెపుతానన్న హీరోయిన్
ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఈమధ్య ఎక్కువై పోయాయి. వరుస పెళ్లిళ్లతో పాటు.. వరుసగా విడాకులు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో తాజాగా తెలుగు హీరోయిన్ కలర్స్ స్వాతి విడాకులు తీసుకుంటుందంటూ న్యూస్ హైలెట్ అయ్యింది. ఈ విషయంలో తాజాగా వివరణ ఇచ్చింది బ్యూటీ.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు ఎక్కువైపోయాయి. ఇప్పటికే చాలామంది నటినటులు విడాకులు తీసుకోగా..కొంత మంది స్టార్స్ విడాకులు తీసుకుంటామని ప్రకటించేలోపే ఆడియన్స్ పసిగట్టి... నెటిజన్లు సోషల్ మీడియాలో మోత మోగించేశారు. సమంత, నాగచైతన్య, నిహారిక, శ్రీజ ఇలా సెలబ్రిటీల విడాకులపై ముందు నుంచే వస్తున్న వార్తలు నిజమయ్యామి. ధనుష్ మాత్ర సడెన్ గా విడాకులు ప్రకటించి ఊహించని షాక్ ఇచ్చాడు జనాలకు. ఇక తాజాగా మరో హీరోయిన్ విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీలు వారి విడాకులు వార్తలు ప్రకటించక ముందే.. వారు చేసే పనుల వల్ల నెటిజన్లు కనిపెడుతున్నారు. వారు విడాకులు తీసుకుంటున్నారని గుర్తుపట్టేస్తున్నారు. తాజాగా మాజీ హీరోయిన్ కలర్స్ స్వాతి విషయంలో కూడా ఇదే జరిగుతోంది. ఆమె చెప్పకముందే సోషల్ మీడియా జనాలు కలర్స్ స్వాతి విడాకులు తీసుకుంటుంది అని ప్రచారం చేసేస్తున్నారు.
అయితే సెలబ్రిటీలు అయిన సమంత ,నిహారిక వంటి వారు ఈ విషయాలు అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా తమ సోషల్ మీడియా ఖాతాలో భర్తలతో దిగి ఉన్న ఫోటోలను తొలగించారు. అలా తొలగించిన వారంతా.. విడాకులు తీసుకున్నారు. ఇక తాజగా కలర్స్ స్వాతి కూడా ఆ పనే చేసేవరకు నెటిజన్లు ఈ విషయంల ఫిక్స్ అయిపోయారు.
విడాకులు తీసుకోబోతున్నట్టు కలర్స్ స్వాతి పై వరుసగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కలర్స్ స్వాతి కూడా తన భర్తతో దిగి ఉన్న ఫోటోలన్నీ తొలగించడంతో సోషల్ మీడియా జనాలు ఈ విషయంలో ఫిక్స్ అయ్యారు. ఈక్రమంలో ఈ విషయంలో స్పందించింది కలర్స్ స్వాతి. తన విడాకులు వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
<p style="text-align: justify;">హ్యరీ పోటర్ సినిమాలోని ఓ సన్నివేశంలోని డైలాగ్ లను తనఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన స్వాతి.. తన మీద వస్తున్న రూమర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది.</p>
ఓ సందర్భంలో కలర్స్ స్వాతిని మీడియా ఈ విషయంలో ప్రత్నించగా.. ఆమె స్పందించింది. మీరు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారా చెప్పాలి అని అడగగా.. మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేమీ లేదు.ఒకవేళ అలాంటి విషయం ఉంటే అఫీషియల్ గా నేనే బయటకు చెబుతాను అంటూ చెప్పిందట. ఈ మాట చెప్పనైతే చెప్పింది కాని..గట్టిగా ఖండించలేదు కలర్స్ స్వాతి. దాంతో నెటిజెన్స్ ఈ విషయం నమ్మడం లేదు.
ఇప్పటికే తన భర్తతో విడాకులకు కలర్స్ స్వాతి అప్లై చేసిందని, అధికారికంగా విడాకులు వచ్చాక నిహారిక లాగే తాను కూడా అభిమానులకు ఈ విషయం చెబుతుందని నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.ఇక ఈమె విడాకుల విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక కలర్స్ స్వాతి కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. తెలుగు ఇండస్ట్రీలోకి తెలుగు నుంచి వచ్చి.. కాస్త రాణించిన అమ్మాయి కలర్స్ స్వాతి. తెలుగుతో పాటు.. తమిళంలో కూడా హీరోయిన్ గా రాణించింది కాని.. స్టార్ డమ్ మాత్రం సాధించలేకపోయింది. పెళ్ళి చేసుకుని అబ్రాడ్స్ లో సెటిల్ అయ్యింది బ్యూటీ. ప్రస్తుతం కలర్స్ స్వాతి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి గత ఏడాది పంచతంత్రం,అలాగే ఈ ఏడాది మంత్ ఆఫ్ మధు అనే సినిమాతో ఆకట్టుకుంది.